సామా జగన్ లాగ దేశం కోసం ప్రాణమిచ్చే దైర్యం RSS శాఖా లోనే వస్తుంది: దత్తాత్రేయ హోసబలె
ఓరుగల్లు ( వరంగల్ ) , 27/03/2015 : దేశం కోసం, జాతీయ జెండా స్వాభిమానం కోసం ప్రాణమిచ్చే దైర్యం కేవలం సంఘ శాఖలోనే నిర్మాణం అవుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సహా సర్ కార్యవాహ ( సంయుక్త ప్రధాన కార్యదర్శి ) మాన్య శ్రీ దత్తాత్రేయ హోసబలె అన్నారు.
స్థానిక వరంగల్ నగరం లో "జెండా వీరుడు" సామా జగన్ మోహన్ స్మారకాత్మం నిర్మించిన ' సామా జగన్ మోహన్ స్మారక భవన్ ' ప్రారంభోత్సవానికి ముఖ్య అధితిగా మాన్య దత్తాత్రేయ హోసబలె హాజరయ్యారు, ఈ సందర్భంలో ఆయన మాటాడుతూ ' దేశం నది బొడ్డున ఉన్న ప్రఖ్యాత కాకతీయ విశ్వ విద్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయకుండా అడ్డుకున్న RSU గుండాలను ఎదుర్కొని, వందే మాతరం, భారత్ మాతా కి జై అంటూ నినదిస్తూ జాతీయ పతాక గౌరవాన్ని కాపాడిన సామా జగన్ మోహన్ జీవితం అందరికి ఆదర్శ ప్రాయం, ఆ పోరాటంలోనే భాగంగా నక్సలైట్ల క్రూరత్వానికి బలి అయిన సామా జగన్ లాంటి దేశ భక్తుడు మా (RSS) స్వయం సేవక్ కావడం మనందరికీ గర్వ కారణం' అని ఆయన పేర్కొన్నారు.
సామా జగన్ లాగ దేశం కోసం ప్రాణమిచ్చే దైర్యం RSS శాఖా లోనే వస్తుంది: దత్తాత్రేయ హోసబలె
Reviewed by JAGARANA
on
3:22 PM
Rating:
Reviewed by JAGARANA
on
3:22 PM
Rating:

No comments: