ఇలా ఆలోచిద్దామా?
విశాఖపట్నం భీమిలిలో గల ఆనందవనంలో ఉంటున్న సద్గురు శ్రీ శివానంద మూర్తి గారు ఒక సందర్భంలో చెప్పిన క్రింది మాటలను మీతో పంచుకుంటున్నాను.
"రైళ్ళలో ప్రయాణం చేస్తున్నప్పుడు వేరుశెనగపప్పులు, జంతికలు వంటి చిరు తినుబండారాలు అమ్ముకొనే వారి వద్ద నుండి ఎప్పుడూ కొంటూ ఉండేవాడిని.
మనం అవి తినం కదా, ఎందుకని కొంటున్నారు అని మనవాళ్ళు అడిగితే, అవి తినే వాడికి ఇచ్చేయవచ్చు కదా అనేవాడిని.
అసలు కొనడం ఎందుకు అంటే, అంత పేదరికంలో మగ్గుతూ కూడా దొంగతనానికో, మరొక అవినీతి పనికో పాల్పడకుండా వారు ధర్మంగా రాత్రీ పగలూ శ్రమించి ఇవి అమ్ముకుంటున్నారు కదా! మనం వాటిని కొనకపోతే ఎలా?
అలా కొనడం ద్వారా వారిలో న్యాయబద్ధంగా ఈ సమాజంలో తమ జీవిక సాధించుకోవచ్చుననే నైతిక ప్రోత్సాహం కలిగించినవాళ్ళం అవుతాము కదా అనేవాడిని."
మనమూ ఇలా ఆలోచిద్దామా? చేద్దామా?
ఇలా ఆలోచిద్దామా?
Reviewed by rajakishor
on
7:14 PM
Rating:
No comments: