Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

RSS జాతీయ సమావేశాలు ప్రారంభం - మాతృభాష, సామజిక న్యాయం పై చర్చ

రేశంబాగ్, నాగపూర్, 13/03/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిది సభ 2015 సమావేశాలను పూజ్య సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ జి భాగవత్ జ్యోత ప్రజ్వలన తో ప్రారంభమయ్యాయి, సంఘ్ లో అత్యున్నత స్థాయి విధాన రూపకల్పన, నిర్ణాయక బృందం సమావేశాలు తేది 13-15 మార్చ్ లలో నాగపూర్ లోని రేశంబాగ్ లో జరుగుతున్నాయి.
సంఘ్ అఖిల భారతీయ ప్రతినిది సభలో మాన్య శ్రీ మోహన్ భాగవత్ & సురేష్ ( భయ్యాజి ) జ్యోషి 

గత ఆరు మాసాల కాలంలో పరమపదించిన ప్రముఖులకు నివాళి అర్పనతో కార్యక్రమాలు మొదలయ్యాయి, RSS దక్షిణ మధ్య క్షేత్ర సంఘ్ చాలక్ మాన్య శ్రీ TV దేశముఖ్, ప్రముఖ కార్టూనిస్ట్ RK లక్ష్మన్, జర్నలిస్ట్ వివేక్ మెహతా, కేరళ CPM నాయకులు MV రాఘవన్, కేరళ కాంగ్రెస్ నాయకులు స్పీకర్ కార్తికేయన్, రజని కొఠారి, మహారాష్ట్ర సమాచార హక్కు చట్టం కార్యకర్త గోవింద్ పంసారే తదితరులకు నివాళి అర్పించడం జరిగింది.
ఈ ప్రతినిధి సభలో మూడు ముఖ్యమైన అంశాల పైన చర్చ జరగనుంది.
  1. మాతృభాష మాధ్యమంగా విద్యాబోధన.
  2. ప్రతి గ్రామంలో మందిరం, నీటి నిల్వ వ్యవస్థా, స్మశానం కోసం ప్రయత్నం.
  3. ప్రతి సామాజిక క్షేత్రంలో సంఘ్ కార్య విస్తరణ.
RSS సర్ కార్యవాహ మాన్య శ్రీ భయ్యాజి జ్యోషి అధ్యక్షనతన జరిగే ఈ సమావేశాలలో ప్రాంతాల వారిగా సమీక్షా, వివిధ జాతీయ అంశాల పై చర్చ, జరగనుండి, భారత దేశం నలుమూలల నుండి హాజరయిన సుమారు, 1400 మంది ప్రతినిధులు, సంఘ్ పరివార్ సంస్థల జాతీయ స్థాయి బాధ్యులు పాల్గొంటున్నారు.
విహిప చీఫ్ ప్రవీణ్ తొగాడియ, రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ సంచాలిక వి శాంతా కుమారి, కాశ్మీరి లాల్ ( స్వదేశీ జాగరణ్ మంచ్ ) సునీల్ అంబేద్కర్ ( ABVP ), అమిత్ షా, రాం మాధవ్, రాం లాల్ ( BJP ) వంటి వారు హాజరైన వారిలో ఉన్నారు.
ఈ సమావేశంలో ఐక్య రాజ్య సమితి లో నిర్ణయించబడిన " ప్రపంచ యోగా దినోత్సవం " పై తీర్మానం చేసే అవకాశాలున్నాయి         
రైతుల కోసం పని చేసే ' భారతీయ కిసాన్ సంఘ్ ', గిరిజనుల అభ్యున్న్తకి పాటుపడే ' వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ' , దేశం లోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ' అఖిల్ భారతీయ విద్యార్థి పరిషద్ ' , కర్షక , కార్మిక రంగంలో ప్రముఖ సంస్థ ' భారతీయ మజ్దూర్ సంఘ్ ' , ఆధ్యాత్మిక రంగంలో పనిచేసే ' విశ్వ హిందూ పరిషద్ ' , భారత దేశంలనే అతి పెద్ద రెండు ప్రముఖ రాజకీయ పార్టీలలో ఒకటైన ' భారతీయ జనతా పార్టి ' ల ప్రముఖ నాయకులు ఈ సమావేశాలకు హాజరుఅవుతున్నారు .
విద్యాభారతి, విజ్ఞాన భారతి, క్రీడా భారతి, సేవా భారతి, సంస్కృత భారతి, సంస్కార భారతి, లఘు ఉద్యోగ భారతి లాంటి సంస్థల నాయకులతో పాటుగా రాష్ట్ర సేవికా సమితి, స్వదేశీ జాగరణ్ మంచ్, దీన దయాళ్ సంశోదన సమితి, భారత్ వికాస్ పరిషద్, అఖిల భారతీయ శైక్షనిక్ మహా సంఘ్, ధర్మ జాగరణ సమితి ల జాతీయ స్థాయి నాయకులు ఈ సమావేశాలకు హాజరుతారు, 
వీటితో పాటు అంధులలో ఉన్నతికై పనిచేసే " సక్షమా " , దేశం లోని సరిహద్దు జిల్లలో ప్రజలలో ఆత్మా విశ్వాసం నింపే " సీమ సురక్షా పరిషద్ " , పదవి విరమణ పొందిన సైనికుల కోసం పనిచేసే "పూర్వ సైనిక్ సేవ పరిషద్" ల ప్రతినిధులు ఈ కార్యక్రమం లో భాగమవ్వనున్నారు. 
మన ప్రాంతం నుండి మాన్య శ్రీ శ్యాం కుమార్ గారు ప్రాంత ప్రచారక్, మాన్య శ్రీ ఎక్కా చంద్రశేఖర్ గారు ప్రాంత కార్యవాహ, కాత్యం రమేష్ గారు ప్రాంత సహా కార్యవాహ తదితరులు పాల్గొన్నారు.
         
RSS జాతీయ సమావేశాలు ప్రారంభం - మాతృభాష, సామజిక న్యాయం పై చర్చ Reviewed by JAGARANA on 1:11 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.