హనుమాన్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి : భజరంగ్ దళ్ డిమాండ్
ప్రభుత్వం శ్రీ హనుమాన్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలి, లేని ప్రక్షంలో భజరంగ్ దళ్ తమ ఆందోళనను ప్రజాస్వామిక పద్దతిలో ప్రభుత్వానికి తెలియజేస్తుంది, ఇది తెలంగాణ రాష్ట్రం లోని హిందువుల ఆత్మ గౌరవ సమస్య - భజరంగ్ దళ్
కోఠి, భాగ్య నగర్ : హిందువుల ఆరాధ్య దైవం శ్రీ హనుమాన్ జయంతికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించక పోవడం శోచనీయమని భజరంగ్ దళ్ అభిప్రాయ పడింది, ఈ విషయం పై భజరంగ్ దళ్ రాష్ట్ర స్థాయి బృందం ఒకటి రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మాననీయ కడియం శ్రీహరి గారిని కలసి వినతి పత్రం అందజేయడం జరిగింది, ఈ బృందంలో భజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర సహా సంయోజక్ శ్రీ సుభాష్ చందర్ గారు మరియు జనరలిస్ట్ అసోషియేషన్ అఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాలా స్వామి గారు తదితర భజరంగ్ దళ్ సభ్యులు ఉన్నారు.
ఈ సందర్భంలో శ్రీ సుభాష్ చందర్ గారు రాష్ట్ర చేతన తో ప్రత్యేకంగా మాట్లాడుతూ హనుమాన్ జయంతి రోజును హిందువులు ఏంతో భక్తీ శ్రద్ధలతో జరుపుకుంటారు, హిందూ జీవన విధానం లో హనుమాన్ జయంతికి విశిష్ట స్థానం ఉంది, అలాంటి ఈ రోజును రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఈ అంశంలో అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి భజరంగ్ దళ్ సమాయత్తం అవుతుందని ఆయన అన్నారు.
గిన్నిస్ రికార్డు కు శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 4 జరిగే శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను ఈ సారి ఏంటో ప్రతిస్టాత్మకంగా నిర్వహిస్తున్నామని లక్షకు పైగా ద్విచక్ర వాహనాలతో దాదాపు 20 కి,మీ పాటుగా జరిగే ఈ ర్యాలి ప్రపంచ రికార్డు అవుతంది, ఈ ర్యాలీని పరిశీలించడాని గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు వస్తున్నారని, కాబట్టి హిందూ యువకులందరూ తమ తమ ద్విచక్ర వాహనాలతో విజయ యాత్ర లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హనుమాన్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి : భజరంగ్ దళ్ డిమాండ్
Reviewed by JAGARANA
on
8:13 AM
Rating:
ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు పని చేయటం మాములు దినలలోనే కష్టం , దానికి తోడూ మరిన్ని సెలవలు అంటే ఇక మాములు ప్రజల పని ఎప్పుడు అవుతుంది ?
ReplyDelete