Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

గిన్నిస్ రికార్డ్ దిశగా లక్ష బైక్ లతో భజరంగ్ దళ్ ' శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర '

  • గౌలిగూడ శ్రీ రామ మందిరం నుండి తాడ్ బండ్ హనుమాన్ మందిరం వరకు - 20 km ల యాత్ర
  • లక్ష ద్విచక్ర వాహనాలతో  3.5 లక్షల మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొననున్నారు
  • ముఖ్య అతిధి గా భజరంగ్ దళ్ అంతర్జాతీయ సంయోజక్ శ్రీ రాజేష్ పాండే 
  • పరిశీలించనున్న గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు  

విజయ శ్రీ భవనం,కోఠి, భాగ్యనగర్ 03/04/2015 : తేది 04-04-2015 నాడు శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భజరంగ్ దళ్ భాగ్యనగర్ (హైదరాబాద్) శాఖా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా నిర్వహించనుందని భజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర సంయోజక్ మీడియా తెలిపారు.

విశ్వ హిందూ పరిషద్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో విహిప రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామ రాజు గారు మాట్లాడుతూ ' ఈ ఏడు హనుమత్ శక్తి ప్రదర్శన జరగనుంది, ఖచ్చితంగా లక్ష కి పైగా ద్వీచక్ర వాహనాలతో దాదాపు మూడు లక్షలకి పైగా హిందు యువకులు ఈ యాత్ర లో పాల్గోననున్నారు ' అని అన్నారు.
గౌలిగూడ శ్రీ రామ మందిరం నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర సికంద్రబాద్ తాడ్ భంఢ్ హనుమాన్ మందిరం వరకు దాదాపు 20 KM పైగా జరుగునుంది, ఈ యత్ర ను పరిశీలించడానికి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు కూడా హాజరౌతున్నారు.        

గిన్నిస్ రికార్డ్ దిశగా లక్ష బైక్ లతో భజరంగ్ దళ్ ' శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ' Reviewed by JAGARANA on 6:33 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.