క్రైస్తవులపై దాడులు చేస్తున్నది ఎవరు?
మార్చి 14, 2015న కోల్ కతాలో కొందరు దుండుగులు ఒక క్రైస్తవ నన్ పై సామూహిక అత్యాచారం చేసేరు. వెంఠనే దీనిపై స్పందిస్తూ మనదేశంలోని మీడియా, ఆదర్శ్ లిబరల్స్ సంస్థకు చెందిన వారూ దేశంలో క్రైస్తవులకు రక్షణ కల్పించడంలో మోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోడంలేదని విరుచుకుపడటం మొదలుపెట్టారు.
ఒక ప్రక్క ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసును సిబిఐకి అప్పజెప్పాలనుకుంటూండగా ఆ క్రైస్తవ నన్ ని రాత్రి 2.45 సమయంలో ఓ అజ్ఞాత ప్రదేశానికి తరలించేసారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తనపై అత్యాచారానికి పాల్పడినవారిని క్షమిస్తున్నాననీ, ఈ కేసులో సిబిఐ దర్యాప్తు వద్దనీ ఆ నన్ ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు సమాచారం. ఈలోగా ఈ ఘటనలో నిందితులుగా భావిస్తున్న మహమ్మద్ మాజిద్, ముకోల్ ఆలం అనే ఇద్దరు బంగ్లాదేశీ అక్రమ చొరబాటు దారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కానీ క్రైస్తవ చర్చి సంఘాలు, సెక్యులర్ మేధావులు ఈ సంఘటనను అడ్డం పెట్టుకుని కేంద్రంలో మోదీ ప్రభుత్వంపైనా, హిందూ సంస్థలపైనా కక్కాల్సిన విద్వేషాన్నంతా వెళ్ళగక్కేరు.
అసలేం జరిగింది?
1. మార్చి 14, 2015న నలుగురు దుండుగులు కలకత్తాలోని చర్చిలోకి ప్రవేశించి అక్కడున్న 12 లక్షల రూపాయలను దొంగిలించారు. తరువాత అక్కడున్నవారిలో పెద్దవారెవరని అడిగారు. అప్పుడు 72 ఏళ్ళ నం ముందుకు వచ్చింది. వెంఠనే ఆ దుండుగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
2. ఈ సంఘటనపై ఇంకా దర్యాప్తు మొదలయ్యే లోగానే దేశంలోని మీడియా పెద్దఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. అంతే ఆర్.ఎస్.ఎస్. తదితర హిందూ సంస్థలపై పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తూ దేశంలోని సెక్యులర్ మేధావులూ, కొందరు క్రైస్తవ మత పెద్దలూ తమ గొంతులు విప్పారు.
3. మార్చి 15, 2015న ఈ సంఘటనలో అనుమానితులుగా అనుమానిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిబంధనలననుసరించి వారి వివరాలను బయటపెట్టలేదు.
4. కోల్ కతాకు చెందిన ఆర్చి బిషప్ ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంతి మమతా బెనర్జీకి క్లీన్ చిట్ ఇస్తూ నరేంద్ర మోదీని మాత్రం దుమ్మెత్తి పోసాడు.
5. మైనారిటీలకు చెందినా ఎన్.జీ.ఓ. సంస్థలూ, వారి మద్దతు దారులూ కూడా ఈ సంఘటన పట్ల అలవాటు ప్రకారం తమ స్వరాన్నీ వినిపించేయి - హిందూత్వ సంస్థలను దుమ్మెత్తిపోస్తూ.
6. ఈ సంఘటనపై వాటికన్ స్పందించింది. విచారణ కొరకు ఒక ప్రతినిథి బృందాన్ని పంపింది.
7. ఒక్కసారిగా ఈ సంఘటన ప్రపంచ స్థాయి వార్తగా మారిపోయింది. భారతదేశంలో మెజారిటీ వర్గాల వల్ల మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోందని ప్రచారమైపోయింది.
8. భారత ఐ.పి.ఎస్. అధికారి జూలియో ఫ్రాన్సిస్ రెబెరియో దేశానికి పెద్ద ఉపద్రవం వాటిల్లినట్లు అభిప్రాయపడ్డాడు.
9. ఈ సంఘటన జరిగిన ఆరు రోజుల తరువాత మమతా బెనర్జీ దర్యాప్తును సి.బి.ఐ.కి అప్పగించింది. ఈలోగా అత్యాచారానికి గురైన నన్ ని విమానంలో విదేశాలకి తరలించేసారు. వెళ్ళే ముందు రేపిస్టులను క్షమ్మించమని ఆ నన్ చెప్పింది.
10. అసలింత నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఎందుకంటే సి.బి.ఐ. దర్యాప్తు కనుక మొదలైతే అసలు విషయంతో పాటు చర్చికి అక్రమంగా పెద్ద మొత్తంలో అందుతున్న అక్రమ విరాళాల గుట్టు కూడా బయట పడుతుందని వాళ్ళ భయం. అందుకే మమతా దీదీ సహాయంతో ఏ చప్పుడూ లేకుండా వ్యవహారం చక్కబెట్టేసి ఆ తరువాత కేసు సి.బి.ఐ.కి అప్పజేప్పేటట్లు చేసేరు. అంటే చర్చికి తమ నన్ పై జరిగిన అత్యాచారంపై దర్యాప్తుకన్నా తమకు అందుతూన్న అక్రమ విరాళాల గుట్టు బయటపడకుండా చూసుకోవడమే ముఖ్యం అన్నమాట. ఇందుకోసం వాటికన్ నుంచి కూడా ప్రత్యేక బృందం వచ్చింది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్నీ, హిందూత్వ సంస్థలనీ అప్రతిష్ఠ పాలు చెయ్యడానికి క్రైస్తవ సంస్థలు ఎలాంటి నాటకాలు ఆడతాయో ఇదొక ఉదాహరణ. మైనారిటీలపై దాడులు జరిగినప్పుడల్లా దేశంలోని మెజారిటీలపై విరుచుకుపడటం మీడియా వర్గాలకు ఇదేమీ కొత్త కాదు.
క్రింది సంఘటనలను కొన్నింటిని గమనిద్దాం.
1. మధ్యప్రదేశ్ లో జబువా జిల్లాలో నవపద గ్రామం ఉంది. సెప్టెంబర్ 23, 1998న అక్కడ ఒక కాన్వెంట్ కి చెందిన నన్ సామూహిక అత్యాచారానికి గురయ్యింది. దర్యాప్తులో తేలిందేమిటంటే అత్యాచారానికి పాల్పడ్డ 12 మందీ క్రైస్తవ మతస్తులే.
2. కర్ణాటకలో గుల్బర్గా జిల్లాలోని వాడి గ్రామంలో సెయింట్ ఆన్స్ చర్చిలో జూన్ 8, 2000న రెండు నాటు బాంబులు పేలాయి. చర్చి ధ్వంసమయ్యింది. ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ సంఘటనకు కారకులుగా పట్టుబడ్డ 19 మందీ ISI కి అనుబంధంగా మనదేశంలో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ దీన్ దార్ అంజుమన్ కి చెందినవారే.
3. కర్నాటక హుబ్లీలో సెయింట్ జాన్ లూథర్ చర్చి వద్ద జూలై 8, 2000న బాంబు ప్రేలుళ్ళు సంభవించాయి. ఈ సంఘటనలో అనుమానితులుగా అరెస్టు చేయబడ్డ 16 మందీ దీన్ దార్ అంజుమన్ కి చెందినవారే.
4. జూలై 9, 2000న బెంగళూరు జగజీవన్ రామ్ నగర్లో సెయింట్ పీటర్ పాల్ చర్చిలో బాంబు ప్రేలుళ్ళు సంభవించాయి. ఈ సంఘటనలో అనుమానితులుగా పట్టుబడ్డ 29 మందీ దీన్ దార్ అంజుమన్ కి చెందినవారే.
(కర్ణాటకలో 2009లో ఒక చర్చికి మారుతి వ్యాన్ లో బాంబులు తరలిస్తూండగా అవి విస్ఫోటనం చెంది జాకీర్, సిద్ధికి అనే ఇద్దరు తీవ్రవాదులు చనిపోఎరు. ఎస్.ఎం. ఇబ్రహీం గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు అతడిని బంధించి విచారిస్తే పై మూడు సంఘటనల గుట్టూ బయటపడ్డాయి.)
5. మార్చి 16, 2009: మంగుళూరులోని బబ్బుకత్తె నిత్యాధార్ చర్చి ప్లాంటేషన్ లో కొందరు కాషాయ జెండాని ఎగరేసారు. ఈ సంఘటనకు కారకులయిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరూ క్రైస్తవ మతస్తులే. హిందువులను అప్రతిష్ఠ పాలు చెయ్యడానికే తాము ఇలా చేసామని వారు పేర్కొన్నారు.
6. డిసెంబర్ 1, 2014: న్యూ ఢిల్లీ దిల్షాద్ గార్డెన్స్ వద్ద సెయింట్ సెబెస్టియన్ కేథలిక్ చర్చిలో అగ్ని ప్రమాదం సంభవించింది. సిట్ జరిపిన విచారణలో దీనికి కారణం షార్ట్ సర్క్యూట్ అని తేలింది.
7. డిసెంబర్ 6, 2014: ఢిల్లీలో జసోలా వద్ద గల లేడీ ఆఫ్ ఫతేమా చర్చి కిటికీ అద్దం ఒక రాయి తగిలి పగిలింది. చర్చి బయట ఆటలాడుకుంటున్న పిల్లలు విసురుకుంటున్న రాళ్ళలో ఒకటి చర్చి కిటికీ అద్దానికి తగిలిందని ఈ సంఘటనకి ప్రత్యక్ష సాక్షుల కథనం. వీరిలో ఒక పోలీసు కమీషనర్ కూడా ఉన్నారు.
8. జనవరి 14, 2015: రాత్రి సమయంలో ముగ్గురు మోటారు బైకుల మీద వచ్చి ఢిల్లీలో వికాస్ పురి వద్ద గల లేడీ ఆఫ్ గ్రేసెస్ చర్చి ప్రాంగణంలోకి ఒక రాయి విసిరారు. ఇది CCTV లలో రికార్డు అయ్యింది. దీని సహాయంతో పోలీసులు ఆ ముగ్గురినీ పట్టుకున్నారు. విచారణలో వారు ఆ రాత్రి బాగా మద్యం సేవించి వచ్చి గోల చేసిన ఆతతాయి కుర్రాళ్ళని తేలింది.
9. ఫిబ్రవరి 2, 2015: ఢిల్లీలో వసంత కుంజ్ వద్ద సెయింట్ ఆల్ఫోన్సా చర్చిలోకి ఒకడు చొరబడి 2 డివిడి ప్లేయర్లను, పురాతన కాలానికి చెందిన ఒక పాత్రను దొంగిలించాడు. ఇది మామూలు దొంగతనమే ననీ, చర్చి జరిగిన దాడి కాదనీ చర్చి అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
10. ఫిబ్రవరి 13, 2015: హోలీ చైల్డ్ ఆగ్జిలియం కాన్వెంట్ స్కూలు ప్రిన్సిపాల్ ఆఫీసులో 12 వేల రూపాయలు దొంగతనం జరిగింది. ఇది దొంగతనమేననీ, తమ స్చూలుపై జరిగిన దాడి కాదని స్కూలు యాజమాన్యం బహిరంగంగా చెప్పింది.
11. ఫిబ్రవరి 25, 2015: మంగుళూరులో సెయింట్ జోసెఫ్ వాజ్ చర్చిపై ఒక ఆకతాయి ఒక గులకరాయి విసిరి కిటికీ అడ్డం పగులగొట్టాడు. నిందితుణ్ణి పట్టుకుని విచారిస్తే అతడు ఆ చర్చిలోనే ఉద్యోగం చేస్తున్నాడనీ, ఎంతో కాలంగా తనకు జీతం పెంచలేదన్న కోపంతో అలా చేసాడనీ తెలిసింది. అయినా ఈ సంఘటనపై సంఘాలు, వివిధ చర్చి యూనియన్లు, రాజకీయ నాయకులు మాత్రం మైనారిటీలపై దాడులు జరిగిపోతున్నాయని గగ్గోలు పెట్టారు.
పైన పేర్కొన్న సంఘటనలలో హిందువుల లేదా హిందూత్వ సంస్థల ప్రమేయం లేనేలేదు. కానీ మనదేశంలోని మీడియా, సెక్యులర్ వర్గాలవారు మాత్రం మైనారిటీలపై హిందూత్వ సంస్థల దాడులు పెరిగిపోతున్నాయంటూ గోల చేస్తున్నారు.
2014లో ఒక్క న్యూ ఢిల్లీలోనే 1,55,654 నేరాలు నమోదయ్యాయి. వీటిలో 10,309 సంఘటనలు దోపిదీలకి సంబంధించినవి, 42,634 ఇతర సంఘటనలు. వీటిలో బాదితులెవరూ ఈ సంఘటనలను తమ వర్గాలపై జరుగుతున్నా దాడులుగా పేర్కొనలేదు. మరి ఒక్క క్రైస్తవ సంస్థలలో మాత్రమే చోటు చేసుకున్న సంఘటనలకు మతం రంగు ఎందుకు పులుముతున్నారు? ఇది ఎంత సిగ్గుచేటైన విషయం?
క్రైస్తవులపై దాడులు చేస్తున్నది ఎవరు?
Reviewed by rajakishor
on
7:41 AM
Rating:
No comments: