అప్రమత్తమైన భద్రత
ఆంధ్రభూమి సంపాదకీయం, ఏప్రిల్ 8, 2015
పాక్ ఉగ్రవాద సంస్థ ఐ.ఎస్.ఐ. తన కార్యకలాపాలను ఎన్ని రకాలుగా విస్తరింప జేసుకుంటోందో ఈ వ్యాసంలో చదవండి తెలుస్తుంది.
పాక్ ఉగ్రవాద సంస్థ ఐ.ఎస్.ఐ. తన కార్యకలాపాలను ఎన్ని రకాలుగా విస్తరింప జేసుకుంటోందో ఈ వ్యాసంలో చదవండి తెలుస్తుంది.
తెలుగు రాష్ట్రాలలో మంగళవారం జరిగిన ఎదురు కాల్పులలో ఇరవై ఐదుగురు
ఉగ్రవాదులు, అసాంఘిక బీభత్సకారులు హతం కావడం భద్రతా విభాగాల జాగరూకతకు
చిహ్నం. దేశద్రోహుల సామాజిక విద్రోహుల దాడులను సమర్ధవంతంగా
తిప్పికొట్టగలమని, పోలీసులు, అటవీ పరిరక్షక కార్యాచరణ బృదం-టాస్క్ఫోర్స్-
వారు ధ్రువీకరించడం శుభపరిణామం. సామాన్య ప్రజలలో భద్రతా భావాన్ని
పెంపొందించడానికి దోహదం చేయగల పరిణామం.. ఈ ధ్రువీకణ ఉగ్రవాదంపై భద్రతా భావం
సాధించిన విజయం...పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగమైన ‘ఇంటర్ సర్వీస్
ఇంటలిజెన్స్’-ఐఎస్‌ఐ- బీభత్స వ్యూహానికి పడిన మరో కన్నం. వికారుద్దీన్ మరో
నలుగురు ఐఎస్‌ఐ తొత్తులు వరంగల్-హైదరాబాద్ రహదారిలోనే పట్టపగలు పోలీసులను
హత్య చేయడానికి, తప్పించుకొని పోవడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
ఉగ్రవాదులు, పాకిస్తానీ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ హంతకులు. ముంబయిలో కోర్టు
ఆవరణ నుండి పోలీసుల కన్నుకప్పి తప్పించుకొని పోయారు. మహారాష్ట్ర,
మధ్యప్రదేశ్, జైళ్ల నుండి భద్రతను ఛిద్రం చేసి ఉడాయించగలిగారు. నిన్న మొన్న
జమ్మూ-కశ్మీర్‌లో మన సైనిక స్థావరాలపై, పోలీసుల ఠాణాలపై ఉగ్రవాదులు దాడి
చేయడం బరితెగించిన ఐఎస్‌ఐ హంతకుల నరరాక్షస స్వభావానికి సరికొత్త ఉదాహరణలు.
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో పోలీసులను కాల్చి చంపిన సిమి ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్‌లో సోమవారం మూడు చోట్ల దాడులు చేసి ముగ్గురు పోలీసులను
పొట్టన పెట్టుకున్న జిహాదీ తోడేళ్లు, బెంగాల్‌లోని, వర్ధమాన్ జిల్లాలో
విశ్రమించని బీభత్స పిశాచాలు, దేశమంతటా నక్కివున్న విద్రోహులు ... వీరందరూ
ఒకే భారత వ్యతిరేక షడ్యంత్రంలోని హంతకులు. ఈ కుట్రను అమలు జరుపుతున్నది
పాకిస్తాన్ ప్రభుత్వం... మన దేశం పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పడం
మానుకోనంతవరకు పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలను జరుపబోమని మన ప్రభుత్వాలు
ప్రకటించడం పాతికేళ్లకు పైగా నడుస్తున్న ప్రహసనం. పాకిస్తాన్ ప్రభుత్వం మన
దేశంలో ఉగ్రవాద హత్యాకాండ జరపడం మానలేదన్నది ధ్రువపడిన వాస్తవం. ఈ
ధ్రువీకరణకు వరంగల్లు-హైదరాబాద్ రహదారిపై వికారుద్దీన్ ముఠావారు
తప్పించుకొనడానకి యత్నించడం పునరావృత్తి మాత్రమే. పాకిస్తానీ తొత్తుల ఆట
సాగిపోవడం వేరే సంగతి.
పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగంగా చెలామణి అవుతున్న ఐఎస్‌ఐ నిజానికి జిహాదీ ఉగ్రవాద సంస్థ. జిహాదీల ప్రధాన లక్ష్యం మన దేశాన్ని బద్దలు కొట్టడం. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఐఎస్‌ఐ వారు వివిధ జిహాదీ తండాలను, ఇతరేతర ఉగ్రవాద ముఠాలను, అసాంఘిక బీభత్స బృందాలను దశాబ్దుల తరబడి అనసంధానం చేస్తున్నది. ఈ అనుసంధాన హంతక వ్యవస్థలో ఎర్రచందనం వృక్షాలను విదేశాలకు తరలిస్తున్న వారు కూడ భాగం కావచ్చన్న అనుమానం అతార్కికం కాజాలదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగం దృష్టి నల్లగొండ ఘటనలపై కేంద్రీకృతమైన సమయంలో వందలాది అసాంఘిక నేరస్థులు తిరుమల తిరుపతి’ దివ్య క్షేత్రం ప్రాంగణంలోని అడువులలోకి చొరబడ్డారు. ఎర్ర చందనం దొంగలను నిరోధించడానికై ఇటీవల భద్రతా చర్యలు ముమ్మరమైనప్పటికీ ఈ అసాంఘిక బీభత్సకారులు ఈ సమయంలో ఇలా చెలరేగడానికి కారణం ఏమిటి?? నల్లగొండపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉండడం. ఈ దొంగలకు ఐఎస్‌ఐ ఉగ్రవాదులే ఉప్పు అందించారన్నది ధ్రువపడని అనుమానం కావచ్చు...కాని ఈ దొంగల ముఠాలో ఇద్దరు అంతర్జాతీయ హంతక చోరులు ఉన్నారన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ధారణ. అన్ని రకాల అంతర్జాతీయ నేరస్థుల ముఠాలతోను ఐఎస్‌ఐకు సంబంధాలున్నాయి. సోమాలియా దేశంలో స్థావరాలను ఏర్పరచుకొని వున్న ఓడ దొంగలను భారత వ్యతిరేక జిహాదీ కలాపాలకు ఐఎస్‌ఐ అఫ్ఘానీ తాలిబన్లు వినియోగస్తున్నారు. మావోయిస్టులలోను, తమిళ ఈలం లిబరేషన్ టైగర్ల-ఎల్‌టిటిఈ-తోను ఐఎస్‌ఐ అనేక ఏళ్ల క్రితం సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. చైనాకు మనదేశం నుండి పులి చర్మాలను, గోళ్లను చేరవేస్తున్న హంతక ముఠాల వారు ఐఎస్‌ఐతో సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల దందాను ముమ్మరం చేసిన నైజీరియా ముష్కరులు, ఇతర విదేశీయులు ఐఎస్‌ఐతో అనుసంధానమై ఉన్నారన్నది ప్రచారం కాని వాస్తవం. అందువల్ల ఎర్ర చందనం ముఠాలవారు కూడ ఐఎస్‌ఐ వ్యూహంలో భాగస్వామ్యం వహిస్తున్నారా? ఈ కోణంలో కూడ దర్యాప్తు జరుగవలసి ఉంది.

ఎర్ర చందనం వృక్షాల మొదళ్లను నరుకుతున్న వారు అదే గొడ్డళ్లతో మనుషుల మెడలను
నరకడానికి వెనుదీయని నరరాక్షసులు. వీరంతా గతంలో కర్ణాటక తమిళనాడు
రాష్ట్రాలను ఠారెత్తించిన భయంకర బీభత్సకారుడు వీరప్పన్ వారసులు. అనేక
నెలలుగా మన రాష్ట్రంలో వందలాది మంది గంథం దొంగలు పట్టుబడ్డారు. గత ఏడాది
జూన్ ఒకటవ తేదీన ఒకే రోజున చిత్తూరు జిల్లాలోనే రెండు వందల యాభైమంది చందన
హంతకులను పోలీసులు పట్టుకోవడం ఈ అసాంఘిక బీభత్సకారుల బలానికి నిదర్శనం.
పట్టుబడని వారు వేల సంఖ్యలో ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ దొంగల
బెడదను అరికట్టడానికై ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయవలసి
వచ్చింది. అటవీ హంతకులు అంతర్జాతీయ నేరస్థుల ముఠాలలో భాగస్వాములైన
దేశద్రోహులు..రియాజ్ ఖాన్ అనే వాడు వీరప్పన్ సన్నిహిత సహచరుడు. వీరప్పన్
హతమైన తరువాత రియాజ్ ఖాన్ అటవీ వస్తువుల దొంగ వ్యాపారాన్ని దేశ విదేశాలలో
విస్తరింపజేశాడు. దేశంలో జరుగుతున్న అటవీ వస్తు అక్రమ వ్యాపారంలో తొంబయి
శాతం రియాజ్ ఖాన్‌దేనన్నది నిర్ధారిత నిజం. ఈ రియాజ్‌ను గత జూలైలో
కర్నాటకలోని అతని స్వగ్రామమైన కట్టినహళ్లిలో ఆంధ్ర పోలీసులు అరెస్టు
చేయగలిగారు..ఇదంతా అసాంఘిక బీభత్స తీవ్రతకు తార్కాణం.
ఇప్పుడు వికారుద్దీన్ ముఠావారు తప్పించుకోలేకపోయారు..కానీ
తప్పించుకోగలిగినన్నాళ్లు హైదరాబాద్‌లో అతగాడు అతని ముఠావారు హత్యాకాండ
సాగించారు. వికారుద్దీన్ మాత్రమే కాదు, ముజిబ్ అహ్మద్ వంటి ముష్కరులెందరో
హైదరాబాద్ అడ్డాగా పాకిస్తాన్ ప్రభుత్వం వారి తొత్తులుగా బీభత్స కృత్యాలు
సాగించడం ఏళ్ల తరబడి సాగుతున్న వైపరీత్యం. ‘కళ్లు మూసుకున్న పిల్లి వలె’
తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి హైదరాబాద్‌లో సిమి ఉగ్రవాదులెవ్వరూ
లేరని ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నారు. ఈ మంత్రి ఎవరికి ప్రతినిధి?
ప్రజలకా? టెర్రరిస్టులకా?
అప్రమత్తమైన భద్రత
Reviewed by rajakishor
on
9:44 AM
Rating:
No comments: