Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

భారతీయ విద్యా వైభవం


 ఆంగ్లేయుల దాస్యం నుంచి మన దేశం 1947 ఆగస్టు 15న స్వతంత్రం అయ్యింది. కాని ఆంగ్లేయుల దాస్య శృంఖలాలలో మనం ఈనాటికీ చిక్కుకొని ఉన్నాం. ఆంగ్లేయులు భారతీయ విద్యావిధానానికి మహోపకారం చేసారని భావిస్తున్నాం. కాని  వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. ఆంగ్లేయులు మన విద్యావిధానానికి ఉపకారం చెయ్యకపోగా భారతదేశంలో గల సుసంపన్నమైన విద్యావిధానాన్ని నాశనం చేసారు. 

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉత్తమ చరిత్రవేత్త అయిన ఆచార్య ధర్మపాల్ 'నాకేదైనా మంచి పని చెప్పండి' అని గాంధీజీని అడిగారు. అప్పుడు గాంధీజీ ఇలా అన్నారు: "1931 రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాను. అప్పుడు ఆంగ్లేయాదికారులు నాతో ఇలా అన్నారు - 'ఆంగ్లేయులు భారతదేశానికి వెళ్ళి ఉండకపోతే ఆ దేశంలో ఉత్తమ విద్యావిధానం ఎప్పటికీ ఏర్పడి ఉండేది కాదు.' ఈ మాట నాకు ఏమాత్రం నచ్చలేదు. కానీ నా ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చెప్పడానికి తగిన ప్రమాణం ఏదీ నా దగ్గర అప్పుడు లేదు. కాబట్టి నీవు భారతదేశంలో ప్రాచీన విద్యావిధానానికి సంబంధించి ప్రమాణాలు, ఆధారాలు ఎంతవరకు దొరికితే వాటిని అంతగా సమకూర్చుకో. వాటి ఆధారంగా ఆంగ్లేయులు మనదేశానికి రాకముందు భారతదేశంలో విద్యావిధానం ఎలా ఉందో ప్రపంచానికి చాటి చెప్పు. ఇది చేయగలవని నీమీద నాకు విశ్వాసం ఉంది."

గాంధీజీ చెప్పినట్లు ఆచార్య ధర్మపాల్ లండన్, ఫ్రాన్స్, జర్మనీ మొదలైన దేశాలకు వెళ్ళి 40 సంవత్సరాలు విశేష అధ్యయనం చేసేరు. అనేక ప్రమాణాలు సమకూర్చుకున్నారు. వాటిని లోతుగా పరిశీలిస్తే ఆంగ్లేయులు రాకముందు భారతదేశంలో విద్యావిధానం మహోన్నతంగా ఉందని తెలుస్తుంది. 

భారతీయ విద్యావిధానం గురించి ఎంతో సమాచారం సేకరించిన మైకేల్ 1835 ఫిబ్రవరి 2న బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగించాడు. ఆ ప్రసంగంలోని వివరాలన్నీ నేటికీ రికార్డులలో లభ్యం అవుతున్నాయి. వాటిలో కొన్ని విశేషాలు (మైకేల్ చెప్పినవి):

1. నేను భారతదేశ మంతటా చూసాను. ఆ దేశంలో ఎక్కడా, ఏ ప్రదేశంలోనూ చూద్దామన్నా దరిద్రుడు నాకు కనబడలేదు.

2. సూరత్ (గుజరాత్) పట్టణంలో ఉన్న సంపద యూరోప్ లోని అన్ని పట్టణాల్లో సంపద కంటే ఎక్కువ.

3. భారతదేశంలో మహత్తర సంపద ఉండడానికి కారణం ఆ దేశంలోని విద్యావ్యవస్థయే. 

4. భారతదేశంలో దాదాపు నూరుపాళ్ళూ అక్షరాస్యత ఉన్నది. దక్షిణ భారతదేశంలో అక్షరాస్యత నూటికి నూరు పాళ్ళూ సంపూర్ణంగా ఉంది. పశ్చిమ భారతదేశంలో 98 శాతం ఉన్నది. ఉత్తర భారతదేశంలో దాదాపు 82 శాతం, మధ్య భారతంలో 87 శాతం అక్షరాస్యత ఉంది.  భారతదేశం విద్యాసంపన్నం అని నేను చెప్పగలను.

5. భారతదేశంలో 7 లక్షల 32 వేల రెవెన్యూ గ్రామాలున్నాయి. వాటిల్లో పాఠశాల లేని ఊరు లేదు. స్కూళ్ళను వారు గురుకులాలు అంటారు. అన్ని వర్గాల వారికి చదువు చెప్తారు.

6. ఒక్కో గురుకులంలో 200 నుంచి 20,000 మంది విద్యార్థులు చదువుకుంటారు. వాటిల్లో మానిటోరియం బోధనా పధ్ధతి ఉంది. 

7. గురుకులాల్లో విద్య, శిక్షణలను ఇస్తారు. నైతికత, ఆధ్యాత్మికత, న్యాయం మొదలైన విద్యలు బోధిస్తారు. గణితం, రసాయన శాస్త్రం,  మొదలైనవి బోధించడం శిక్షణ అంటారు.

8. గురుకులాల్లో 18 విషయాలలో గణితం, ఖగోళశాస్త్రం, విజ్ఞానం, ఇంజనీరింగ్, రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలైనవి బోధిస్తారు. ఒక విషయం పూర్తీ అయిన తరువాత ఇంకొన విషయం బోధిస్తారు. 

9. భారతదేశంలో ఇప్పుడు (1835లో) 15,800 హయ్యర్ స్టడీ సెంటర్స్ అంటే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.  

10. భారతదేశంలో 7 లక్షల 32 వేల కంటే ఎక్కువ స్కూళ్ళు ఉండగా బ్రిటన్ లో 240 స్కూళ్ళు మాత్రమే ఉన్నాయి. 

11. గురుకులాల్లో మెటలర్జీ నేర్పిస్తారు. తుప్పు లేని లోహాన్ని తయారుచేసే విధానం భారతదేశం నుంచే వచ్చింది. 

12. దక్షిణదేశంలో కావేరి నది సమీపంలో ఒక గురుకులం ఉంది. అది సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించినది. ఈ  గురుకులంలోని ఆచార్యులు, విద్యార్థులు క్రీ.శ. 1238లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆనకట్ట నిర్మించారు. 

13. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడే విశ్వవిద్యాలయం శస్త్ర చికిత్స బోధనకు ప్రసిద్ధమైనది. అక్కడ కాలిన భాగంలో చర్మాన్ని తీసి ముక్కుకి పెట్టడం నేను (మైకేల్) కళ్ళారా చూసాను. అది 21 రోజుల్లో పూర్తిగా నయమైంది. దీన్ని 'రైనోప్లాస్టీ' అంటారు. 



ఇలా ఆంగ్లేయులు రాక పూర్వం భారతదేశంలో విద్యావ్యవస్థ గురించి ఎన్నో విశేషాలు మైకేల్ ప్రస్తావించేడు. ఇది దృష్టిలో పెట్టుకునే మెకాలే "భారతదేశాన్ని దేశం చేయాలంటే ఇప్పుడున్న విద్యావిధానాన్ని మనం ధ్వంసం చేయక తప్పదు. అలా చేయకపోతే ఆ దేశాన్ని బానిసల రాజ్యం చేయలేం" అన్నాడు. ఫలితంగా మెకాలే విద్యావిధానం రూపొందించబడి మనపై రుద్దబడింది. 
భారతీయ విద్యా వైభవం Reviewed by rajakishor on 10:37 AM Rating: 5

1 comment:

  1. Dear All,
    Please go through the discussion in the below blog and give your strong replies.

    http://rajasulochanam.blogspot.in/2015/01/blog-post_8.html?showComment=1420980942124

    ReplyDelete

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.