3.5 లక్షల భజరంగ్ దళ్ కార్యకర్తల 'జై శ్రీరాం' నినాదాలతో మారుమ్రోగిన భాగ్యనగర్
- లక్ష బైక్ లతో దాదాపు 3.5 లక్షల మంది తో వియవంతం అయిన శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర
- గౌలిగూడ శ్రీ రామ మందిరం నుండి తాడ్ బండ్ హనుమాన్ మందిరం వరకు సాగిన బైక్ ర్యాలి
- కాషాయ మాయం అయిన భాగ్యనగరం, పూల జల్లులతో యాత్రకు ఆహ్వానం పలికిన ప్రజలు
- స్వచ్చందంగా ఆహరం, త్రాగు నీరు, మజ్జిగ అందించిన హనుమత్ భక్తులు
- యాత్ర కు మార్గదర్శనం చేసిన భజరంగ్ దళ్ అంతర్జాతీయ సంయోజకులు శ్రీ రాజేష్ పాండే
గౌలిగూడ, తాడ్ బన్, భాగ్యనగర్ 05/04/2015 : భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించునుకుని ప్రతి సంవత్సరం సంప్రదాయంగా జరుగుతున్న గౌలిగూడ శ్రీ రాం మందిర్ - తాడ్ బన్ హనుమాన్ మందిర్ " శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర " ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిగింది, ఈ సంవత్సరం సుమారు లక్షకు పైగా ద్వీచక్ర వాహనాలు (బైక్) ప పై దాదాపు 3.5 లక్షల మంది యువకులు ఈ 20 km ల శోభా యాత్ర లో పాల్గొన్నారు. ఉదయం 10:00 గంటలకు గౌళి గూడ శ్రీ రామ మందిరం వద్ద ప్రారంభమయిన యాత్ర సాయంత్రం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ లో జరిగిన భహిరంగ సభతో ముగిసింది.
వేదిక పై ప్రసంగిస్తున్న శ్రీ రాజేష్ పాండే భజరంగ్ దళ్ అంతర్జాతీయ సంయోజకులు |
శోభా యాత్ర పరిసరాలు మొత్తం ' భారత్ మాతా కి జై ' , ' వందే మాతారం ' , ' జై శ్రీ రాం ' , ' జై కర్ వీర భజరంగి - హరహర మాహదేవ్ ' నినాదాలతో మారుమ్రోగింది, భాగ్యనగరం కాషాయ భగవత్ ద్వజాలతో కళకళలాడింది, యాత్ర సమయంలో ఎండ వేడిమి దాదాపు 40 డిగ్రీల వరకు ఉన్న కార్యకర్తల ద్యేయనిష్ట ముందు తక్కువే అయ్యింది, నగర ప్రజలు శోభా యాత్రకు పూల జల్లులతో స్వాగతం పలికారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శ్రీ హనుమత్ రథం |
శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొంటున్న యువకులు దారి పొడవున మజ్జిగ, పులిహోర లాంటి ఆహార ఏర్పాటు ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి చేసారు, దాదాపు 20km యాత్ర పొడవులో 100 స్థానాలలో ఇలాంటి ఏర్పాటు ఉండటం జరిగింది.
యాత్రను తిలకిస్తున్న RSS క్షేత్ర ప్రచారక్ మాన్య శ్రీ శ్యాం కుమార్ గారు, తదితరులు |
3.5 లక్షల భజరంగ్ దళ్ కార్యకర్తల 'జై శ్రీరాం' నినాదాలతో మారుమ్రోగిన భాగ్యనగర్
Reviewed by JAGARANA
on
8:16 AM
Rating:
No comments: