Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

భాగ్యనగర్: సురక్షిత, సుదృడ, సమృద్ధి యుత హిందూ సమాజం నిర్మాణం కావాలి : ప్రవీణ్ భాయి తొగాడియా

దేశంలో తిరిగి ఎవరైనా నిజాం పాలనా తెద్దామనుకుంటే ప్రతి పౌరుడు సర్దార్ వల్లభాయి పటేల్ అవుతారు, లాహోర్ రావల్పిండి లపై ధర్మ ధ్వజం ఎగిరిననాడే మన అసలైన ఉత్సవాలు జరుగుపుకోవాలి, అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం జరిగితీరుతుంది, మన దేశంలో ఏ హిందువు భోజనానికి, విద్యకు, వైద్యానికి దూరం కాకూడదు ఈ దిశలో విహెచ్పి పని చేస్తున్నది - ప్రవీణ్ భాయి తొగాడియా విహెచ్పి అంతర్జాతీయ కార్యధ్యక్షులు   
భాగ్యనగర్, 29/12/2014 : విశ్వ హిందూ పరిషద్ స్వర్ణ జయంతి ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ ( భాగ్యనగర్ ) ఎన్టీఆర్ స్టేడియం లో జరిగిన " భాగ్యనగర్ హిందూ శక్తి సంగమం - కోటి హనుమాన్ చాలీసా పారాయణం " విజయవంతం అయ్యింది, దాదాపు 50,000 మందికి పైగా పరిషద్ కార్యకర్తలు హాజరయిన ఈ భహిరంగ సభకు ప్రముఖ స్వామిజిలు, అనేక హిందూ సంస్థల జాతీయ నాయకులు హాజరయ్యారు. విహెచ్పి అంతర్జాతీయ కార్యధ్యక్షులు మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా చేసిన ఉపన్యాసం ఆలోచనాత్మకంగా సాగింది.

హిందుత్వంలో ఆంటరానితనానికి తావులేదు : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామిజి 

చిన జీయర్ స్వామి ఆశి: ప్రాసంగం చేస్తూ  "పవిత్రమైన హిందూ ధర్మంలో అంటరానితనం లేదు, ధర్మంలోని మధ్యలోవచ్చిన ఈ వికృతిని దూరం చేయాల్సిన అవసరం ధర్మాచార్యులపైనే ఉంది, మన మఠాలను వీడి మన బంధువుల హృదయాలలో ఉన్న ఈ కల్మషాన్ని దూరం చేద్దాం, వివిధ ఆరాధనా పద్దతులను ప్రచారం చేస్తున్న ధర్మాచార్యులమందరం ఒకే హారంలోని రంగురంగుల పుష్పాలం ఈ అన్ని పుష్పాలను బయటికి కనిపించని ఎదో బందం కలిపి ఉంచుతుంది, ఆ భందం సంఘటనాత్మక హిందూ శక్తి, ఆ శక్తికి ప్రతిరూపమే విశ్వ హిందూ పరిషద్."



గుడి, బడి కేంద్రాలుగా ధర్మ ప్రచారం, పోరాటం జరగాలి : శ్రీ రాఘవరెడ్డి విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షులు 

గుడిని, బడిని మనం కేంద్రాలుగా చేసుకుని ధర్మరక్షణకు పాటుపడాలని, బడివల్ల సంస్కారం, గుడివల్ల భక్తి లభిస్తుందన్నారు. హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసమే విహెచ్‌పి ఆవిర్భవించిందని విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షులు జి.రాఘవరెడ్డి అన్నారు. విశ్వహిందూ పరిషత్ స్వర్ణ జయంతి మహోత్సవాలను   
పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో భాగ్యనగర్ హిందూ శక్తి సంగమం, హనుమాన్ చాలీసా కోటిపారాయణ యజ్ఞం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వం ఉర్దూ అకాడమీకి 30 కోట్లు కేటాయించి ప్రాంతీయ తెలుగుభాషకు కేవలం 30 లక్షలు కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. ముస్లింలను హజ్‌యాత్రకు, క్రైస్తవులను జరూసలెంకు పంపుతున్న పాలక ప్రభుత్వాలు ఏ ఒక్క హిందువునైనా తిరుపతికి పంపిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు, గోరక్షణ, మతమార్పిడిల నిరోధన, మఠమందిరాల పరిరక్షణ, హిందూధర్మ పరిరక్షణ, హిందూ దేశ పునర్నిర్మాణం తదితర ఐదు ఆంక్షలతో తీసుకున్న సంకల్పంతో నేడిక్కడ హిందూ శక్తి సంగమం జరుపుకుంటున్నట్లు వివరించారు. రానున్న ఆరు మాసాల్లో ప్రతి హిందువు నేత్ర, రక్తదానానికి, గోరక్షణకు సిద్ధం కావడానికి సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిహిందువు దేవతా వృక్షాలైన మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి, ఉసిరి, మారేడు, తులసి వంటి చెట్లను నాటాలని సూచించారు. రానున్న ఉగాదినుండి శ్రీరామ నవమి వరకు ప్రతి గ్రామం, ప్రతి బస్తీలో శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

నిజాం పాలన తేవాలని చూస్తె ... ప్రతి పౌరుడు పటేలే : శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా విహెచ్పి అంతర్జాతీయ కార్యధ్యక్షులు 

తెలుగు రాష్ట్రాల్లో నిజాం పాలన తేవాలని చూస్తే ప్రతి పౌరుడూ సర్దార్ పటేల్ అవుతాడని విహెచ్‌పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ భాయ్ తొగాడియా హెచ్చరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో విశ్వ హిందూ పరిషత్ స్వర్ణ జయంత్యుత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన హిందూ శక్తి సంగమ కార్యక్రమంలో
ప్రవీణ్ భాయ్ తొగాడియా దేశ, రాష్ట్ర పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆ పేరు ప్రస్తావించకుండా దుయ్యబట్టారు. లాహోర్ రావల్పిండిపై జాతీయ పతాక ఎగురవేసి అఖండ భారతావనిని నిర్మించిననాడే విహెచ్‌పికి అసలైన ఉత్సవాలన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనని, దేశంలో ప్రతి హిందువు హృదయం అదే చెబుతోందన్నారు. ముస్లింల తీరును పరోక్షంగా ప్రస్తావిస్తూ, నలుగురు భార్యల పద్ధతి పోవాలి, కామన్ సివిల్ కోడ్ రావాలని చెప్పారు. మక్కాకు, లేదా జెరూసలేంకి వెళ్తామంటే రాయితీలా? తిరుపతికి మాత్రం ఇవ్వరా? అని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఉర్దూ అకాడమికి మూడు కోట్లు ఇచ్చే ప్రభుత్వం తెలుగు అకాడమికి 30 లక్షలు ఇస్తుంది. వారికి నౌకరీలు, వీరికి అక్కర్లేదా? అని ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి హిందువూ జాగృతి కావల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఒకప్పుడు బంగ్లాదేశ్‌లో 30 శాతం హిందువులు ఉండేవారని, అదిప్పుడు 8 శాతానికి తగ్గిందన్నారు. పాకిస్తాన్‌లో పది శాతం హిందువులు ఉండగా అది కేవలం ఒక శాతానికి పడిపోయిందని, ప్రపంచమంతా తొలుత హిందువులతోనే ఉండేదని, భారత్ వంద శాతం హిందువులతో ఉండేదన్నారు. నేడు పరిస్థితి దారుణంగా ఉందని, రెండు వేల సంవత్సరాలున్న హిందూ సమాజంలో ఒక్క హిందువు కూడా విద్యలేకుండా అనారోగ్యంగా ఉండరాదని, సురక్షకు మరో అర్థం హిందువుల సంఖ్య తగ్గరాదని అన్నారు. హిందువుల ఐక్యత చాలా ముఖ్యమని, కోట్లాది హిందువులు పునఃసమృద్ధి సంకల్పం తీసుకోవాలని చెప్పారు. దేశంలో ఉన్న ఏకైక ధర్మం హిందూత్వమని ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఉద్ఘాటించారు. అన్ని రంగాల్లో భారత్ అగ్రస్థానంలో నిలవాలని పేర్కొన్నారు. ప్రాధమిక విద్య, ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యతే అయినా తాము సైతం చేయూతనిస్తున్నామన్నారు. పూర్వీకులు హిందువులైన వారంతా తిరిగి తమ సొంత మతంలోకి రావాలని, వారందర్నీ హత్తుకుంటామని ప్రవీణ్‌భాయ్ తొగాడియా చెప్పారు.

హిందువులు జాగృతం కావాలి : మాన్య శ్రీ భయ్యా(సురేష్)జి జ్యోషి RSS సర్ కార్యవాహ  

హిందువులు జాగృతం కావాలని, తమ శక్తిని చూపాలని ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహక్ భయ్యాజీ జోషి అన్నారు. విశ్వ హిందూ పరిషత్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన హిందూ శక్తి సంగమంలో ఆయన మాట్లాడారు. హిందూ చైతన్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందని, దేశవ్యాప్తంగా అనేకచోట్ల నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాల్లో ఇది ప్రస్ఫుటమవుతోందని అన్నారు. జాగరూకత, సంస్కృతిని అర్ధం చేసుకోవడం, నిర్వాహక బాధ్యత తీసుకోవడం, హిందువుగా భాగస్వామ్యం కావడం ముఖ్యమని అన్నారు. అంతర్జాతీయంగా వస్తున్న సవాళ్లను, లోపాలను సరిదిద్దడంలో హిందువులు తమ శక్తిని గుర్తించాలని, పరిష్కారాలను సూచించాలని చెప్పారు. భ్రూణ హత్యలను ఎదుర్కోవాలని, కుటుంబ విలువలను కాపాడాలని, సమాజంలో శాంతి సామరస్యాలను నిలపాలని అన్నారు. హిందువుల సెంటిమెంట్‌ను కాపాడాలని తాము అన్ని మతాల వారికీ సూచిస్తున్నామని, ఒకరిపై ఒకరికి విశ్వాసం పెంచుకునేలా మిగిలిన వారు సైతం హిందూ సెంటిమెంట్లను గౌరవించాలని అన్నారు. దేశంలో టెర్రరిజం, చొరబాట్లు, వామపక్ష తీవ్రవాదం, విచ్చిన్నకర ఉద్యమాలు ఎక్కువయ్యాయని దీనివల్ల దేశంలో శాంతి నశిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామీజీ, విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామీజీ (హంపి పీఠాధిపతి), కమలానంద భారతీ స్వామీజీ (హిందూ దేవాలయాల ప్రతిష్టాన పీఠం), సుబుదేంద్ర తీర్థస్వామీజీ (మంత్రాలయ మఠాధిపతి), మాడుగుల నాగఫణిశర్మ, సత్యాప్రదానంద స్వామీజీలతోపాటు పలువురు పీఠాధి, మఠాధిపతులు, సాధు సంతులు పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖమంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర శాసనసభాపక్షనేత డా.కె.లక్ష్మణ్, ఆరెస్సెస్ సర్ కార్యవాహ, విహెచ్‌పి అంతర్జాతీయ నేతలు చంపత్‌రాయ్‌జీ, దినేష్‌చంద్రజీ, వై.రాఘవులు, రాష్ట్ర స్వర్ణ జయంతి కమిటీ చైర్మన్ త్రిపురనేని హనుమాన్ చౌదరి, విహెచ్‌పి నేతలు సురేందర్‌రెడ్డి, బండారు రమేష్, స్వర్ణజయంతి కమిటీ భాగ్యనగర్ చైర్మన్ నగునూరి చంద్రశేఖర్, విహెచ్‌పి భాగ్యనగర నేతలు డా.ప్రభాకరరావు, బండారు సత్యనారాయణ, జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ కమిటీ చైర్మన్ కర్నె శ్రీశైలం, విహెచ్‌పి మహిళా ప్రముఖ్ వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
      
భాగ్యనగర్: సురక్షిత, సుదృడ, సమృద్ధి యుత హిందూ సమాజం నిర్మాణం కావాలి : ప్రవీణ్ భాయి తొగాడియా Reviewed by JAGARANA on 9:53 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.