Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

దేశ హితం పట్టని ఎన్‌జిఓలు

ప్రొ. ముదిగొండ శివప్రసాద్, ఆంధ్రభూమి, 21-04-2015

గ్రీన్‌పీస్‌కు చెందిన ప్రియా పిళ్లై.. బొగ్గు గనుల కేటాఋంపు వల్ల మధ్యప్రదేశ్‌లో స్థానిక గిరిజనులు నిర్వాసితులు కావడం గురించి బ్రిటీష్ పార్లమెంటు సభ్యులకు వివరించడానికి లండన్‌కు బయలుదేరుతుంటే గత ఫిబ్రవరిలో ఢిల్లీ విమానాశ్రయంలో ఆపి వేయడం సంచలనం కలిగించింది. దేశంలో ‘అభివృద్ధి’కి ప్రతిబంధకంగా పలు ఎన్.జి. ఓ.లు పనిచేస్తున్నాయని గత సంవత్సరం జూన్‌లో నిఘా విభాగం ప్రధానమంత్రికి సమర్పించిన నివేదికలో ఈ సంస్థ పేరు కూడా ఉండటం గమనార్హం.

ప్రభుత్వ విధానపర నిర్ణయాలు, చట్టాల రూపకల్పనలో ఇటువంటి ప్రభుత్వేతర సంస్థలు అపరిమిత ప్రభావం చూపుతుండగా, కొన్ని సంస్థలు రాజకీయ లక్ష్యాలతో కలిసి పనిచేస్తున్నామనే విమర్శలు ఎదుర్కొంటున్నాయ. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులైన కొందరు విదేశీ సంస్థల నుండి నిధులు పొందుతూ, ఎన్.జి.ఓ. కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేసి, రాజకీయ రంగానికి తమ కార్యకలాపాలను విస్తరింప చేసుకున్న వారు కావడం గమనార్హం.అందుచేత విదేశ సంస్థల నుండి నిధులు ఎన్.జి.ఓలు పొందడాన్ని నిషేధించాలని కోరుతూ కొందరు ప్రముఖులు ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించారు. సిబిఐ నివేదిక ప్రకారం 20 రాష్ట్రాలలో 22 లక్షలకు పైగా ఎన్.జి.ఓ.లు దేశంలో పనిచేస్తుండగా కేవలం 10 శాతం లోపు సంస్థలు మాత్రమే తమ వార్షిక ఆదాయాలను ప్రభు త్వానికి సమర్పిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల నుండి నిధులు పొందుతున్న సంస్థలు పలు అక్రమాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2011-12లో 22వేలకు పైగా ఎన్.జి.ఓ.లు విదేశాల నుండి రూ.11,546 కోట్ల నిధులు పొందాయి. ఐక్యరాజ్యసమితి నుండి వచ్చే నిధులు వీటిల్లో కలవవు. గత పదేళ్ళకు పైగా కేంద్ర ప్రభుత్వానికి, ఎన్.జి.ఓ.ల మధ్య సంబంధాలు ఇబ్బందికరంగా పరిణమించినట్లు స్పష్టమవుతోంది.

యుపిఎ పాలనలో ‘సమాంతర మంత్రివర్గం’గా పనిచేసిన జాతీయ సలహా మండలిలో పలు ఎన్.జి.ఓ.లు క్రియాశీల పాత్ర వహించారు. తొలుత 1976లో ఈ సంస్థలు విదేశాల నుండి తీసుకొస్తున్న నిధులపై ఆజమాయిషీ అవసరం అని విదేశీ నిధుల నియంత్రణ చట్టం-ఎస్.సి.ఆర్.ఎ-ను తీసుకొచ్చారు. 2013-14లో ఈ చట్టానికి కఠిన నిబంధనలను ఆర్థికమంత్రి పి.చిదంబరం తయా రు చేశారు. నిధులు దుర్వినియోగమైతే వాటిని తీసుకున్న స్థానిక సంస్థలే కాకుండా నిధులు సమకూర్చిన విదేశ సంస్థలు సైతం బాధ్యత వహించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు. ప్రస్తుతం విదేశీ నిధుల నియంత్రణ కోసం మరో చట్టం తీసుకురావాలని నరేంద్ర మోది ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన కొత్తలో ఎన్‌జివోల పాత్ర కొన్ని రంగాలకే పరిమితమైనప్పటికీ, క్రమంగా పలు అభివృద్ధి కార్యక్రమాల అమలులో పౌర సమాజం లో ఎన్.జి.ఓ.ల పాత్ర ప్రారంభమైంది. 1980ల నుండి వాటి విస్తరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ బ్యాంక్ దృష్టిలో ఎన్.జి.ఓ.లు ప్రభుత్వంతో సంబంధం లేనివి. ప్రాథమికంగా మానవమత, సహకార ధోరణి గలవి. అయితే సమాజంలో ఉన్న స్వచ్ఛంద, సామాజిక సంస్థల కన్నా ఇవి భిన్నమైనవి. స్వచ్ఛంద, సామాజిక సంస్థలు సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకొని, తమవంతుసేవ అందించడం కోసం, సొంతంగా వనరులను సమీకరించుకొని, ప్రజలను భాగస్వాములను చేసి పని చేస్తుంటారు. వాటికి భారీ యం త్రాంగాలు అవసరముండదు.

భారతదేశంలో 19వ శతాబ్దం నుండి పలు ధార్మిక, సేవా సంస్థలు సమాజంలో సంస్కరణల కోసం పని చేస్తుండేవి. వాటిల్లో బ్రహ్మసమాజ్, యంగ్ బెంగాల్ ఉద్యమం (1828), వేద సమాజ్ (1864), ప్రార్థనా సమాజ్ (1867), సత్యశోధక సమాజ్ (1873), ఆర్యసమాజ్ (1875), థియసాఫికల్ సొసైటీ (1879) లు వీటిల్లో ముఖ్యమైనవి. ఆ తర్వాత స్వాతంత్య్ర ఉద్యమానికి ఇవే పునాదులు వేశాయి. 1951లో వినోబాభావే చేపట్టిన భూదాన ఉద్యమం ఈ సందర్భంగా పేర్కొనదగినవి. 1975లో మహారాష్టల్రో అన్నా హజా రే చేపట్టిన గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలు గమనార్హం. అయితే నేడు ఎన్.జి.ఓ.లలో ‘స్వచ్ఛంద సేవ’కు అవకాశం ఉండటం లేదు. భారీ జీతాలతో, విలాసవంత జీవితాలను గడుపుతూ పనిచేసే సిబ్బంది కేంద్రంగా పనిచేస్తున్నాయి.

ప్రభుత్వాలు సైతం తాము చేపట్టిన కార్యక్రమాలు నేరుగా ప్రజలకు చేరడానికి ఎన్.జి.ఓ.ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ వచ్చాయి. అయితే ప్రభుత్వ శాఖల్లో అవినీతి, పక్షపాతం, అసమర్థత... వంటి రుగ్మతలు ఎన్.జి.ఓల్లో సైతం చోటుచేసుకుంటున్నాయి. చారిత్రాత్మకంగా ‘స్వచ్ఛంద సేవ’ను ప్రోత్సహించడానికి ప్రారంభించే సంస్థలు నేడు ప్రభుత్వ శాఖలకు ‘సమాంతర సంస్థలు’గా ఎదుగుతున్నాయ. నేడు బహు విధాలుగా విస్తరిస్తున్న ఎన్.జి.ఓ.ల కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వంలో ఎలాంటి యంత్రాంగం లేదని చెప్పవచ్చు. అందుకు చట్టపరమైన పక్రియ సైతం లేదు. సిపాయల తిరుగుబాటు జరిగిన 1857 అనంతరం 1860లో బ్రిటిష్ ప్రభుత్వం సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం తీసుకొచ్చింది. ఇది కేవలం దాతృత్వం, సాహిత్య, శాస్ర్తియ సంఘటనల మాత్రమే పరిమితమైనది. స్వాతంత్య్రం అనంతరం ఇటువంటి సంఘాలకు సంబంధించి చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు వదిలేశారు. పలు రాష్ట్రాలు తాజాగా చట్టాలు చేసి, అమలు బాధ్యతను సొసైటీల రిజిస్ట్రార్‌కు అప్పచెప్పారు. అయితే తమకున్న పరిమిత సిబ్బందితో సంఘాలను నమోదు చేసుకోవడం మినహా, ఈ కార్యాలయాల అధికారులు వాటి కార్యకలాపాలను పర్యవేక్షింప లేకపోతున్నారు. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు ఎన్.జి.ఓ.లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వారికి దేశ, విదేశాలు కార్యాలయాల్లో పనిచేస్తున్నాయి. అన్ని సామాజిక అంశాలపై - అభివృద్ధి, పర్యావరణం, విపత్తు, ఆరోగ్యం, భూ సమస్యలు, మానవ హక్కులు... వంటి రంగాల్లో ఇవి పనిచేస్తున్నాయి. అటువంటి సంస్థలను పర్యవేక్షింపగల నైపుణ్యం సొసైటీ రిజిస్ట్రార్‌లకు లేదని చెప్పవచ్చు. పైగా కాగితాలపైననే పనిచేస్తూ, క్షేత్రస్థాయికి వెళ్ళడానికి ప్రభుత్వ అధికారులు విముఖత చూపుతున్న రంగాల్లో ప్రభుత్వ నిధులతో ఎన్.జి.ఓ.లు ప్రభు త్వంలో భాగస్వామిగా పనిచేస్తున్నాయి. గతంలో వలె స్వచ్ఛంద విరాళాలతో పనిచేయడం లేదు. పలు అంశాల్లో ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకుంటూ ఎన్.జి.ఓ. లను రంగంలోకి తీసుకొస్తున్నది. వివిధ అంతర్జాతీయ సంస్థలు - ప్రపంచ బ్యాంక్ నుండి ‘యునెస్కో వరల్డ్’- తమ నిధులను పెద్ద ఎత్తున ఎన్.జి.ఓ.ల ద్వారా ఖర్చు పెడుతున్నాయి. దానితో ఎన్.జి.ఓ.లు తమకు నిధులు సమకూర్చుతున్న సంస్థల ప్రయోజనాలకు ఇస్తున్న విలువ దేశ హితానికి ఇవ్వడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి.

దేశవిద్రోహకర కార్యకలాపాలు సాగిస్తున్న పలువురు ఎన్.జి.ఓ.ల ముసుగు వేసుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ముఖ్యంగా పలు ఎన్.జి.ఓ.లకు ఇతర దేశాల నుండి నిధులు సమకూర్చే సంస్థలు కొన్ని బహుళ జాతి సంస్థలకు చెందినవి. దానితో ఆయా సంస్థల వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలకు, మన దేశంలో అనువైన వాతావరణం కలిగించడం కోసం ఇక్కడ పలు ఎన్.జి.ఓ.లు పనిచేస్తున్నాయి. ఆయా బహుళ జాతి సంస్థల ఆర్థిక ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించే ప్రాజెక్టులను, నిర్వహణలను మన దేశంలో జరుగనీయకుండా, వాటికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలను సమీకరించి ఉద్యమాలు నిర్వహించడం కూడా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అంటే రాజకీయ లక్ష్యంతో, మన దేశ అభివృద్ధి - ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఈ సంస్థలు పని చేస్తుండటం పై దేశమంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. విదేశీ నిధులతో సంస్థలు పనిచేయడం వల్ల దేశంలో స్వచ్చందంగా సమాజసేవ చేయడం నిరుత్సాహానికి గురవుతున్నదని 1993లో ప్రణాళికా సంఘం మాజీ సలహాదారుడు ఓంకార్‌రాయ్ ప్రకటించడం అప్పట్లో పెను వివాదానికి దారితీసింది. అందుకనే ఈ సంస్థలకు ‘ప్రవర్తనా నియమావళి’ రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు.

ఇలా ఉండగా, గత రెండు దశాబ్దాలుగా ఎఫ్.సి.ఆర్.ఎ.ను రద్దుచేయాలని కోరుతూ ఎన్.జి.ఓ.లు ఉద్యమాలు చేస్తున్నాయి. విదేశాలనుంచి వచ్చే నిధులను విచ్ఛన్నకర కార్యకలాపాలను ఉపయోగించకుండా ఈ చట్టం అడ్డుకుంటుంది. అయతే ఆయ స్వచ్ఛంద సంస్థలకు హవాలా మార్గంలో నిధులు అందుతున్నాయ. ఈ నేపథ్యంలో హోంమంత్రిత్వ శాఖ వద్ద తాము నమోదు చేసుకొనే అవసరం లేకుండా చేయాలని కోరుతున్నాయి.

అయితే ఈ నిధులు నేరుగా బ్యాంక్‌ల ద్వారా వస్తుండడంతో జాతీయ భద్రత దృ ష్ట్యా ప్రభుత్వం ఆ నిధుల రాక - వ్యయాల గురించి పట్టించుకోకుండా ఉండటం సాధ్యం కాదు. గత దశాబ్ద కాలంగా పలు ఎన్.జి.ఓ.లు దేశంలో చేపట్టిన పలు భారీ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం వాటి ఉద్దేశాలపట్ల అనుమానంతో చూడడం ప్రారంభించింది. ఎన్.జి.ఓ.ల పట్ల ప్రభుత్వ ధోరణిలో అధికార పక్షాలు మారుతున్నా ఒకే విధంగా ఉంటుండటం గమనార్హం. విద్య, వైద్య, విపత్తు నివారణ వంటి సామాజిక అంశాలపై ఎన్.జి.ఓ.లు పనిచేస్తున్నంతకాలం ప్రభుత్వం సైతం పట్టించుకోవలసిన అవసరం ఉండదు. కానీ ప్రభుత్వ రాజకీయ, ఆర్థిక విధానాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేపడుతుండటంతో వివాదాలు అనివార్యం అవుతున్నాయి. ఇందిరాగాంధీ .. తనకు వ్యతిరేకంగా జరిగే ప్రతి రాజకీయ కార్యకలాపానికి వెనుకు ‘విదేశీ హస్తం’ ఉన్నదని ప్రకటిస్తుండటాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. నేడు యుపి ఎ, ఎన్‌డిఎ పాలనలో విదేశీ నిధులు పొందుతున్న ఎన్‌జివోలు తమ కార్యకలాపాల ద్వారా ప్రభుత్వాలను ఒక విధంగా అపహాస్యం చేస్తున్నాయనే భావించాలి. ఎన్.జి.ఓ.ల్లో జవాబుదారీ తనం, పారదర్శకత లోపించడంతో వాటి కార్యకలాపాలపట్ల ప్రభుత్వం అనుమానంగా చూడటానికి దారితీస్తున్నది. విదేశీ నిధులు దుర్వినియోగం కాకుండా, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఖర్చు పెట్టే అవకాశం లేకుండా చేయడం కోసం నరేంద్ర మోది ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావలసిన అవసరం కనిపిస్తున్నది.

ముందుగా ఎఫ్‌సిఆర్‌ఎ నిబంధనలను పలు సంస్థలు ఉల్లంఘిస్తున్నట్లు వాదిస్తున్న ప్రభుత్వం ఆయా ఉల్లంఘనలను పరిశీలించి, తగు చర్యలు తీసుకోవడం కోసం ఒక ఉన్నత స్థాయి కమిషన్‌ను ఏర్పాటుచేయటం, ఎఫ్‌సిఆర్‌ఎ రద్దుచేయడం పరిష్కాకారం కాదు. ఇదే సమయంలో సహేతుకంగా పనిచేస్తున్న ఎన్.జి.ఓలను, ఉద్యమకారులను వేధించే విధంగా ఎఫ్‌సిఆర్‌ఎను ప్రభుత్వం దుర్వినియోగం చేయకుండా కట్టడి చేయాలి. అందుకు చట్టబద్ధ రక్షణలు కల్పించాలి.

దేశ హితం పట్టని ఎన్‌జిఓలు Reviewed by rajakishor on 9:38 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.