నన్ కి పరిహారం చెల్లించిన చర్చి
క్రైస్తవ నన్ లపై, ఇతర ప్రజలపై చర్చి ఫాదర్లు చేస్తున్న అత్యాచారాలు స్పందిస్తూ పోప్ జాన్ పాల్-2, ప్రస్తుత పోప్ క్షమాపణ చెప్పుకున్నారు. అలాగే పసి పిల్లలపై నన్ లు, ఫాదర్లూ చేస్తున్న అత్యాచారాలకు కూడా పోప్ లు క్షమాపణలు చెప్పుకున్నారు.
సిస్టర్ అభయ కేరళలోని సైరో మలబార్ చర్చిలో దైవ సేవిక (నన్). 1991లో అదే చర్చికి చెందిన ఇద్దరు ఫాదర్లు తప్పతాగి ఒళ్ళు తెలియని భావావేశంలో 19 ఏళ్ళ అభయను దారుణంగా చంపేశారు. వీరికి మద్యం సేవించిన మరొక నన్ కూడా సాయపడింది. ఆ ఇద్దరు ఫాదర్లూ అభయను చంపేసి ఆమె శవాన్ని దగ్గరలోని ఒక కాన్వెంట్ ఆవరణలోని బావిలో పడేశారు. "బ్రెయిన్ మాపింగ్" మరియు "పాలిగ్రాఫ్" పరీక్షల ద్వారా ఆ ఫాదర్లు, నన్ కలిసి చేసిన నేరం నిర్ధారితమైంది. అయినా పోలీసులు, రాజకీయ నాయకుల సహాయంతో కేరళ చర్చి ఈ దారుణ హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలను అన్నింటినీ మాయం చేసేసింది. 1991 నుంచీ కేరళ చర్చి ఆ ఇద్దరు ఫాదర్లను, మద్యం సేవించిన నన్ ను కాపాడుతూ వస్తోంది. తన విచారణలో వెల్లడైన విషయాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) బయటపెట్టాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా కేరళ చర్చి తన ధనబలంతో, మంది బలంతో, రాజకీయ నాయకుల అండతో ఆ వివరాలు బయటికి పొక్కకుండా చేసింది.
అయితే తాజాగా సిస్టర్ అనిత మానభంగం విషయం బయటికొచ్చింది. ఆమెను ఒక క్రైస్తవ మతాధికారి బలాత్కారించేడు. అనిత సిస్టర్స్ ఆఫ్ అగాథా సంస్థకు చెందినది. ఆమె మధ్యప్రదేశ్ లోని పాంచోర్ గ్రామంలో ఉపాధ్యాయనిగా పనిచేసేది. ఆమెపై ఒక క్రైస్తవ మతాధికారి 2011లో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీని గురించి ఆమె ఫిర్యాదు చేసినప్పుడు ఆమెను వెంటనే ఇటలీలోని "మదర్ హౌస్" బదిలీ చేసేరు. అక్కడ ఆమె మాటలలో చెప్పడానికి వీలు లేని బౌతిక, మానసిక చిత్రహింసలకు గురయ్యింది. అక్కడ ఆమెను చాలా ఆటవికంగా , అమానుషంగా హింసించారు. తిండిలేక ఆమె రోజుల తరబడి ఆకలితో అలమటించింది.
కొంతకాలం తరువాత ఇటాలియన్ కన్వెన్షన్ ఆమెను బయటికి గెంటేసింది. ఒక స్నేహితురాలి సహాయంతో అనిత కేరళలోని కొచ్చి వద్ద గల అలువా అనే ఒక అనాధ శరణాలయంలో చేరింది.
ఇంత జరిగినా తనకు జరిగిన అన్యాయంపై అనిత పోరాటం ఆపలేదు. సెయింట్ జోసెఫ్ చర్చి నిర్వహించిన ఒక సమన్వయ సమావేశంలో అనిత తనకు జరిగిన అన్యాయంపై అందరినీ నిలదీసింది. ఈ సమావేశానికి సైరో మలబార్ చర్చి అధికార ప్రతినిధి ఫాదర్ పాల్ అధ్యక్షుడు. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడేమో, నష్ట పరిహారంగా అనిత చేతిలో 12 లక్షల రూపాయలు పెట్టి ఎవ్వరి వద్దా ఈ విషయం ప్రస్తావించవద్దనీ, "హోలీ రోబ్స్"ను వదిలి ఎక్కడికైనా వెళ్ళిపొమ్మని చెప్పేడు.
అసలు కేరళ చర్చి చరిత్రలో ఒకరికి నష్ట పరిహారం చెల్లించడం ఇదే మొదటి సారి.
నన్ కి పరిహారం చెల్లించిన చర్చి
Reviewed by rajakishor
on
2:50 PM
Rating:
No comments: