Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

హిందూ విజ్ఞాన సర్వస్వం




దీపావళి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 27, 2014న వెస్ట్ మినిస్టర్ లో క్వీన్ ఎలిజబెత్-2 కాన్ఫరెన్స్ సెంటర్ లో ఏర్పాటుచేసిన సభలో బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ హిందూ ఎన్సైక్లోపీడియాను ఆవిష్కరించేరు. ఈ ఎన్సైక్లోపీడియా ఆవిష్కరణ సభను కామెరాన్, అతని సతీమణి సమంతా జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించేరు. కామెరూన్ భార్య హిందూ సంప్రదాయ వస్త్రధారణ అయిన చీర ధరించి హాజరు కావడం ఒక ప్రత్యేకత. "ఈ ఎన్సైక్లోపీడియా మానవాళికి గొప్ప బహుమానం. ఇందులో హిందూ సంస్కృతికి సంబంధించి ఏడు వేలకు పైగా విషయాల సమాచారం ఉంది.  'అన్ని సద్భావనాలు అన్నివైపుల నుండి వచ్చి మమ్ము చేరుగాక' అన్న వాక్యం నాకు ఎంతో నచ్చింది. దీనిని నేనూ ఆచరణలో పెడతాను" అని కామెరూన్ అన్నారు. 

బ్రిటిష్ పార్లమెంటు వెస్ట్ మినిస్టర్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానిలో వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. అధికార కన్సర్వేటివ్ పార్టీ, కన్సర్వేటివ్ పార్టీ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాలు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించేయి. ఇంగ్లాండ్, వేల్స్ లలో ఏడు లక్షల మంది భారతీయ సంతతికి చెందినవారు నివసిస్తున్నారు. వారితో సత్సంబంధాలు నెలకొల్పుకోడానికి ఇటువంటు కార్యక్రమాలు తోడ్పడతాయని ఆ పార్టీ వారు భావిస్తున్నారు కూడా.

"ఇరవై ఐదు సంవత్సరాల పాటు సాగిన వెయ్యి మంది పరిశోధకుల నిరంతర శ్రమ ఫలితమే ఈ ఎన్సైక్లోపీడియా" అని కన్సర్వేటివ్ పార్టీ చైర్మన్ ఆండ్రూ ఫెల్డ్ మాన్ అన్నారు.

హిందూ ధర్మం గురించి సమగ్రమైన వేల సంవత్సరాల సమాచారం ఈ గ్రంధంలో లభ్యమౌతుంది. కళలు, సంగీతము, నాట్యము, నాటకము, నిర్మాణ రంగము, తత్త్వము, రాజనీతి, వివిధ మత సంప్రదాయాలు  - ఇలా హిందూ సంస్కృతిలో అంతర్భాగమైన విషయాల గురించి వివిధ వర్గాలుగా వివరంగా ఈ గ్రంధంలో పేర్కొన్నారు.

హిందూ ఎన్సైక్లోపీడియా రూపొందించడంలో మేనేజింగ్ ఎడిటర్ గా వ్యవహరించిన సాధ్వి భగవతీ సరస్వతి "హిందుత్వం అనేది కేవలం ఒక సిద్ధాంత ప్రవచనం కాదు, జీవితంలోని అన్ని రంగాలకు సంబంధించిన విలువలను హిందూ సంస్కృతి బోధిస్తుంది. వాటి గురించి అందరూ తెలుసుకోడానికే  ఉద్గ్రంధాన్ని రూపొందించాం" అని అన్నారు. 

పదకొండు సంపుటాలుగా వెలువడిన ఈ హిందూ విజ్ఞాన సర్వస్వాన్ని రూపొందించడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఇండియా హెరిటేజ్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు దీనిని ప్రచురించేరు. ఉత్తర భారతదేశంలోని ఋషికేశ్ ఆశ్రమానికి అధిపతి అయిన పూజ్య స్వామీ చిదానంద సరస్వతి ఈ సంస్థ వ్యవస్థాపకులు. "హిందూ సంస్కృతి అన్ని రకాల ఆలోచనలనూ స్వాగతిస్తుంది. అందరినీ తనలో కలుపుకుంటుంది. ఎవరినీ ఉపేక్షించదు. 'వసుధైవ కుటుంబకం'  అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న భావన హిండుత్వంలోని ప్రత్యేకత. 'సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః' అన్నదే హిందువుల ఆకాంక్ష. కేవలం మానవాళి క్షేమమే కాక పశు పక్ష్యాదులు, వృక్షాలు, ప్రకృతి మొత్తం సంక్షేమాన్ని హిందువులు కోరుకుంటారు. భగవంతుని మాత్రమే గాక అతని  సమస్తాన్నీ సేవించాలని హిందూ సంస్కృతి బోధిస్తుంది. ఈ ఉద్దేశ్యంతోనే ఈ ఎన్సైక్లోపీడియాను రూపొందించాం" అని చిదానంద సరస్వతి అన్నారు. 

హిందూ విజ్ఞాన సర్వస్వం Reviewed by rajakishor on 12:31 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.