Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

పాక్ పట్ల మెతక వైఖరి తగదు

లెఫ్ట్‌నెంట్ జనరల్ ప్రకాశ్ కటోచ్, niticentral.com
ఆంధ్రభూమి దినపత్రిక, ఏప్రిల్ 4, 2015

అందువల్లనే లష్కరే తొయ్యబా (లెట్) వంటి ఉగ్రవాద సంస్థలు భారత్‌లో భయానక వాతావరణాన్ని సృష్టించడం కోసం స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, హక్కానీ గ్రూపు అఫ్గానిస్థాన్‌లోని భారత్ అస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నది. ఇక హఫీజ్ సరుూద్ మనదేశంలో ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. జమ్మూ ప్రాంతలో అంతర్జాతీయ సరిహద్దును పాక్ ఉల్లంఘించిన సమయంలో, నియంత్రణ రేఖవద్ద ఈ ఉగ్రవాద ముల్లా (హఫీజ్ సరుూద్) కనిపించాడు. జకీవుర్ రహమాన్ లఖ్వీ అతని సహచరులు అదియాలా జైలులో ‘దేశ అతిథి’గా రాచమర్యాదలు అందుకుంటున్నారని పాకిస్తాన్ డైలీ ‘ది నేషన్’ మార్చి 3న వెల్లడించింది. ఆ జైలునే అతను తన వ్యక్తిగత కమాండ్ సెంటర్‌గా ఉపయోగించుకుంటున్నాడు. తన అనుచరులతో ఎప్పడికప్పుడు సమావేశమవుతూ, అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నాడు.

ప్రధాని వాజ్‌పేయి లాహోర్‌కు బస్సులో ప్రయాణించి, అప్పటి సైన్యాధ్యక్షుడిగా ఉన్న నవాజ్ షరీఫ్‌కు స్నేహహస్తం అందిస్తే తిరస్కరించడం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అప్పటికే కార్గిల్‌లో చొరబాట్లకు పాల్పడిన ముషారఫ్, కార్గిల్ యుద్ధంలో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లడానికి తిరస్కరించి,తన సైనిక యూనీఫామ్ ప్రతిష్టను మంటగలపడం వేరే సంగతి. అదేమంటే వారు చొరబాటు దార్లంటూ బుకాయించాడు. అప్పట్లో ప్రధాని వాజ్‌పేయికి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ముషార్రఫ్‌ను ఒప్పించలేకపోయిన నవాజ్ షరీఫ్, నేడు బెలూచిస్థాన్ నేత నవాజ్ అక్బర్ ఖాన్ భుక్తి హత్యకేసులో(2006) నేరం రుజువైనప్పటికీ ముషార్రఫ్‌పై చర్యతీసుకునే ధైర్యం చేయలేని దుస్థితి. ఒకవైపు ప్రధాని వాజ్‌పేయిని సాక్షాత్తు నవాజ్ షరీఫ్ సమక్షంలోనే అవమానించిన సైన్యాధ్యక్షుడిని (ముషార్రఫ్)ను చూశాం. మరి న్యూఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో జరుపుకున్న ‘పాకిస్తాన్ డే’ ఉత్సవాలకు హాజరు కావడానికి జనరల్ వికె సింగ్‌ను పంపడం మరో విచిత్రం. ఆయన ధరించిన ఆకుపచ్చ జాకెట్‌పై మీడియా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అయితే ఇక్కడ ఆయన్ను విదేశాంగ శాఖ సహాయమంత్రి హోదాలో అక్కడికి పంపాలా వద్దా అనేది ప్రభుత్వ విశేషాధికారం. అయితే దీనిపై ఒక దౌత్యవేత్త వ్యాఖ్యానిస్తూ..‘రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సిగ్గును వదిలేయడానికి సిద్ధపడాలి’ అంటూ వ్యాఖ్యానించాడు. విచిత్రమేమంటే జమ్మూ-కశ్మీర్‌లోని సైనిక పోస్టుపై ఉగ్రవాదులు దాడి జరిపిన తర్వాత జరిగిన సంఘటన ఇది.

మనదేశంపై నిరంతరం ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్న దేశానికి చెందిన రాయబార కార్యాలయానికి మన మాజీ సైన్యాధ్యక్షుడు వెళ్లడం నిజంగా దేశం, సైన్యం ప్రతిష్టకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. మాఫియాతో సంబంధాలున్న బ్యూరోక్రసీ జనరల్ వికె సింగ్ ఎదుర్కొన్న అసౌకర్యాన్ని చూసి ఆనందపడి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. జనరల్ సింగ్ సర్వీసులో ఉండగా తత్రా కుంభకోణంతో పాటు, ఉన్నతస్థాయిలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను బయపెట్టిన దగ్గరినుంచి ఆ వర్గాలు, ఆయన్ను వేటాడుతూనే ఉన్నాయి. అంతేకాదు అప్పట్లో ఎన్‌జీవోలతో సంబంధాలున్న మీడియా సంస్థలు సైన్యం ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూశాయి. మాఫియాతో సంబంధాలున్న కొందరు దుర్మార్గబుద్ధితో సైనిక కుట్ర వంటి పుకార్లు పుట్టించిన సంఘటనలు గతంలో జరిగాయి. అయితే వీటిపై రాజకీయ వ్యవస్థ విభిన్న కారణావల్ల వౌనం పాటిస్తోంది. ఇక్కడ మనం ‘లీ కౌన్ యూ’ అన్న మాటలు గుర్తు పెట్టుకోవాలి. సింగపూర్ సార్వభౌమాధికానికి లోబడే ప్రెస్, వార్తలు ఉండాలని ఆయన స్పష్టంగా చెప్పారు. విదేశాంగశాఖ సహాయ మంత్రి హాజరు కావడాన్ని సమర్థించుకోవడానికి ప్రోటొకాల్‌ను అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రోటొకాల్స్‌ను ఏ అంతర్జాతీయ సంస్థ రూపొందించదు. కేవలం ప్రభుత్వ నిర్ణయాధికారం మాత్రమే. అవసరమైనప్పుడు వాటిని మార్చవచ్చు. గత ఏడాది అబ్దుల్ బాసిత్ వేర్పాటువాదులతో సమావేశం కావడం.. రెండు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశం రద్దు కావడానికి దారితీసింది. మరిప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా పాక్ రాయబార కార్యాలయానికి వేర్పాటువాదులు రావడం రోటీన్‌లో భాగమని చెప్పడంలో అర్ధమేంటి? అసలు మన విదేశాంగశాఖ సహాయ మంత్రిని పాక్ ఎంబసీకి పంపకుండా ఉన్నట్లయితే అసలు గొడవే ఉండేది కాదు.

పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం ఎంతో శ్లాఘించదగింది. మరి ఈ చర్చలు వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కూడ జరిగాయి. ఈ నిర్ణయం వెనుక అమెరికా వత్తిడి ఉన్నమాట వాస్తవం. మరో విషయమేమంటే అమెరికా పాక్ సైన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నది. పాక్ సైన్యం పాల్పడుతున్న ఉగ్రవాద చర్యలు, అణ్వస్తవ్య్రాప్తి వంటి కార్యకలాపాలు అమెరికాకు పట్టవు. అయితే అమెరికా వత్తిడి ఉన్నదన్న అంశాన్ని ప్రభుత్వం సహజంగానే ఖండిస్తుంది. మన విదేశాంగశాఖ కార్యదర్శి సార్క్ పర్యటన ముసుగులో పాక్‌తో ప్రాథమిక చర్చలు జరపడానికి వెళ్లారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పాక్‌తో చర్చలు జరపాలని భారత్‌పై అమెరికా వత్తిడి తెచ్చిందంటూ సర్తాజ్ అజీజ్ వివాదాన్ని రాజేశాడు. ఇక అబ్దుల్ బాసిత్ అయితే ఏకంగా తాము హురియత్ నేతలతో చర్చలు జరపడానికి భారత్‌కు ఎటువంటి అభ్యంతరం లేదంటూ ప్రకటించేశాడు. అయితే మూడో పార్టీకి చర్చల్లో స్థానం లేదని మన విదేశాంగ శాఖ వివరణ ఇచ్చినప్పటికీ, బాసిత్ తన ఉద్దేశాన్ని బయటపెట్టాడు.

‘ఇండియా-పాకిస్తాన్ ఛాలెంజెస్ వే ఫార్వర్డ్’, శీర్షికన కోల్‌కతాకు చెందిన ఒక ప్రచురణ సంస్థకు రాసిన వ్యాసంలో సర్తాజ్ అజీజ్..‘యుఎన్ తీర్మానం ప్రకారం కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు భారత్ సిద్ధంగా లేదు,’’అంటూ రాశాడు. ఒకవేళ పాక్ వాదన ఇదే అయితే 1949లో యుఎన్ తీర్మానం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరింది. ప్లెబిసైట్ చేపట్టే ముందు పాక్ తన భద్రతా దళాలను పూర్తిగా జమ్మూ-కశ్మీర్ భూభాగం నుంచి ఉపసంహరించాలని స్పష్టంగా పేర్కొంది. కానీ పాకిస్తాన్ తన భద్రతా దళాల సంఖ్యను విపరీతంగా పెంచడంతో పాటు, మైదాన ప్రాంతాలనుంచి ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోకి ప్రజలను తరలించి భౌగోళికంగా జనాభా సంఖ్యలో విపరీతమైన మార్పులు తీసుకొచ్చింది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈవిధంగా ప్రజాభిప్రాయ సేకరణ అనేదాన్ని పూర్తిగా హతమార్చింది. అయినప్పటికీ ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ అంటూ పట్టుకొని వేలాడటం కేవలం సమస్య పరిష్కారించాలన్న ఉద్దేశం లేకపోవడమే. పాకిస్తాన్ సైన్యం చేతిలో అధికారం ఉండాలంటే, సంప్రదాయ యుద్ధానికి దిగువస్థాయి సంఘర్షణను కొనసాగించాల్సిందే.

2014 డిసెంబర్ వరకు అఫ్గానిస్థాన్ ఆంతరంగిక శాఖ మంత్రిగా ఉన్న మహమ్మద్ ఉమర్ దౌడ్జాయ్ ‘అఫ్గానిస్తాన్ అండ్ పాకిస్తాన్ : ది ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ రాప్రోచ్‌మెంట్’ పేరుతో రాసిన వ్యాసం న్యూయార్క్ టైమ్స్‌లో 2015, మార్చి 2న ప్రచురితమైంది. ఇందులో ఆయన..‘‘ అఫ్గానిస్తాన్‌పై ప్రాథమికంగా పాక్ వైఖరి మారబోదు. పాకిస్తాన్ సైన్యం ఎప్పటికీ, అఫ్గాన్ తాలిబన్లను తమకు వ్యూహాత్మక ప్రయోజనకర ఆస్తులుగా పరిగణిస్తుంది. మన విషయానికి వస్తే మంచిగానే మాట్లాడాలి, కానీ అదేవిధమైన ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలి.’’

తాను జమ్మూకశ్మీర్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా పాకిస్తాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రిని అధికారంలో ఉంచాల్సిన అవసరం మనకు లేదు. ఆయన కుటుంబ సభ్యులు 2001 ఎన్నికల సమయంలో కూడ రాడికల్ హిజ్బుల్ కార్యకర్తలను బాడీగార్డులుగా ఉంచుకోవడానికే సానుకూలత తెలిపారు. అయితే ఇదంతా ఎఎఫ్‌ఎస్‌పిఎని జమ్మూకశ్మీర్‌లోని చాలా భాగాలనుంచి తొలగించేందుకు చేస్తున్న పాకిస్తాన్ కుచ్చిత ప్రణాళిక అని గుర్తించి అప్పట్లోనే కేంద్రం తగిన చర్యలు తీసుకోవాల్సింది. మరి చొరబాట్లు పాక్ సైన్యం మద్దతు లేకుండానే విపరీతంగా పెరుగుతాయని చెప్పడానికి పై దృష్టాంతాలు సరిపోతాయి. ఇప్పటికే ముషార్రఫ్ మరో కార్గిల్ యుద్ధం అంటూ హెచ్చరికలు చేస్తున్నాడు.

ఇంత జరుగుతున్నా హురియత్ ముదురు ముఠావారికి కూడా కొంత స్థానం కల్పించాలని మేధావులు రాయడమే విచిత్రం. తమ ఆశ్రీతులను జమ్మూ-కశ్మీర్‌లో ప్రతినిధులుగా ఉంచడాన్ని పాక్‌కు ఇష్టం కావచ్చు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు వాటిని సాధ్యం కానివ్వకపోవచ్చు. మరి ఇటువంవారికి మీడియా ప్రాచుర్యం కల్పించకపోతే వారికై వారే కనమరుగైపోతారు. ప్రస్తుతం కావలసింది కార్యాచరణ. అహంకారపూరిత పాక్‌ను బుజ్జగించడానికి మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. చర్చల్లో 54 మంది భారతీయ యుద్ధ ఖైదీల అప్పగింత విషయం చర్చకు రావాలి. కానీ పాక్ మత్స్యకారుల గురించి మాట్లాడటమే విచిత్రం.

పాక్ పట్ల మెతక వైఖరి తగదు Reviewed by rajakishor on 1:01 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.