Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

జ్యోతిష శాస్త్రమా? విజ్ఞాన శాస్త్రమా?


శ్రీ రాణీ సదాశివమూర్తి గారు 1985-87లలో నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు మాకు సంస్కృత అధ్యాపకులు. సంస్కృత భాషకు సంబంధించి, వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు మొదలైన సంస్కృత వాజ్ఞ్మయంలో ఆయనకు గల జ్ఞానము అపరిమితమైనది. వృత్తి రీత్యా వారు ప్రస్తుతం తిరుపతిలో గల రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో అసోసియేట్ ప్రొఫెసర్. 

శ్రీ సదాశివమూర్తి గారు ఎం.ఏ. (సంస్కృతం), పిహెచ్.డి., ఎం.ఏ. (ఇంగ్లీష్), ఎం.ఏ. (ఫిలాసఫీ), వేదాంత విద్యాప్రవీణ, జ్యోతిష ఆచార్య, జర్మన్ భాషలో పి.జి. డిప్లమా  చదివేరు. 

మార్చి 7, 2015న మా మాష్టారు శ్రీ సదాశివమూర్తి గారు మా ఇంటికి భోజనానికి రావడం నా అదృష్టమే. ఆయన మా యింటికి వచ్చి ముప్పై ఏళ్ళు అవుతోంది. ఈ సందర్భంగా జ్యోతిష శాస్త్రంపై ఆయన చేస్తున్న ఒక ప్రకల్పం (ప్రాజెక్టు) గురించి కొన్ని విశేషాలు చెప్పేరు. 

ముందుగా భారతదేశంలో వివిధ ప్రాంతాలలో గత ఇరవై ఏళ్ళుగా వాడుకలో ఉన్న పంచాంగాలన్నీ తెప్పించేరు. వాటన్నింటిలోను ప్రతి యేటా సంభవించబోయే ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు, కురవబోయే వర్షాల గురించిన జాబితా తేదీలు, గంటలతో సహా ఒక జాబితా తయారు చేసేరు. 

తరువాత ఇండియన్ మీటియరాలజీ డిపార్టుమెంట్ (IMD) వారి నుండి గత ఇరవై ఏళ్ళుగా ప్రతి యేటా సంభవించబోయే ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు, కురవబోయే వర్షాల గురించి వారు రికార్డు చేసి పెట్టిన డేటాను లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేసేరు. 

పంచాంగాల నుండి సేకరించిన సమాచారము, IMD వారి డేటాతో కలిపి అధ్యయనం చేస్తే తేలిన విషయం ఏమిటంటే మహారాష్ట్రకి చెందిన పంచాంగాలలోని వివరాలు IMD వారి వివరాలతో 99.9% సరిపోతున్నాయిట. మిగిలిన పంచాంగాలలోని వివరాలు కూడా 85-90 శాతానికి పైనే IMD వారి వివరాలతో సరిపోతున్నాయిట. కొన్నిసార్లు IMD వారి అంచనాలు తప్పడం కూడా మనకు అనుభవమే! 

IMD వారు వాతావరణ అధ్యయనానికి అత్యాధునిక శాస్త్రపరిజ్ఞానాన్ని, సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తారు. ఎంత కాదన్నా వారు మూడు నెలల కంటే ముందుగా వాతావరణంలో రాపోయే మార్పులను అంచనా చేసిన సందర్భాలు లేవు. అక్టోబర్ 12, 2014 న విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాన్ గురించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చెప్పగలిగింది ఒక్క వారం రోజుల ముందుగా మాత్రమే. 

మనదేశంలో పంచాంగాలు ప్రతి ఏటా ఉగాదికి ఆరు నెలల ముందుగానే ముద్రణ పూర్తి చేసుకుని మార్కెట్ లో విడుదలౌతాయి. వాటిని కనీసం ఆరు నెలల ముందైనా ముద్రణకి ఇవ్వాలి. దానికి మరో ఆరు నెలల ముందుగానే పంచాంగం రూపొందించడానికి సంబంధించిన సమాచారం సిద్ధం చేసుకోవాలి. అంటే ప్రకృతిలో సంభవించే పరిణామాలను కనీసం ఏడాదిన్నర ముందుగానే ఎటువంటి ఆధునిక సాంకేతిక పరికరాలనూ ఉపయోగించకుండానే మన పంచాంగకర్తలు సరిగ్గా లెక్కలు వేయగలుగుతున్నారు. 

ఇదెలా సాధ్యం? 


శ్రీ రాణీ సదాశివమూర్తి గారి బృందం చేసిన అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే ప్రకృతిలోను, వాతావరణంలోను సంభవించే మార్పులను అంచనా వెయ్యడానికి మన జ్యోతిషశాస్త్రంలో 24 ప్రాధమిక సూత్రాలు ఉన్నాయిట. గ్రహాల స్థితిగతులు, వాటి కదలికలు, భూ ఉపరితల వాతావరణంలో వచ్చే మార్పులు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుని ఎలా లెక్కలుగట్టాలో ఈ సూత్రాలు వివరిస్తాయి. 

ఇప్పుడు శ్రీ రాణీ సదాశివమూర్తి గారి బృందం ఈ 24 జ్యోతిషశాస్త్ర సూత్రాలను ఉపయోగించి వాతావరణంలోని మార్పులను అంచనా వేయడానికి ఒక కంప్యూటర్ సాఫ్ట్ వేర్ రూపొందించే ప్రాజెక్ట్ మొదలుపెట్టబోతున్నారు. 

ఇదంతా వింటూంటే నాకు మతి పోయినట్లనిపించింది.

అంతేకాదు, "జ్యోతిష్యం మూఢనమ్మకం" అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రకటనలిచ్చే టి.వి. ఛానెళ్ళ వారినీ, ఈ శాస్త్రాన్ని అవహేళనచేసే మేధావి వర్గాన్నీ బురదగుంటలో పాతిపెట్టాలన్నంత కోపమూ వచ్చింది. 



జ్యోతిష శాస్త్రమా? విజ్ఞాన శాస్త్రమా? Reviewed by rajakishor on 7:41 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.