వలస వస్తున్న హిందువుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే - భయ్యాజి జ్యోషి స్పష్టీకరణ
రేశంబాగ్ , నాగపూర్, 16/03/2015 : విదేశాల నుండి వలస వస్తున్న హిందువుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ మాన్య శ్రీ సురేష్ (భయ్యా)జి జ్యోషి గట్టిగా కోరారు.
భారత దేశం బయట నుండి వలస వస్తున్న హిందువులను అన్ని విధాలుగా రక్షించి తగిన సౌకర్యాలు కల్పిచాల్సిన బాధ్యత భారత దేశ ప్రభుత్వానిదే - భయ్యాజి జ్యోషి
అఖిల భారతీయ ప్రతినిది సభ - 2015 ముగింపు రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ మాన్య శ్రీ సురేష్ భయ్యాజి జ్యోషి ప్రెస్ మీట్ లో మీడియాను ఉద్ద్యేశించి మాట్లాడారు, ఈ సందర్భంలో మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సంఘ్ దృక్కోణాన్ని స్పష్టం చేస్తూ సమాదానాలిచ్చారు.
"ప్రపంచంలో హిందువులు తమదిగా చెప్పుకునే దేశం భారత్ ఒక్కటే, ప్రపంచం నుండి భారత దేశానికి వలస వచ్చే హిందువులను సంరక్షించి వారికి తగిన మౌలిక ఆవసరాల కల్పన భారత్ దేశ ప్రభుత్వ కనీస బాధ్యత " అని అన్నారు.
అయోధ్య శ్రీ రామ జన్మ భూమి మందిర అశంలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాదానంగా 'అయోధ్య శ్రీ రామ జన్మ భూమి లో సాధ్యమైనంత త్వరగా భవ్య మందిర నిర్మాణం జరగాలని సంఘ్ భావిస్తున్నది, ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది, కోర్టు తన తుది తీర్పు ఇంకా ఇవ్వాల్సి ఉంది, మేము ఖచ్చితంగా కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాం' అని అన్నారు.
మరో ప్రశ్నకు సమాదానంగా ' ఆరాధన విధానాలు ఎన్ని ఉన్నా, ప్రతి ఒక్కరు భారతీయత అనే భందంలోనే అల్లుకుని ఉన్నారు, ప్రపంచంలో మన దేశ సంసృతికి సమామైన విశాల శాస్త్రీయ దృక్పదం ఉన్న మరో సంసృతి లేదు, కాబట్టి వీటన్నిటికి మూలమైన హిందుత్వాన్ని మేము ఈ దేశ జాతీయ జీవన విదానంగానే భావిస్తాము' అని అన్నారు.
వలస వస్తున్న హిందువుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే - భయ్యాజి జ్యోషి స్పష్టీకరణ
Reviewed by JAGARANA
on
11:09 AM
Rating:
No comments: