Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

హిందుత్వం విశ్వజననీం


ఇది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలాక్ మాన్యశ్రీ మోహన్ జీ భాగవత్ చెప్పినది. 

మనదేశానికి ఒక సంస్కృతి, ఒక గుర్తింపు ఉన్నాయి. ఏ కారణం చేతనైనా మనదేశానికి ఇతరులు రావచ్చు. వ్యాపారం నిమిత్తమో, నివాసం కొరకో, ఆక్రమణల కొరకో ఎందరో మన దేశంలో అడుగుపెట్టారు. కానీ వీళ్ళంతా ఈ దేశం యొక్క గుర్తింపుతో ఏకరూపత చెందవలసి ఉంది. 

మనదేశంలో భాషల, సంప్రదాయాల, ప్రాంతాల వైవిధ్యం ఉండవచ్చు. వాటన్నింటినీ జోడించే ఏకసూత్ర రూపమైన వైశిష్ట్యం ఈ దేశానికి ఉంది. ఈ వైశిష్ట్యంతో అందరూ ఏకాత్ములు కావలసి ఉంటుంది. 

మనదేశపు గుర్తింపు, వైశిష్ట్యం హిందుత్వం. ఇది ఏదో మత సంప్రదాయం కాదు. కనీ అన్ని సంప్రదాయాలను ఒకటిగా చేసే శక్తి ఉన ఒకే ఒక ఆలోచన. 

హిందువులకు ఒకే భాష అని లేదు. కాని ప్రపంచంలో అన్ని భాషలను ఒకటిగా చేయగల సామర్థ్యం ఉంది. 

హిందువులు ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన వారు కాదు. ప్రపంచంలో ఎక్కడి వారైనా సరే తమ భాషలను, సంప్రదాయాలను, అలవాట్లను వాదులుకోకుండానే హిందువు కావచ్చు. 

ఇది మన భారతదేశం యొక్క, హిందుత్వము యొక్క పరంపర. ఈ విధంగానే హిందుత్వం వికసించింది. ఈ రీతిలోనే మనమందరమూ ఈ సంస్కృతిలో ఏకం అయ్యాం. మన స్వాభిమానపు మానబిందువులను గుర్తిన్చుకున్నాం. మన పూర్వజులతో మనకు గల సంబంధాన్ని నిలుపుకున్నాం. దీనివల్లనే వైవిధ్యభరితమైన మన దేశపు ఏకతా సూత్రం మనకు అవగతమౌతుంది. 

ప్రపంచంలో ఏ మత విశ్వాసము, తాత్త్విక చింతన కూడా మానవ జీవితము, ప్రపంచ మానవాళి గురించి ఇంత సమగ్రంగా ఆలోచించలేదు. ఒక్క హిందుత్వం మాత్రమే సమగ్ర జీవన చింతనను ఆవిష్కరించింది. 



అందుకే హిందుత్వం విశ్వజననీం!
హిందుత్వం విశ్వజననీం Reviewed by rajakishor on 7:53 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.