కడప: ప్రవీణ్ తొగాడియా ను హిందూ తీవ్రవాదన్న C. రామచంద్రయ్య - భజరంగ్ దళ్ నిరసన
తమ ప్రభుత్వ కాలంలో దేశవ్యాప్తంగా వందలాది ఉగ్రవాద దాడులు జరిగినా చలించని వ్యక్తులు, నేడు హిందూ హృదయ సామ్రాట్ తొగాడియా గారిని 'హిందూ తీవ్రవాదిగా' పేర్కొనడం ఘర్హనీయం, ఇలాంటి వ్యక్తులు హిందువుల ధర్మాగ్రహానికి ఆహుతికాక తప్పదు - భజరంగ్ దళ్ , కడప
కడప, 28/12/2014 : విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ కార్యధక్షులు మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా పై తీవ్ర స్థాయిలో అనుచిత వాఖ్యలు చేస్తు తొగాడియా ను 'హిందూ తీవ్రవాది' గా అభివర్ణించిన శాసన మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య పై భజరంగ్ దళ్ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది, ప్రతిగా కడపలో సి రామచంద్రయ్య దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. విశ్వ హిందు పరిషద్ నాయకులు స్థానిక పొలిసు స్టేషన్ లో కేసును నమోదు చేయడం జరిగింది, ఇటీవల కడపలో విశ్వ హిందూ పరిషద్ నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం విజయవంత మైన నేపథ్యంలో ఈ వాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి, సి. రామచంద్రయ్య తన నోటిని అదుపులో పెట్టుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానిక విహిప, భజరంగ్ దళ్ మరియు హిందూ సంస్థల నాయకులు హెచ్కరించారు.
కడప: ప్రవీణ్ తొగాడియా ను హిందూ తీవ్రవాదన్న C. రామచంద్రయ్య - భజరంగ్ దళ్ నిరసన
Reviewed by JAGARANA
on
2:16 PM
Rating:
Reviewed by JAGARANA
on
2:16 PM
Rating:



No comments: