60,000 పైగా పూర్ణ గణవేష్ ధారి స్వయంసేవకులతో దేవగిరి ప్రాంత మహాసంఘీక్ - మోహన్ జి మార్గదర్శనం
సంస్కార యుత, సుదృఢ, సమృద్ధి యుత హిందూ సమాజ నిర్మాణం ద్వారా భారత మాతను విశ్వగురుత్వ స్థానం లో తిరిగి నిలబెట్టడం అనే ఏకైన లక్ష్యం కోసం సంఘ్ రాత్రి - పగలు తపనతో పని చేస్తుంది - మోహన్ జి భాగవత్ RSS చీఫ్
ఔరంగాబాద్ : రాష్ట్రీయ స్వయం సేవల్ సంఘ్ దేవగిరి ప్రాంతంలో జరిగిన " మహా సంఘీక్ " కార్యక్రమంలో దాదాపు 60,000 లకు పుగా పూర్ణ గణవేష్ ధారి స్వయం సేవకులు హాజరయ్యారు, ఈ కార్యక్రమానికి పూజ్య సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ జి భాగవత్ మార్గదర్శనం చేసారు.
తేది 11/01/2015 ఆదివారం నాడు జరిగిన అత్యత్భుత కార్యక్రమం " దేవగిరి ప్రాంత మహా సంఘీక్ " కి ఔరంగాబాద్ వేదికైంది, పూర్ణ గణవేష్ ధరించిన సుమారు 60,000 కు పైగా స్వయం సేవకులు ఈ సంఘీక్ లో పాల్గొన్నారు, ఈ సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూజ్య సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ రావు జి భాగవత్ స్వయం సేవకులకు మార్గ దర్శనం చేస్తూ సంస్కార యుత, సుదృఢ, సమృద్ధి యుత హిందూ సమాజ నిర్మాణం ద్వారా భారత మాతను విశ్వగురుత్వ స్థానం లో తిరిగి నిలబెట్టడం అనే ఏకైన లక్ష్యం కోసం సంఘ్ రాత్రి - పగలు తపనతో పని చేస్తుందని అన్నారు. మనం ఆశిస్తున్న సామాజిక పరివర్తన దేశంలోని యువత జాతీయవాద దృక్పదం తో, దేశ హితాన్ని గూర్చి ఆలోచిస్తూ భుజం భుజం కలసి నడిచినప్పుడే, సాధ్యం అవుతుందని ఆయన అన్నార.
60,000 పైగా పూర్ణ గణవేష్ ధారి స్వయంసేవకులతో దేవగిరి ప్రాంత మహాసంఘీక్ - మోహన్ జి మార్గదర్శనం
Reviewed by JAGARANA
on
4:23 PM
Rating:
No comments: