RSS ABPS ప్రెస్ మీట్ : దేశవ్యాప్తంగా 51330 శాఖల ద్వారా RSS పని చేస్తుంది : హోసబలే
రేశంబాగ్, నాగపూర్ , 13/03/2015 : 'జాతీయ వాదులైన వ్యక్తీ నిర్మాణం మాధ్యమంగా సుధృడ, సుసంఘటన యుత, సామజిక ఘర్షణలు లేని సమాజ నిర్మాణం కోసం తద్వారా భారత మాత పునర్వైభవ ప్రాప్తి కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పని చేస్తున్నదని సంఘ్ సహా సర్ కార్యవాహ మాన్య శ్రీ దత్తాత్రేయ హోసబలె గారు మీడియా తో అన్నారు.
సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ 2015 పారంభోత్సవం తర్వాత దత్తాత్రేయ హోసబలే మీడియా తో సంఘ కార్య విస్తృతి, గత సంవత్సర కాలంలో సాధించిన ప్రగతి, సంఘ్ చేస్తున్న ఇతర కార్యక్రమాలు, తాత్కాలిన జాతీయ అంశాలు తదితరాదుల పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
దేశంలోని 33222 స్థలాలో 51330 నిత్య శాఖలతో పాటుగా 12847 సప్తాయిక్ మిలన్ లు , 9008 సంఘ్ మండలిల మాధ్యమంగా 55010 ప్రాంతాలలో సంఘ్ పని జరుగుతున్నది - హోసబలె
సంఘ్ నుండి సమాజ ఆపెక్షిత విస్తృతంగా పెరిగింది, దేశ సమగ్రాభివృద్ది , దేశ సమగ్రత లాంటి అంశాల పట్ల సంఘ్ దృక్కోణం సమాజంలో సకారాత్మక మార్పు దృగ్వీశయమే, సకారాత్మక ఆలోచన ఉన్న మంచి వ్యక్తులు సంఘ్ తో కలసి పనిచేయడానికి ఎక్కువగా ముందుకు రావడం ఈ పరిణామంలో భాగంగానే జరుగుతున్నది, సంఘ్ అధికారిక వెబ్ సైట్ లో మేము పెట్టిన "Join RSS" కి ప్రతి రోజు వేల సంఖ్యలలో అభ్యర్థనలు రావడమే ఇందుకు నిదర్శనం.
ఈ సమావేశాలలో వచ్చే మూడేళ్ళలో దృడమైన సంఘటనగా సంఘ్ ఎదగడానికి ప్రణాళికలు రచిస్తున్నాం, దానితో పాటే మాత్రుభాషలోనే విద్యా బోదన జరగాలనే అంశం పై కార్యాచరణ రూపకల్పన చేస్తున్నాం, అందరికి సమానమైన సామాజిక న్యాయం కోసం సమ సమాజ నిర్మాణ ఆవశ్యత పై చర్చ జరగనుంది.
2015-16 వ సంవత్సరం అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశం సంఘ్ తృతీయ సర్ సంఘ్ చాలక్ పూజ్య శ్రీ బాలా సాహెబ్ దేవరస్ గారి శత జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సందర్భంలో సంఘ్ సర్వ వ్యాపి సర్వ స్పర్శి లా దేశం లోని గరిష్ట ప్రాంతాలకు చేరడమే ఆయనకు మనం అందించే అసలైన నివాళి అవుతుంది.
ఈ మీడియా సమావేశంలో ఆయన తో పాటుగా అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ మాన్య శ్రీ డా మన్మోహన్ వైద్య కూడా పాల్గొన్నారు.
RSS ABPS ప్రెస్ మీట్ : దేశవ్యాప్తంగా 51330 శాఖల ద్వారా RSS పని చేస్తుంది : హోసబలే
Reviewed by JAGARANA
on
8:28 PM
Rating:
No comments: