వీళ్ళను ఏమనాలి?
ఎంతో నెమ్మదస్తునిగా, ఆత్మీయతానురాగాలు కలవానిగా మహాభారతంలో ధర్మరాజు మనకు కనిపిస్తాడు. అంతేకాదు, తన శత్రువుని కూడా ఎంతో గౌరవంగా సంబోధించే వాడాయన. ఇందుకు ఉదాహరణ దుర్యోధనుని పట్ల ఆయన ప్రహర్శించిన సంయమనం. దుర్యోధనుని ధర్మరాజు ఎప్పుడూ "సుయోధనా!" అని పిలిచేవాడు.
దుర్యోధనుడు దుష్టబుద్ధి కలవాడు. ధర్మరాజు పట్ల అతను ఎంత ద్వేషాన్ని వెళ్ళగక్కాడో మనకి తెలుసు. ధర్మరాజు మాత్రం దుర్యోధనుని పట్ల ఎంత కోపం ఉన్నా దానిని మనసులోనే ఉంచుకుని అతనిని స్నేహపూర్వకంగానే పిలిచేవాడు.
ధర్మరాజులో గల ఇటువంటి విశాల భావన మన చట్టసభల సభ్యులలో రవ్వంతైనా లేదెందుకు? ప్రజలు వారిని చట్టసభలకు పంపించింది ఒకరినొకరు నీచాతినీచంగా తిట్టుకోడానికా? మనదేశం ఎన్నో సమస్యలతో సతమతమౌతోంది. వాటి విషయం పట్టించుకోవడం మానేసి ఒకరినొకరు తిట్టుకునే, కొట్టుకునే స్థాయికి దిగజారిన మన చట్టసభల సభ్యులను ఏమనాలి?
ఇటీవలే (మార్చి 2015) తెలంగాణా రాష్ట్ర శాసనసభ సమావేశాల ప్రారంభంలో శాసన సభ్యులు ఒకరితోనొకరు బాహాబాహీ యుద్ధం చేసుకున్నారు
మరో సందర్భంలో తెలంగాణా శాసనసభలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సభ్యులు జాతీయగీతాన్ని అవమానించేరుట. శాసనసభలో క్షమాపణ చెప్పమంటే వారు అందుకు నిరాకరించేరుట.
కేరళ అసెంబ్లీ సమావేశాలలో శాసన సభ్యులు కొట్టుకున్నారు. ఈ సందర్భంగా ఒక మహిళా సభ్యురాలు మరొకరి చెయ్యిపై గట్టిగా కొరికిందిట.
గతంలో తమిళనాడు అసెంబ్లీలో జరిగిన కొట్లాటలో ఒక సభ్యుడు మరో మహిళా సభ్యురాలి కొంగు పట్టుకుని లాగి అవమానించేడట.
తాజాగా పార్లమెంటులో జనతాదళ్ (యునైటెడ్) పార్టీ సభ్యుడు శరద్ యాదవ్ దక్షిణ భారత మహిళల దేహవర్ణాన్ని గురించి చులకన చేస్తూ మాట్లాడరు. అదేమని అడిగిన కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీని "నీ సంగతి నాకు తెలుసు" అంటూ అవమానించారు ఆ పెద్దాయన.
గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఒకరినొకరు నువ్వంటే నువ్వని దూషించుకుంటూ వాగ్యుద్ధం చేసుకోవడం మనం మరచిపోలేదు.
గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఒకరినొకరు నువ్వంటే నువ్వని దూషించుకుంటూ వాగ్యుద్ధం చేసుకోవడం మనం మరచిపోలేదు.
ఇక చట్ట సభలలో మైకులు, కుర్చీలు విరగ్గొట్టడం, ఒకరిపై నొకరు విసురుకోవడం, కాగితాలను చింపి విసురుకోవడం వంటి సంఘటనలకు లెక్కలేదు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభల స్థానం సమున్నతమైనది. ఆ సభలలో సభుల వ్యవహారం గౌరవప్రదంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అది ఆ సభ్యుల కనీస బాధ్యత కూడా. కానీ ఇవన్నీ మరచిపోయి ఏమాత్రం బాధ్యత లేకుండా తమ స్థాయిని దిగాజార్చుకుంటూ మన శాసన సభ, పార్లమెంటు సభ్యులు కడు హీనంగా ప్రవర్తిస్తున్నారు.
వీళ్ళను ఏమనాలి?
వీళ్ళను ఏమనాలి?
Reviewed by rajakishor
on
9:10 AM
Rating:
No comments: