Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

నాగపూర్ : 13-15 మార్చ్ RSS అఖిల భారతీయ ప్రతినిధి సభ - 2015 సమావేశాలు

రేశంబాగ్, నాగపూర్ 13/03/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అత్యున్నత స్థాయి విధాన నిర్ణాయక మండలి అయిన అఖిల భారతీయ ప్రతినిధి సభ - 2015 సమావేశాలు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ రేశంబాగ్ (RSS ప్రధాన కార్యాలయం) లో తేది 13-15 మార్చ్ లలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ మాన్య శ్రీ డా మన్మోహన్ వైద్య మీడియా కు తెలిపారు.

తేది 12/03/2015 నాడు జరిగిన సన్నాహక మీడియా సమావేశంలో సమావేశం వివరాలను వెల్లడించారు, దేశంలో అన్ని ప్రాంతాల నుండి మరియు సంఘ్ పరివార్ సంస్థల నుండి ప్రత్యేకంగా ఎంపిక చేయబడ్డ సుమారు 1400 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు, ఈ సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాల, జయ అపజయాల  మూల్యాంకనం, వివిధ సామాజిక నేపథ్యాలలో పనిచేస్తున్న అన్ని సంస్థల వార్షిక నివేదికలు, ఈ సంవత్సరం నిర్వహింప తలపెట్టిన కార్యక్రమాల యోజన తదితర అంశాల పై చర్చిస్తున్నట్లు తెలిపారు.

సంఘ్ అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో పాటు, జాతీయ కార్యవర్గం, సంఘ్ అనుబంద సంస్థల జాతీయ స్థాయి నాయకత్వం ఈ సమావేశాలు హాజరౌతారు, పూజ్య సర్ సంఘ చాలక్ మాన్య శ్రీ మోహన్ జి భాగవత్, సర్ కార్యవాహ మాన్య శ్రీ సురేష్ (భయ్యా) జి జ్యోషి మార్గదర్శనం చేయనున్నారని ఆయన తెలిపారు.     
   
నాగపూర్ : 13-15 మార్చ్ RSS అఖిల భారతీయ ప్రతినిధి సభ - 2015 సమావేశాలు Reviewed by JAGARANA on 7:35 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.