Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

మతమార్పిడుల నిషేధంపై ఎందుకింత గగ్గోలు?


హిందూ ధర్మము సనాతనమైనది. అనాదిగా భారతజాతి అస్తిత్వానికి ఆధారంగా నిలచింది హిందుత్వం. భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికీ ఆదర్శంగా జీవించడంలో శతాబ్దాలుగా హిందూధర్మం మార్గదర్శనం చేస్తూ వచ్చింది. అటువంటి హిందుత్వం పైన, హిందూధర్మంపైన శతాబ్దాలుగా దాడులు జరుగుతున్నాయి. అటువంటి  మతమార్పిడులు కూడా ఒక భాగం. 

భారతదేశంలో ఏనాడూ, ఎవరిపైనా మతపరమైన నియంత్రణ విధింపబడలేదు. సర్వశక్తిమంతుడైన ఆ పరమేశ్వరుని ఎవరు ఏ పేరుతోనైనా, ఏ రూపంలోనైనా తమకు నచ్చిన రీతిలో ఆరాధించుకునే స్వేచ్ఛ మన సమాజంలో ఉంది. అందువల్ల ఒకరి విశ్వాసాలను ఒకరు గౌరవించుకొంటూ, రక్షించుకొంటూనే స్వీయసాధనలో తనను తానూ ఉద్ధరించుకునే అవకాశం హిందూ సమాజంలో సహజంగానే ఉంది. ఫలితంగా ఒకరి మతవిశ్వాసాలను మరొకరు అగౌరవపరచడమో, నాశనం చేయడమో భారతదేశ చరిత్రలో ఎక్కడా కనబడదు. దేవుని పేరు చెప్పి ఇతర దేశాలపై హిందువులు అన్య దేశాలపై దండెత్తమన్నది చరిత్రలోనే లేదు. అటువంటి ఆలోచనే హిందువులలో ఈనాటికీ లేదు.

అంతేకాదు, ప్రపంచంలో పలుదేశాలలో అనాదరణకు గురైన ఎందరో భారతదేశంలో ఆశ్రయం పొంది, తమ మతవిశ్వాసాలను  సగౌరవంగా నిలుపుకుంటూ మనుగడ సాగిస్తున్న ఉదాహరణలు మనదేశ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. 

ఒక వ్యక్తి ఆత్మౌన్నత్యాన్ని సాధించడానికి దోహదం చేసేది మతము. ఒక మతం ఎంత గొప్పదైనా ఆ మతానుయాయులకు వేరొక మతవిశ్వాసాలను గౌరవించే, వారి ఆరాధనా పద్ధతులను ఆదరించే సంస్కారాన్ని ఇవ్వాలి. అలా కానప్పుడు అటువంటి మతం ప్రపంచంలో వినాశనాన్నే సృష్టిస్తుంది. గత రెండు వేల సంవత్సరాలలో ఈ ప్రపంచంలో పుట్టుకొచ్చిన క్రైస్తవం, ఇస్లాం మతాలూ ఇతర మతవిశ్వాసాల పట్ల అసహన ధోరణితోనే ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని విస్తరించుకునేందుకు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. అందులో భాగంగానే ఆ మతాలు భారతదేశంలో అనాదిగా వస్తూన్న  సంస్కృతిని విచ్చిన్నం చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి.

అసలు ఇతర మతవిశ్వాసాలను, ఆరాధనా పద్ధతులను గౌరవించని మతం ఏ విధంగా గొప్పదౌతుంది? అది తన అనుయాయులకు ఏ విధమైన సంస్కారాలను ఇస్తుంది? అటువంటి మతం ప్రపంచానికి ఏ విధంగా శాంతిని, సౌభాగ్యాన్ని చేకూరుస్తుంది? 

మనదేశంలోని క్రైస్తవులు, ముస్లిములతో పాటు అందరూ భారతీయులేనని భారత రాజ్యాంగం పేర్కొంది. ఇక్కడి క్రైస్తవులు ఐరోపా వారసులు కారు, ముస్లిములు అరబ్బు దేశాల వారసులు కారు. వారంతా ఇక్కడి వారే. వారి పూర్వీకులు ఈ దేశ సంతతివారే. కాని అనాదిగా వస్తూన్న భారతీయ సంస్కృతిని, జీవన విలువలను ఇస్లాం, క్రైస్తవ మతాలూ గౌరవించవు. కమ్యూనిస్టులది కూడా ఇదే ధోరణి. మతం అన్నది వ్యక్తిగతమైనది. ఒక వ్యక్తి తన ఇష్టానుసారం మతం మార్చుకున్నంత మాత్రాన తన పూర్వీకులను, పరంపరాగతమైన విలువలను ఎందుకు వదులుకోవాలి? వాటి పట్ల ఎందుకు వ్యతిరేకతను, అయిష్టతను పెచుకోవాలి? మన దేశంలో మతమార్పిడులు ఈ ఉద్దేశ్యంతోనే కొనసాగుతున్నాయి మొదటి నుంచీ. లేకపోతే ఎక్కడ ముస్లింల, క్రైస్తవుల సంఖ్య అధికంగా ఉందో ఆ ప్రాంతాలలో సామాజికంగా అశాంతి, అలజడులు ఎందుకు ఎక్కువౌతున్నాయి? చోట్ల ఆయా ప్రాంతాలు ఈ దేశం నుంచి విడిపోయేంతగా పరిస్థితులు పరిణమించాయి. వీటికి ప్రత్యక్ష ఉదాహరణ జమ్మూ కాశ్మీర్, నాగాల్యాండ్ రాష్ట్రాలే. నాగాల్యాండ్ (ఇక్కడ క్రైస్తవుల సంఖ్య అధికం) అయితే వేరే రాష్ట్రం ఎవరైనా వస్తే "మీరు భారతదేశం నుండి వచ్చేరా?" అని అడుగుతారు.  మన భాగ్యనగరంలోని ఒవైసీ సోదరుల ప్రసంగాలు ఎంత విద్వేషపూరితంగా ఉంటాయో మనకు తెలిసిందే. ఇదెక్కడి జాతీయ వికృతి? అందరూ ఒకే దేశీయులు కదా? 

అందువల్ల మన జాతీయ సమగ్రతకు భంగకరంగా మారుతున్న ఈ మతమార్పిడులను అరికట్టడానికి జాతీయవాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే గతం ఇస్లాంలోకి బలవంతంగా మార్చబడినవారిని తిరిగి హిందూధర్మంలోకి తీసుకువచ్చే పనిని ఇటీవల ఆగ్రాలో చేపట్టేరు. వెంటనే దీనికి వ్యతిరేకంగా మనదేశంలోని లౌకికవాద పండితులు, వారి మీడియా అనుచరులూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసేరు. ఈ కారణంగానే మతమార్పిడులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని పార్లమెంటులో కోరడం జరిగింది. ప్రభుత్వం అందుకు అనుకూలంగా స్పందించింది కూడా. మళ్ళీ మనదేశంలోని సెక్యులర్ పెద్దలు మతమార్పిడులను నిషేధించరాదని గోల పెడుతున్నారు. 

నిజానికి మనదేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో మతమార్పిడులపై నిషేధం విధిస్తూ చట్టాలు ఉన్నాయి. 1967లో మధ్యప్రదేశ్, ఒరిస్సా ప్రభుత్వాలు మతమార్పిడి నిషేధ చట్టాలను ఆమోదించేయి. అందుకు సుప్రీంకోర్టు సమ్మతి తెలిపింది కూడా. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లలో కూడా అక్కడి ప్రభుత్వాలు మతమార్పిడులను నిషేధించాలని చట్టాలు చేసేయి. ఆ రాష్ట్రాలలో ఉన్నది బి.జె.పి. ప్రభుత్వాలు కావు కూడా. పక్కాగా కాంగ్రెస్ ప్రభుత్వాలు. 

"నాకే కనుక పూర్తీ అధికారం ఉండి, తగిన మంత్రివర్గం ఉంటే తక్షణం దేశంలో మతమార్పిడులను నిషేధించేవాడినని" మహాత్మా గాంధీ నవంబర్ 5, 1935 నాటి తన 'హరిజన్' పత్రికలో పేర్కొన్నారు. అంతేకాదు, దేశానికి స్వాతంత్ర్యం రాగానే భారత ప్రభుత్వం తక్షణం చేయవలసిన పని మతమార్పిడులను నిషేధించడం, విదేశీ క్రైస్తవ మిషనరీలను తక్షణం దేశం నుండి బైటికి వెళ్ళగొట్టడం అని ఆయన అన్నారు. 


గమనించవలసిన  ఏమిటంటే ఈ ప్రపంచంలో మతమార్పిడులు చేస్తున్నవి క్రైస్తవం, ఇస్లాంలు మాత్రమే. 

డిసెంబర్ 10, 2008న ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో Amsterdamలో ఒక సదస్సు జరిగింది.  విశ్వజనీన ప్రకటన యొక్క 60వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రపంచ మతాల నాయకులంతా సంయుక్తంగా ఒక ప్రకటన చేసారు. "ఒకరి విశ్వాసాలను ఒకరం పరస్పరం గౌరవించుకుంటామే తప్ప నిరసించటం చేయం" అంటూ హిందూ, బౌద్ధ, ఇస్లాం, క్రైస్తవ మతాలవారితో సహా అన్ని మతాల వారూ ఒక ప్రకటనపై సంతకం చేసారు. 



అంటే ప్రపంచ వ్యాప్తంగా మతమార్పిడుల వలన ఎదురయ్యే ప్రమాదాలను ఐక్యరాజ్య సమితి సారథ్యంలో గుర్తించి, వ్యతిరేకించేరు. ప్రపంచస్థాయిలో మతమార్పిడుల వ్యతిరేకత పట్ల లేని అభ్యంతరం కేవలం మనదేశంలోని సెక్యులర్ వాదులకు ఎందుకుండాలి? 
మతమార్పిడుల నిషేధంపై ఎందుకింత గగ్గోలు? Reviewed by rajakishor on 2:45 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.