Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

జీసస్ క్రీస్తు హిందువే!



హైందవేతర మతమైన క్రైస్తవ మతస్థులకు జీసస్ క్రీస్తుదేవుడు. శిలువ వేయబడిన తరువాత క్రీస్తు పునరుత్థానం వరకు మాత్రమే వారు చెప్పుకుంటారు. 

జీసస్ తన పదమూడవ యేట నుంచి ముప్పై ఏళ్ళు వచ్చే వరకు భారతదేశంలోని హిమాలయ పర్వతాలలో తపస్సు, యోగసాధనలలో గడిపి ఎన్నో ఆధ్యాత్మిక విషయములను తెలుసుకున్నాడు. తరువాత జీసస్ తన దేశానికి వెళ్ళి ఒక కొండపై మొదటి ప్రబోధం చేసేడు. దానినే "సెర్మన్ ఆన్ ది మౌంట్"గా క్రైస్తవులు పేర్కొంటారు. అయితే జీసస్ తన పదమూడవ యేట నుంచి ముప్పై ఏళ్ళు వచ్చే వరకు ఏం చేసాడన్నది బైబిల్ లో గాని, మరే క్రైస్తవ మతగ్రంధాలలో గాని ప్రస్తావించలేదు. వాళ్ళ బండారం బయటపడుతుందిగా! జీసస్ జీవితంలోని ఈ పదేళ్ళ కాలాన్ని "చీకటి అధ్యాయాలు"గానే (BLACK CHAPTERS) పేర్కొన్నారు. జీసస్ తనకి ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ఎక్కడున్నాడో, ఏం చేసేడో క్రైస్తవ మతస్థులకే తెలియదు. ఆయన పదమూడవ ఏట బైబిల్ లో కనిపిస్తాడు. అతడు పుట్టడం, మరొక రెండు, మూడు  గురించి మాత్రమే బైబిల్ పరంగా క్రైస్తవులకు తెలుసు. తరువాత ప్రవక్తగా అతడు గడిపిన మూడు సంవత్సరాలు మాత్రమే వారికి తెలుసు. 

అయితే జీసస్ గురించి భారతదేశంలో చాలా సమాచారం ఉంది. ఆయన జీవితంలో క్రైస్తవులకు తెలియని చాలా సంవత్సరాలు ఆయన కాశ్మీరులో గడిపేరు. కాశ్మీరులోని బౌద్ధారామాల్లో ఆ సమాచారం ఉంది. ఆయనకి సంబంధించిన జానపద కథలు కూడా కాశ్మీరు లోయలో ప్రచారంలో ఉన్నాయి. అతడు అక్కడ ఉన్నంత కాలం ధ్యానంలో గడిపాడు. తరువాత అకస్మాత్తుగా జెరూసలేంలో ప్రత్యక్షమయ్యేడు. ఆ తరువాత జీసస్ శిలువ వేయబడడం, తిరిగి లేవడం మాత్రమే క్రైస్తవులకు తెలుసు. ఫ్రెంచి రచయితలూ Erwin W. Lutzer మరియు R Sproul వ్రాసిన "ది సర్పెంట్ ఆఫ్ ప్యారడైజ్" అన్న పుస్తకంలో జీసస్ బోధించడం మొదలుపెట్టేంత వరకు ఎక్కడ జీవించేడో ఎవరికీ తెలియదనీ , అయితే అతడు కాశ్మీరులో గడిపేడని కథలు ఉన్నాయని పేర్కొన్నాడు. 

అలాగే రష్యా యాత్రికుడు నికోలస్ నట్టోవిచ్ 1887లో భారతదేశం వచ్చినప్పుడు కాశ్మీరులోని లధాక్ వెళ్ళాడు. అక్కడి బౌద్ధారామాల్లో ఎన్నో రచనలలో, శాస్త్రాలలో జీసస్ కాశ్మీరు రావడం గురించి వుందని పేర్కొన్నాడు. ఆ సాహిత్యంలో జీసస్ గురించి, అతని గురించి ఎన్నో విషయాలున్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఆయన "లైఫ్ ఆఫ్ సెయింట్ జీసస్" అన్న పుస్తకం వ్రాసేడు.  జీసస్ పహల్ గావ్ వెళ్ళి అక్కడి గొర్రెల కాపరులతో కొంతకాలం జీవించేడు. అందుకే ఆ గ్రామానికి ఆ  వచ్చింది. "పహల్" అంటే గొర్రెల కాపరి అనీ, "గావ్" అంటే గ్రామం అనీ అర్థం. తరువాత శ్రీనగర్ వెళ్తూ జీసస్ "యిష్ముక్యుమ్" గ్రామంలో విశ్రాంతి తీసుకున్నాడు. "యిష్ముక్యుమ్" అంటే జీసస్ విశ్రాంతి ప్రదేశం అని అర్థం. 

ఇక జీసస్ శిలువపై జీసస్ నిజంగా చనిపోయి ఉంటే క్రైస్తవమతమే ప్రపంచంలో ఉండేది కాదు. ఎందుకంటే ఆ తరువాత అతడు లేచి చేసిన బోధల ఆధారంగానే ఆ మతం రూపొందింది కాబట్టి. మరి నిజంగా జీసస్ క్రీస్తు ఎప్పడు చనిపోయేడో క్రైస్తవులకు తెలియనే తెలియదు. 

జీసస్ శిలువ వేయబడిన తరువాత వారం రోజులకి పునరుత్థానం అయ్యేడనీ, తన శిష్యులకు కనిపించి, బోధలు చేసి అంతర్థానం అయ్యేడనీ చెప్తారు. కానీ క్రీస్తు ఆ తరువాత కాశ్మీరులో పెహల్‌గాం పరిసరాలలో స్థిరపడ్డాడనీ, తనకి నూటపన్నెండు ఏళ్ళు వచ్చేవరకు అక్కడే జీవించేడని కొన్ని కథనాలున్నాయి. అరబ్బుల ప్రపంచంలో అతడిని "ఏసస్ - ఏసు" అని పిలుస్తారు. కాశ్మీరులో అతడిని యూసా అసఫ్" అని పిలిచేవారు. అక్కడ అతడి సమాధి మీద "యూసా అసఫ్ - ఎవరైతే చాలా దూర ప్రాంతాల నుంచీ వచ్చి ఇక్కడ చాలాకాలం జీవించేడో అతడి సమాథి"గా చెక్కబడింది. 

స్వామిరామ రచించిన ‘హిమాలయ పరమగురువులు’ పుస్తకంలో పెహల్‌గాంలో జీసస్ క్రీస్తు నివసించినట్లు చెప్పబడుతున్న మందిరం ఫొటోలు చూడవచ్చు. భారతదేశంలోని ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నత స్థాయి సాధకులు జీసస్ క్రీస్తు మందిరాన్ని దర్శించుకోవడాన్ని ఒక ఆనవాయితీగా స్వామిరామ పేర్కొన్నారు. పరమహంస యోగానంద గురువుగారైన యుక్తేశ్వర్ తమ ఆధ్యాత్మిక శిక్షణలో భాగంగా శిష్యులకు బైబిల్ బోధలు చేస్తుండేవారు. ఇంకా విశేషం ఏమిటంటే శ్రీరామకృష్ణ పరమహంస అంతేవాసి శిష్యులైన వివేకానందునితో కలిపి పదహారుమందీ క్రిస్‌మస్‌నాడే సన్యాస దీక్షను స్వీకరించేరు. ప్రతియేటా వారంతా క్రిస్‌మస్‌ని ఎంతో వేడుకగా జరుపుకునేవారు. ఈ వివరాలన్నీ ‘గాడ్ లివ్‌డ్ విత్ దెమ్’అన్న పుస్తకంలో లభ్యవౌతాయి. 

ఆధునిక భారతదేశంలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్తలు, యోగసాధకులు జీసస్ క్రీస్తును తమ సాధనలలో భాగంగా ఆరాధించేరు. జీసస్ కూడా భారతదేశంలోనే ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందేడు. 

కాబట్టి జీసస్ క్రీస్తు హిందువే. 

ఇటీవల తిరుపతి వేంకటేశ్వరుని గురించీ, ఇతర హిందూ దేవతల గురించీ క్రైస్తవ మిషనరీలు ఇష్టం వచ్చినట్లు పేలుతున్నారు. హిందూధర్మం గురించి అబద్ధాలు పేలితే క్రైస్తవమతం గురించి నిజాలు బద్దలవుతాయన్న విషయం చెప్పడానికే ఇది వ్రాస్తున్నా. 
జీసస్ క్రీస్తు హిందువే! Reviewed by rajakishor on 2:44 PM Rating: 5

2 comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.