గ్రియోట్స్
పూర్వం భారతదేశంలో ప్రతి గ్రామంలో చరిత్ర చెప్పేందుకు కొందరు మునులుండే వారు. చరిత్ర సేకరించడం, చెప్పడం వీరి వృత్తి.
సృష్టి ఆరంభం నుంచి ఈ ప్రపంచాన్ని ఏలిన రాజులందరి గురించి చెప్తూ, ఆయా గ్రామాలలోని వ్యక్తులందరి పుట్టు పూర్వోత్తరాలు, వంశవృక్షాలు ఈ మునులు సేకరించేవారు. అందుకే ఆ కాలంలో వ్యక్తి తనను తానూ పరిచయం చేసుకునే ముందు తన తాత పేరు, తండ్రి పేరు, తన గోత్రం, ప్రవర చెప్పి తన పేరు చెప్పేవాడు. దాంతో ఆ వ్యక్తీ గురించి సర్వం ఎదుటి వారికి తెలిసిపోయేది.
ఈ మునులు దేశ సంచారం చేస్తూ, దేశంలోని ఇతర ప్రాంతాల చరిత్ర తెలుసుకొంటూ, తమ చరిత్రను, వారి చరిత్రను సరిపోలుస్తూ ఉండేవారు. ఈ మునులు సంచార గ్రంధాల వంటి వారు.
పురాణాలలో కూడా ఇదే పద్ధతిని అవలంబించారు. అందుకే పురాణాలు మన చరిత్ర.
ఈ మునులు చరిత్రను అభ్యసించి, పఠించి, ఆచరించడం ద్వారా దేశంలోని వ్యక్తులకు తమ పూర్వీకుల పరంపరను తెలియజేసేవారు.
ఇప్పటికీ ఇంకా ఆధునిక నాగరికత సోకని ఆఫ్రికా దేశాలలో ఇటువంటి వ్యక్తులున్నారు. వీరిని "గ్రియోట్స్" అంటారు. వీరి ద్వారా సేకరించిన వివరాల ఆధారంగానే అలెక్స్ హెలీ తన ఏడు తరాల చరిత్రను "రూట్స్" పుస్తకంకా వ్రాసేడు.
అయితే విదేశీ దండయాత్రల వల్ల కాలక్రమేణ భారతదేశంలో శాంతిభద్రతలు మృగ్యమైనప్పటి నుంచీ ఈ మన సమాజంలో మునుల పరిస్థితి దుర్భరమవ సాగింది . వీరికి ఆశ్రయమిచ్చే ప్రజలే ఆత్మ రక్షణ కోసం పరిగెడుతుంటే వీరికి రక్షణ కల్పించే దెవరు? పైగా దురాక్రమణ దారుడైన శత్రువు మనిషి కనబడితే మతం మార్చేవాడు లేదా హతమార్చేవాడు. అందువల్ల మరణించిన ఒకో మునితో, మతం మారిన ఒకో వ్యక్తితో ఈ దేశ ప్రజలు కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్రకు దూరమవసాగారు.
గ్రియోట్స్
Reviewed by rajakishor
on
7:12 PM
Rating:
No comments: