గీథ్: భారతమాత పల్లకి మోసే బోయిలమంతా మనమే
Click Here to Download |
భారతమాత పల్లకి మోసే బోయిలమంతా మనమే
నిప్పు రవ్వలను రాల్చుతూ నిలిచే నింగిన చుక్కలు మనమే !!2!!
జాగోరే ........... సాధక - జన జాగరణే మన వేదికా
! జాగోరే .. !
రాముని కథ నేతృత్వం మనమే - కృష్ణుని గీతకు గాత్రం మనమే
చాకక్యుని చదరంగం మనమే - శివాజీ ఎత్తిన ఛత్రం మనమే
వీరుల శూరుల ధీరులంమనమే - అసుర పాలిట శరములంమనమే
అనంత విశ్వం అఖండ రూపం కాంచిన స్వప్నం మనమే మనమే
! జాగోరే .. !
ధర్మధేను పదాలంమనమే - కర్మ భూమి కణజాలం మనమే
సంస్కారం, సంద్రాలం మనమే -సారస్వత సుమగంధం మనమే
సత్యం మనమే నిత్యం మనమే - సత్వం మనమే తత్వం మనమే
పవిత్ర గాలులు స్వసంత్ర్య వీధుల పాడిన పాటల సారం మనమే
! జాగోరే .. !
సజ్జన శక్తికి సాక్ష్యం మనమే - దుర్జన ముక్తికి మూలం మనమే
పరివర్తన పరమార్థం మనమే - ప్రపంచ శాంతికి దూతగ మనమే
భారతి ఆశ శ్వాస మనమే - భావి తరానికి సారధి మనమే
నవ్య జగానికి దివ్య గానమై నడుంబిగించిన శక్తులు మనమే
! జాగోరే .. !
గీథ్: భారతమాత పల్లకి మోసే బోయిలమంతా మనమే
Reviewed by JAGARANA
on
3:58 PM
Rating:
No comments: