Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

మారీచుల మాయ

ఆంధ్రభూమి దినపత్రిక, ఏప్రిల్ 4, 2015



కెన్యాలో ఇస్లామిక్ టెర్రరిస్టులు యూనివర్సిటీ హాస్టల్లో చొరబడి, 150 మంది క్రిస్టియన్ విద్యార్థులను కిరాతకంగా కాల్చి చంపితే అదో పెద్ద వార్త కాదు.

ఇరాక్‌లో ముస్లిం మిలిటెంట్లు సుప్రసిద్ధమైన చర్చి మీద పడి, శిలువలను విరగగొట్టి, పవిత్ర మత చిహ్నాలను మలినపరిస్తే అది పెద్ద విశేషం కాదు.

నైజీరియాలో ఫులానీ ఉగ్రవాదులు వందమంది క్రైస్తవ గ్రామస్థులను నిష్కారణంగా ఊచకోత కోస్తే దాన్ని క్రైస్తవం మీద దాడిగా భావించనక్కర్లేదు.

సోమాలియాలోఅల్‌షబాబ్ ఆరుగురు క్రైస్తవ యువకుల తలలు నరికేసి దాని వీడియోను ప్రపంచానికి చూపెట్టినా... సిరియాలో, ఈజిప్టులో, పాకిస్తాన్‌లో చర్చిలను తగలబెట్టటం, క్రైస్తవ మతాచార్యులను చంపటం, క్రైస్తవులుగా పుట్టిన నేరానికి వందలాది అమాయకులను పైశాచికంగా నరకటం లాంటి దారుణ దురంతాలు ఈ మూడు నాలుగు వారాల్లోనే ఎన్ని జరిగినా వాటిని సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. మన మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో మహా అయితే రొటీన్ వార్తలుగా అలాంటి వాటికి చోటు ఇవ్వవచ్చే తప్ప, మన పెద్ద తలకాయల వారు వాటి గురించి ఎక్కువ ఆలోచించి, విలువైన సమయం ఎంతమాత్రమూ వృధా చేయరు.

అదే - ఢిల్లీలో కుర్రాళ్లు ఆడుకుంటూండగా పొరపాటున రాయి తగిలి ఒక చర్చి కిటికీ అద్దాలు పగిలినా... ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్‌వల్ల ఇంకో చర్చికి కొద్దిగా నిప్పంటుకున్నా... మరొక చర్చి ముందు ఎవడో తాగుబోతు కాస్త గొడవ చేసినా... వేరొక క్రిస్టియన్ స్కూలులో హిందూ, ముస్లిం మతాలకు చెందిన ఇద్దరు దొంగలు వృత్తి ధర్మంలో భాగంగా ఎనిమిదివేల రూపాయలు చోరీ చేసినా...

సెక్యులరిజం గంగలో కలిసినట్టే. మైనారిటీల భద్రతకు పెనుముప్ప దాపురించినట్టే. సిరికింజెప్పని లెవెల్లో వీరశూర సెక్యులర్ మీడియా మల్లులు ఉరికివచ్చి, ఆ ఘోరఘాతుకాల పరిణామాలను, పర్యవసానాలను, తెరపి లేకుండా ఉతికి ఆరేయాల్సిందే. ఆయా చిల్లర సంఘటనలన్నీ ఒక్క ఢిల్లీ దరిదాపుల్లోనే జరిగినా సరే... మొత్తం భారతదేశంలో క్రైస్తవ మతానికి పుట్టి మునిగినట్టూ, క్రిస్టియన్లు బతికి బట్టకట్టే పరిస్థితులు పోయినట్టూ సెక్యులర్ నిష్ఠాగరిష్ఠులు గుండెలు బాదుకోవలసిందే.

కర్మంచాలక అదే సమయాన ఏ బెంగాల్లోనో ఓ డెబ్భై ఏళ్ల కేథలిక్ సన్యాసిని మీద గ్యాంగ్ రేప్ జరిగిందనుకోండి! సెక్యులర్ గుండెలు భగభగమండుతాయి. దేశంలోని మర్యాదస్తులందరికీ ఒళ్లెరుగని ధర్మాగ్రహం ఆవహిస్తుంది. ఇక సందేహం అక్కర్లేదు. ఆ అత్యాచారం కచ్చితంగా హిందూ మతోన్మాదుల పనే. అమాయక క్రైస్తవ ప్రజల్లో భయోత్పాతం రేకెత్తించి, పవిత్ర సెక్యులర్ విధానాన్ని తుంగలో తొక్కేందుకు ఫాసిస్టు ఆరెస్సెస్ పథకం ప్రకారం పన్నిన పాపిష్టి పన్నాగమే!

క్రైస్తవ మత ప్రాంగణంలో ఒక వృద్ధ సన్యాసిని మీద అఘాయిత్యం ఎలా జరిగింది, అసాంఘిక శక్తులు యథేచ్ఛగా లోపలికి ఎలా జొరబడ్డాయి అని చర్చి అధికారులను నిలదీయనక్కర్లేదు. శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా సరే రాష్ట్ర ముఖ్యమంత్రమ్మను పల్లెత్తుమాట అనకూడదు. ఎక్కడో బెంగాలీ ఊళ్లో ఏ రాత్రో ఏ ముసలమ్మమీదో జరిగిన అత్యాచారానికి పూర్తి బాధ్యత ముమ్మాటికీ హిట్లర్ తమ్ముడు నరేంద్ర మోదీదే. అర్జంటుగా బోనెక్కించి, అంతర్జాతీయ సమాజం ముందు ముద్దాయిగా నిలబెట్టి రాళ్లతో కొట్టించవలసింది హిందూ మతోన్మాద భాజపానూ, దాన్ని నడిపించే నయా నాజీలనూ, వారికి కులగురువులైన రా.స్వ. సంఘాధములనే!

ఎన్డీటీవీ లాంటి క్రైస్తవ భక్త సమాజాలూ, బర్ఖాదత్ లాంటి మీడియా మాణిక్యాలూ, ‘ది హిందూ’ లాంటి హిందూ వ్యతిరేక పత్రికలూ, పెద్ద నోటి క్రైస్తవ బ్రదర్లూ, ఫాదర్లూ, విదేశీ క్రైస్తవ నిధులతో బతికే ఎన్జీవో రాయుళ్లూ, క్రైస్తవ సంస్థల రహస్య పెట్టుపోతలతో తరించే సెక్యులర్, లిబరల్ మేతావులూ పత్రికలనిండా, చానెళ్ల పొడవునా, వేదికల మీదా విసుగు లేకుండా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి హిందూమతోన్మాద ప్రమాద ఘంటికలను నాన్‌స్టాపుగా మోగించిన మీదట- అసలు సంగతి బయటపడింది. ఇంతకీ బెంగాలీ నన్‌ను చెరిచింది బంగ్లాదేశీ ముస్లింలట. వారికి ఆ స్పెషల్ డ్యూటీ వేసి పంపించింది పాకిస్తానీ ఐ.ఎస్.ఐ. అట! అంత శ్రమ తీసుకుని, మూలనున్న క్రైస్తవ అవ్వను పాడుచేసే పనికి వారు ఎందుకు పురికొల్పారంటే - అనుమానం హిందువుల మీదికి పోయేట్టు చేసి మోదీ సర్కారును బద్‌నామ్ చేయడానికట. మైనారిటీలపై ఘాతుకాల్లో ఇండియానూ, పాకిస్తాన్‌నూ ఒకే గాటిన కట్టి, దొందూ దొందే అని ప్రపంచం అనుకునేట్టుచేయడానికట.

ఈ సంగతులన్నీ మెల్లిగా లోకానికి తెలిశాయి. అయినా ‘‘క్రైస్తవానికి పెనుప్రమాదం’’ బ్యాండు మేళాలవాళ్లు నాలికైనా కరచుకోరు. అవేవీ తెలియనట్టే నటిస్తారు. గ్యాంగ్ రేప్ నేరానికి ‘హిందూ మతోన్మాదా’నికి విచారించకుండానే శిక్ష వేసిన సోకాల్డ్ సెక్యులర్ మీడియా, నిజానికి జరిగింది ఇదీ అని ఆలస్యంగానైనా జనానికి తెలియజెప్పదు. పదేళ్ల సోనియా స్వర్గం పోయి, పార్లమెంటులో భాజపా సొంతంగా మెజారిటీ సాధించిందన్న దుర్వార్త తెలియగానే - ‘‘నాజీ పార్టీ అయిన ఆరెస్సెస్ ఇక ఊరుకోదు. ఇండియా నుంచి క్రైస్తవాన్ని వెళ్లగొట్టేదాకా నిద్రపోదు. ‘ఇండియన్ హిట్లర్’ నరేంద్రమోదీ నాజీ నియంతలాగే పేట్రేగుతాడు. క్రైస్తవులను వేటాడుతాడు’’ అని దివ్యదృష్టితో కనిపెట్టి సౌతిండియా చర్చ్ ఆఫ్ క్రైస్ట్‌మిషన్ తరఫున ‘ప్రార్థన భాగస్వాములకు మరియు మద్దతుదారులకు’ (్దఆఆఔ://్ఘష్దజ్పళ.ఆ్యజ్ఘూక/్దఒకూజ) ముందస్తు హెచ్చరిక చేసిన డేవిడ్ మోరిస్ లాంటి క్రైస్తవ ప్రచారకులు మొదలెట్టిన దుష్ప్రచార మాయాయుద్ధంతో చేతులు కలిపి తరించటంకంటే సెక్యులర్ చక్రాంకితులకు ఏమి కావాలి? అన్ని మతాలనూ అనాదిగా అక్కున చేర్చుకుంటూ, క్రీస్తు జీవితకాలంలోనే క్రైస్తవులకు ఆశ్రయమిచ్చిన భారతదేశానికి మోదీ సర్కారు రాగానే హిందూ మతోన్మాదం పట్టి, అన్యమతాలను వెంటాడి వెళ్లగొడుతున్నదన్న భ్రాంతిని రేకెత్తించటాన్ని మించిన పవిత్ర కార్యం విదేశ భక్త మీడియా గణానికి ఏముంది?

నాజీలను, వారి నియంతను గోరీల్లోంచి లేపుతున్న పరిశుద్ధాత్ములకు ఒక ప్రశ్న: హిట్లర్ క్రైస్తవుడు కాడా?


మారీచుల మాయ Reviewed by rajakishor on 8:12 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.