గోభక్షణకూ, గోరక్షణకూ మధ్య...
హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 9951038352
ఆంధ్రభూమి దినపత్రిక, మార్చి 19, 2015
జాతుల నిర్మూలన అంతర్జాతీయ చరిత్రలో భాగం! విదేశీయుల భౌతిక దురాక్రమణ
ఫలితంగా అనేక దేశాలలో స్వజాతులు నాశనమై నామరూపాలు లేకుండా పోవడం చరిత్ర!
బౌద్ధిక దురాక్రమణవల్ల కూడ వివిధ దేశాలలోని స్వజాతులు అంతరించిపోయాయి!
భౌతిక దురాక్రమణ స్వజాతుల స్వరూపాన్ని వికృతపరచి క్రమంగా దిగమింగింది!
బౌద్ధిక దురాక్రమణ స్వజాతుల స్వభావాన్ని చెరచి స్వజాతులు క్రమంగా తమ
అస్తిత్వాన్ని మరచి విజాతులుగా మారడానికి దోహదం చేసింది! కొన్ని దేశాలలో
బౌద్ధిక భౌతిక దురాక్రమణ రెండూ స్వజాతులపై దాడి చేయడం చరిత్ర! ఇలాంటి
‘ద్విముఖ’ దురాక్రమణకు అతి ప్రధానంగా గురి అయిన దేశం మన దేశం... మన జాతి
అంతరించక పోవడానికి కారణం సహస్రాబ్దులపాటు దురాక్రమణను ఢీకొనగలిగిన వౌలిక
సమరశీలత మన జాతీయతలో నిహితమై ఉండడం.... విజాతీయ దురాక్రమణను
ప్రతిఘటించడానికై మన జాతి జరిపిన సతత సంఘర్షణ వర్తమానానికి వారసత్వం!! కానీ
విదేశీయ సంప్రదాయాలు, విశ్వాసాలు, విజ్ఞానరీతులు, జీవన పద్ధతులు భారతీయతను
ఆవహించి ఉండడం నడుస్తున్న వైపరీత్యం! బ్రిటిష్ దురాక్రమణనుండి విముక్తమైన
తరువాత ఇంతవరకు మన ప్రభుత్వం గోవధ సంపూర్ణ నిషేధంకోసం జాతీయ స్థాయిలో
చట్టంచేయకపోవడానికి ఈ వైపరీత్యం కారణం... ఈ వైపరీత్యం వల్ల సంభవించిన
సంభవిస్తున్న వైపరీత్యాలు ఇంకా చాలా ఉన్నాయి!!
‘రెడ్‌క్రాస్’ ‘బ్లూక్రాస్’, ‘గ్రీన్‌క్రాస్’వంటి పదజాలం విదేశాలనుంచి
వ్యాపించింది. ఈ పదజాలం ఉదాత్తమైనది! కానీ ఇంతకంటె ఉదాత్తమైన ‘మానవీయత’
‘్భత దయ’ ‘్భమాత’ వంటి పదజాలం అనాదిగా ఈ దేశంలో ఉంది! విదేశీయ ప్రభావం
ఆవహించి ఉన్నందువల్ల భారతీయమైన పదజాలానికి గుర్తింపులేదు!! ఆవును
రక్షించడానికై భారతదేశంలోని దిలీపుడు లక్షల ఏళ్లక్రితం చేసిన త్యాగానికి
ప్రచారం లేదు!! పాశ్చాత్య దేశాలనుండి వ్యాపించిన జంతు సంరక్షణ ఉద్యమం
గురించి గొప్ప ప్రచారమైంది!! జీవహింస చేయకపోవడం గురించి పాశ్చాత్యులనుండి
మన నేర్చుకున్నామన్న అనుభూతికి మనంలోనై ఉన్నాము! వన్యమృగ సంరక్షణ గురించి
జీవకారుణ్యం గురించి పాశ్చాత్యుల వందల ఏళ్ల చరిత్రలోని ‘టూమ్, డిక్,
హారీ’లు ‘లేమ్, డక్, పూరీ’లు చెప్పిన ‘ఇంగ్లీషు’ వాక్యాలను యథాతథంగా
ఉటంకిస్తూ భారతీయ భాషలలో వ్యాసాలు గ్రంథాలు వ్రాస్తున్న వారికి మేధావులన్న
‘కీర్తి’ఏర్పడి ఉంది! ఆ ఇంగ్లీషు వాక్యాలు సామాన్య పాఠకులకు బోధపడకపోయినా
ఫర్వాలేదు! కానీ జీవకారుణ్యం, భూత దయ గురించి, లక్షలాది ఏళ్ల భారతీయ
చరిత్రలోని మహాపురుషులు చెప్పిన వాక్యాలను ఉటంకిస్తూ వ్యాసాలను గ్రంథాలను
వ్రాసేవారిని మూఢ విశ్వాస దూషితులుగా ‘ముద్ర’వేయడం నడుస్తున్న వైపరీత్యం!
మన విశ్వాసాలకు మనమే విరోధులం కావడం, మన విజ్ఞతను మనమే శంకించడం ఈ
వైపరీత్యంలో భాగం!! బ్రిటిష్‌వారి, ఐరోపావారి జీవకారుణ్యంలో భూతదయలో
‘ఆవు’కు ‘గోసంతతి’కి భాగం లేదు! అందువల్ల వారినుండి జీవకారుణ్య పాఠాలు
నేర్చుకున్న ప్రభుత్వ నిర్వాహకులు ఏడు దశాబ్దులుగా గోవధ నిషేధంకోసం అఖిల
భారత స్థాయిలో ‘చట్టం’రూపొందించలేదు!! బ్రిటిష్‌వారు మన అడవులను
నిర్మూలించారు, ఆ తరువాత వన్యప్రాణులను రక్షించే ప్రక్రియను నేర్పిపోయారు. ఈ
దేశంలో వేలాది ఏళ్లుగా ప్రజలు అడవులను పూజించారు. ప్రేమించారు.
నిర్మూలించలేదు... అందువల్ల వన్యప్రాణులకు సహజంగా సంరక్షణ వలయాలు ఏర్పడి
ఉండేవి!! ఈ సహజత్వాన్ని బ్రిటిష్‌వారు ధ్వంసం చేశారు!! మొదటి, రెండవ ప్రపంచ
యుద్ధాల సమయంలో బ్రిటిష్‌వారు మన అడవుల నిర్మూలన కార్యక్రమాన్ని మరింత
ఉద్ధృతం చేయడం చరిత్ర...
ఆవును పూజించడం ప్రేమించడం పెంచడం పరిరక్షించడం అనాదిగా ఈ దేశ ప్రజల
సంప్రదాయం! మరో దేశంలో మరో జాతీయ సంప్రదాయం ఉండవచ్చుగాక! దేశపు సంప్రదాయం
గొప్పది, ఏది తక్కువని అన్నది సందర్భాంశం కాదు. ఏ జాతి సంప్రదాయాలు ఆ దేశపు
జాతీయులకు గొప్పవి! అమెరికాలో కంచర గాడిదకు గొప్ప గౌరవం ఉంది. అది ఆ దేశపు
సంప్రదాయం! అమెరికాలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకదానికి ఈ
కంచరగాడిద సంస్థాగత చిహ్నం! జాతీయ సంప్రదాయాలు ఆవులకూ, గాడిదలకూ
సంబంధించినవి మాత్రమేకాదు. ఇంకా చాలా అంశాలకు సంబంధించినవి! ఈ జాతీయ
సంప్రదాయాలను పరిరక్షించడం ప్రభుత్వాల కర్తవ్యం! ప్రజాస్వామ్యానికి
ప్రాణమైన ‘జనాదేశం’ సిద్ధాంతం- డాక్టరిన్ ఆఫ్ మాండేట్- ఇదే! ఈ దేశంలో ఆవు
ఆర్థిక ప్రగతికి, ఆధ్యాత్మిక, ధార్మిక సుగతికి అనాదిగా ప్రాతిపదిక! ఆవు,
భూమి ప్రధానమైన సహజమైన సంపదలన్నది’ భారతీయ జీవన వాస్తవం! దాదాపు ఐదువేల
రెండువందల ఏళ్లక్రితం దేశమంతటా వ్యాపించి ఉండిన ‘తొఱ్ఱుపట్టు’లను గురించి
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన ‘‘్భగవంతుని మీద పగ’’అన్న చారిత్రక
నవలలో వివరించారు. ‘తొఱ్ఱుపట్టు’ ఆవులు యథేచ్ఛగా విహరించే సతత హరిత వాటిక!
ఇది ఈ జాతీయ సంప్రదాయానికి అద్దం.
‘‘అది రాజుగారికున్న ‘తొఱ్ఱుపట్టు’లలోనొకటి. అచట కొన్ని వేల పశువులు కలవు.
ఎఱ్ఱావులు, తెల్లావులు, దోరావులు, దేహమంతయు నల్లగానుండి మొగము తెల్లగాయున్న
ఆవులు, మొగాన మచ్చలుగల ఆవులు, పొట్టిఆవులు, భారీ ఆవులు, పలు విధములైన
గోవుల సమూహములు తొఱ్ఱుపట్టున కలవు... ఆవులను పెంచుకొనువారు, ఆవుపాలను
త్రాగెడివారు, ఆవులమీది గాలి నిచ్చలు తనమీద ప్రసరింపించుకొనువాడు
మనశ్చాంచల్యము కలవాడై ఉండడు. గోవులయందది ఒక లక్షణమైయున్నది. వాడు ఆవులను
ముద్దుపెట్టుకొనును. ‘అమ్మా’అని పిలుచును. భారతదేశములో ఆవునకు, మనుష్యునకు
భేదము నెంచుకొనరు. ఆ దూడలు కూడ తమ ఇంటిలోని పిల్లలనియే అనుకొందురు. వాని
గంగడోళ్లు దువ్వుదురు, వానిని ముద్దుపెట్టుకొందురు, మెడలు
కౌగిలించికొందురు....’’- ఇదీ భారత జాతీయ సంప్రదాయం. ఇందుకు విరుద్ధంగా
బ్రిటిష్‌వారు చూడి పశువులను నరికిపారేశారు. అది వారి సంప్రదాయం! ‘‘చూడి
ఆవుల కడుపు వేడివేడి మాంసం వాడికి బహు ఇష్టమంట...’’అంటూ గరిమెళ్ల
సత్యనారాయణ బ్రిటిష్ గోహనన బీభత్సకాండకు వ్యతిరేకంగా గళమెత్తడానికి ఈ
సంప్రదాయ వైరుధ్యం ప్రాతిపదిక! ఈ దేశంలో గోరక్షణ స్వజాతీయ సాంస్కృతిక
స్వాతంత్య్ర చిహ్నం... గోవధ జాతీయ పరాజయానికి ప్రతీక!! విదేశీయులు
‘జయించడం’వల్ల ఈ దేశంలో గోహత్య మొదలైంది!! ‘స్వరాజ్యం’లో గోసంరక్షణ
భాగమన్నది స్వాతంత్య్ర సమరయోధుల నిర్ధారణ!!
వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన ‘ప్రజల మనిషి’ నవలలోని పదేళ్ల బాలుడైన
కొమరయ్య ఈ భారతీయ సంప్రదాయానికి మరో ప్రతీక!- ‘‘కొమరయ్య కొట్టంలోకి పొయ్యా
డు. ఆవుముఖాన్ని దిద్దాడు, గంగడోలును దువ్వాడు, వెన్నుమీద నుండి
రెండువైపులనుండి రెండు చేతులువేసి కౌగిలించుకున్నాడు. ఆవు ఆప్యాయంగా
కొమరయ్య వైపు తల తిప్పి నాకాలని నాలుక నాడించింది. కొమరయ్య ఆవువెన్నుపై తల
వాల్చాడు... కొమరయ్య దూడ పలుపువిప్పాడు. దూడ కుప్పిగంతులు వేస్తూ తల్లిని
చేరి పాలు చీకసాగింది.’’ ఆవులకూ మానవులకూ మధ్య ఉన్న ఈ మమకారం ప్రతి ఇంటిలో
ప్రతి దొడ్డిలో ప్రస్ఫుటించడం భారతీయమైన జీవనంలో భాగం... విజాతీయుల గోహనన
పద్ధతులు ఈ సంప్రదాయాన్ని గ్రసించడం విదేశీయుల దురాక్రమణ ఫలితం! విజాతీయులు
గెలిచినప్పుడల్లా అనేక పైశాచిక కృత్యాలను నిర్వహించారు. వాటిలో ఆవులను
చంపడం ఒకటి! క్రీస్తుశకం పదునాలుగవ శతాబ్దిలో కాకతీయుల రాజధాని ఓరుగల్లును
తురుష్కులు ధ్వంసంచేసిన తరువాత ‘జిహాదీ’ తెలంగాణలోని పల్లెలలోకి
పట్టణాలలోకి చొరబడి వేలాది ఆవులను కత్తులతో కుమ్మారు. బతికున్న ఆవుల
చర్మాలను నడి వీధులలో ఒలచి చిత్రవధ చేశారు! గంగిరెద్దుల వారి సీతమ్మ-ఆవులు,
పెయ్యలు-లను సైతం అపహరించి హత్యచేశారు! ముసునూరి - ప్రోలయ, కాపయ- నాయకుల
ఆధ్వర్యంలో సామాన్య ప్రజలు ఆవుల వధను ఆపడానికి సంఘర్షణ జరపడం చారిత్రక
వాస్తవం! గోవధ విదేశీయుల దుష్ట సంప్రదాయం... విదేశీయుల పెత్తనం సాగిన
సమయంలో కొనసాగిన ఈ రాక్షసకాండ స్వతంత్ర దేశంలో ఎందుకు కొనసాగాలి??
కొనసాగరాదన్నది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
అంతరంగం! ఆవులను దూడలను పాడిపశువులను వధించడాన్ని ప్రభుత్వాలు
నిరోధించాలన్న నలబయి ఎనిమిదవ అధికరణంలోని మార్గదర్శక సూత్రం ఈ అంతరంగానికి
అద్దం.....
జాతీయ స్వభావం సాహిత్యంలో నిహితంకావడం చరిత్ర... గోరక్షణ గొప్పదని భారతీయ
సాహిత్యం చాటిస్తోంది, గోభక్షణను విదేశీయ రచయితలు ఉదాత్తీకరించారు.
క్రీస్తునకు పూర్వం ఎనిమిదవ శతాబ్దినాటి గ్రీకు మహారచయిత, కవి. ‘ఇలియడ్’
‘ఒడీసీ’అన్న మహాకావ్యాలను ఆయన వ్రాసినట్టు పాశ్చాత్యుల విశ్వాసం. కానీ ఆయన
వర్ణించిన ‘గోవధ’ జుగుప్సాకరంగా ఉందని విశ్వనాథ తమ ‘హెలీనా’ నవలలో
పేర్కొన్నారు. ఈ ‘నవల’లోని సెల్యూకస్‌కు సమకాలీనుడైన ఒక భారతీయుని భావాలను
‘కవిసమ్రాట్’ ఇలా ఆవిష్కరించి ఉన్నాడు. ‘ఇలియడు చదువునప్పుడు దానిలోని
కొన్ని భాగములు అసహ్యము వేసినవి... ఎచ్చట చూసినను పెయ్యలను చంపుట, ఎద్దులను
చంపుట, వాని పిక్కలను కోయుట, ఆ కండలను కాల్చుట, వానికి పైన గోధుమ గంజి
వార్చుట కల్లుపోయుట, మాడ్చుట, తినుట... ఆ హోమరు పౌనఃపున్యము- మళ్లీమళ్లీ-
దీనినే వర్ణించును...’’
ఇదంతా గ్రీకులకు గొప్పకావచ్చు! భారతీయులకు మాత్రం తప్పు! అందువల్లనే
విదేశీయ మతోన్మాద దురాక్రమణను క్రీస్తుశకం పదిహేడవ శతాబ్దిలో తిప్పికొట్టిన
ఛత్రపతి శివాజీ తన లక్ష్యాన్ని గురించి తన తండ్రికి వివరించాడు-
‘‘జనకా! నా మతమున్ వచించెద,
- హరిశ్చంద్రా రాజన్యులే
లిన ఈ భారతభూమి గో హనన
మాలిన్యంబులన్ బూసి ‘ప్రా
క్తన’ జాతీయత నందగింపవలె...’’
మహాకవి గడియారం వేంకట శేషశాస్ర్తీ చెప్పిన కథనం ఇది. విదేశీయుల దురాక్రమణకు
పూర్వం ఉండి, శివాజీ కాలంనాడు నశించిపోతుండిన జాతీయత ‘ప్రాక్తన’- పూర్వపు
జాతీయత!! దానిని పునరుద్ధరించడం స్వాతంత్య్ర చిహ్నం.... ఇంతే!
ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం గోవధను మాత్రమే కాదు, గోమాంస భక్షణను సైతం
నిషేధించడం ఈ జాతీయ ‘పరంపర’ పునరుద్ధరణకు దోహదంచేస్తున్న పరిణామం...
హర్యానా, రాజస్థాన్‌లు కూడ సంపూర్ణ గోవధ నిషేధానికై చట్టాలను చేస్తున్నాయట!
ఉభయ తెలుగు రాష్ట్రాలలోను, అత్యధిక ఇతర ప్రాంతాలలోను, ‘గోవధ నిషేధం’
చట్టాలు ఉన్నప్పటికీ ‘అవినీతి’ప్రభుత్వ యంత్రాంగం వాటిని అమలుజరుపడం లేదు!!
దేశంమొత్తానికి వర్తించే విధంగా సంపూర్ణ గోవధ నిషేధ శాసనాన్ని
రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించాలి...!
గోభక్షణకూ, గోరక్షణకూ మధ్య...
Reviewed by rajakishor
on
12:04 PM
Rating:
జాతి, మతము నిర్మూలన అనేది చర్చి మరియు ఇస్లాం మతముల యొక్క ఉద్దేశం , అవి ఉన్నంత వరకు ఈ ప్రపంచములో శాంతి అనేది ఉండదు.
ReplyDelete