రామో విగ్రహవాన్ ధర్మః
సుగ్రీవునితో చెలిమి చేసిన శ్రీ రాముడు వాలిని వధించేడు.
అప్పుడు వాలి, "రామా! నన్ను ఎందుకు వధించేవు? నీకు నాకు శత్రుత్వం లేదు. నీతో నేను యుద్ధం చేయలేదుగా?" అని అడిగాడు.
అందుకు శ్రీ రాముడు బదులిస్తూ ఇలా అన్నాడు:
"వాలీ! తమ్ముని భార్య కోడలితో సమానం. అలాంటి ఆమెను పొందు కోరి చెరబట్టావు. నీవు కామాంధుడవు. నీ రాజ్యంలో స్త్రీలకు రక్షణ లేదు. నీ తమ్ముని రాజ్యం ఆక్రమించావు. ప్రస్తుతం భారత దేశానికి భరతుడు చక్రవర్తి. ఆయన తరఫున ధర్మ సంస్థాపన చేయడానికి నేను రాజ ప్రతినిధిని. నేను నిన్ను క్షమిస్తే రేపు రావణాసురుని కూడా క్షమించాలి. అప్పుడు దేశం మొత్తం అరాచకమే అవుతుంది. ప్రజాక్షేమం ఉండదు. కనుక రేపు రాముని ఏమి చేయబోతున్నానో అది ముందుగా ప్రపంచానికి తెలిసేటట్లు చేస్తున్నాను.
"నాకు ధర్మమే ప్రధానం. అవసరమైతే ధర్మం విషయంలో సీతను, లక్ష్మణుని కూడా వదులుకోడానికి నేను సంసిద్ధుడినే. తప్పు చేసిన నిన్ను ధర్మ శాస్త్రం ప్రకారం నీ చేతికి కట్టి ఇచ్చి ద్వంద్వ యుద్ధం చేసి చంపాలని లేదు. కనుక నేను ఎలా చంపినప్పటికీ ప్రజా రక్షణ కోసం అది ధర్మమే అవుతుంది."
శ్రీ రామునికి అగ్ని పరీక్ష:
రావణ వధానంతరం సీతకు రాముడు అగ్నిపరీక్ష విధించాడు. కానీ అంతకు ముందే సీత రామునికి అగ్ని పరీక్ష విధించింది. సీతాన్వేషణకు లంకకు వెళ్ళిన హనుమంతుని ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించి రావణుని సమక్షంలో నిలుపుతాడు. హనుమంతునిపై కోపించిన రావణుడు అతని తోకకు నిప్పు పెట్టమని చెపుతాడు. రాక్షసులు హనుమ వాలమునకు నిప్పు పెడతారు. ఆ నిప్పుతోనే హనుమంతుడు లంకాదహనం చేస్తాడు. ఆ సమయంలో అశోకవనంలో ఉన్న సీతాదేవి, "నా భర్త పరస్త్రీని కోరనివాడైతే, ధర్మస్వరూపుడే కనుక అయితే, నేను మనసా వాచా పరపురుషుని కోరని దాననైతే హనుమ వాలమున కాలుచున్న అగ్ని చల్లారును గాక అని సంకల్పించింది. హనుమంతుని తోక చల్లారింది.
అలా సీత పెట్టిన అగ్ని పరీక్షలో శ్రీరాముడు కూడా నిగ్గుతేలాడు. రామ కార్యార్థి కనుక ఆ అగ్ని హనుమంతుని ఏమీ చేయలేకపోయింది.
సీతాదేవికి అగ్ని పరీక్ష:
రావణవధానంతరం సీతాదేవికి అగ్నిపరీక్ష విధిస్తాడు శ్రీరాముడు. ఏం, సీతాదేవి గూర్చి ఆయనకీ తెలియదా? తెలుసు. మరెందుకిలా చేసాడు?
మానవధర్మాన్ని సుప్రతిష్ఠ చేయడానికి శ్రీరాముడు జన్మించాడు. తన ఆదర్శం యొక్క మూర్తిత్వాన్ని చూపించి లోకానికి మార్గదర్శనం చేయాలి. పురుషునికే కాదు నారీలోకానికి కూడా ధర్మమంటే ఇదీ అని ఆచరణీయాత్మకంగా తెలియజేయాలి. తాను స్నేహం చేసిన సుగ్రీవుడు అన్న వాలిచే బాధితుడు. అంతకు ముంది దుందుభి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి కొండ గుహలో ఉండిపోతే సుగ్రీవుడు కిష్కిందకు రాజౌతాడు. వాలి భార్య తార అప్పుడు సుగ్రీవునితో భోగాలనుభావిస్తుంది. తిరిగి వచ్చిన వాలి, సుగ్రీవుని తరిమేసి అతని భార్య రుమను చెచేరబడతాడు. అప్పుడు తార వాలిని చేరుతుంది. వాలి వధానంతరం తార మళ్ళీ సుగ్రీవునితో భోగాలనుభావిస్తుంది.
సీతాన్వేషణ సమయంలో హనుమంతుడు లంకలో అంతఃపుర స్త్రీలు మద్యపానము చేసి, వావివరుసలు లేక, ఒళ్ళు తెలియని స్థితిలో నగ్నంగా ఒకరినొకరు కావలించుకుని పడుకొని ఉండడం చూస్తాడు. నాటి రాచ కుటుంబాలలో కాని, జనసామాన్యంలో కాని వావివరుసలు లేక భోగాలనుభావించడం సాధారణమైపోయింది. మానవధర్మం అతి సహజంగా గతి తప్పింది. రావణవధానంతరం సేతాదేవిని తీసుకువస్తున్నప్పుడు అక్కడ శ్రీరాముని కోసం భూమి నాలుగు చెరగుల నుండి వచ్చిన వానరులున్నారు. లంకావాసులు కూడా ఉన్నారు. అమిత బల పరాక్రమవంతుడైన రావణాసురుని వధించిన మహాపురుషునిగా శ్రీరాముడు అక్కడ ఎదురుగా ఉన్నాడు. అప్పుడు, అక్కడ శ్రీరాముడు ఏది చేస్తే అది అందరూ ఆదర్శంగా స్వీకరిస్తారు. తమతమ ప్రాంతాలలో గొప్పగా చెప్పుకుంటారు. సీతాదేవిని మామూలుగా స్వీకరిస్తే తాము కూడా శ్రీరాముని వలె ఉచితానుచితాలు ఆలోచించకుండా జీవించవచ్చుననుకుంటారు. మరి అప్పుడు శ్రీరాముడు చేసింది రావణుని వధించడమే గాని ధర్మప్రతిష్త అవుతుంది. పైగా సీతాదేవి విషయం లోకానికి తెలియదు. అందరి స్త్రీల వలెనే ఆమె కూడా అని అనుకోవచ్చు.
అందుకే శ్రీరాముడు అగ్నిపరీక్ష ద్వారా తానేమిటో, సేతాదేవి ఏమిటో లోకానికి తెలియజేసాడు. ధర్మాన్ని మానవ జీవన సమున్నత ఆదర్శంగా ఆచరణాత్మక సుప్రతిష్ఠ చేసాడు.
సత్యమనేది జ్వలించే అగ్ని. అందులో నిగ్గుతేలునదేదో అదే ధర్మము. అందుకే శ్రీరాముడు ధర్మమూర్తి. సీతామాత ధర్మస్వరూపిణి.

అందుకే రామాయణం ఇలా చెప్తుంది:
సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మః ప్రతిష్ఠితః
సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం
రామో విగ్రహవాన్ ధర్మః
Reviewed by rajakishor
on
7:43 AM
Rating:
No comments: