ఘర్ వాపసి నేపథ్యంలో: హిందూ వ్యతిరేకతే నిజమైన సేక్యులరిజమా ? - శ్రీ రామానుజన్
ప్రస్తుతం దేశం ‘‘హిందూ వ్యతిరేకతే సెక్యులరిజం’’ అనే రాజకీయ అప్రమాణిక భాషతో నిండిపోయివుంది. మిషనరీల దృష్టిలో భారత్ అంటే విగ్రహారాధకులు, క్రీస్తు విశ్వాసులు కానివారితో నిండిన చీకటి భూమి. దీన్ని వెంటనే క్రీస్తు భూమిగా మార్చాలి. భారత్ నిరుపేద దేశంగా ఎందుకున్నదంటే...ఇక్కడంతా విశ్వాసులు కానివారు ఉండటం వల్ల. ‘జోషువా ప్రాజెక్టు’ ప్రధాన లక్ష్యం ఈ అన్యమతస్థులను ‘హార్వెస్టింగ్ ఆఫ్ సోల్స్’కు గురి చేయడమే
భారత్‌కు ఏది కొత్త? మతమార్పిడులా లేక తిరిగి స్వమతంలోకి మార్చడమా? కానీ మన సూడో సెక్యులరిస్టుల నకిలీ ప్రవచనాలను వింటే అట్లాగే అనిపిస్తుంది. అహంభావం, అవివేకం, స్పష్టమైన పక్షపాత వైఖరి, కాపట్యం, వదరుబోతుతనంతో కూడిన మీడియా విశే్లషకుల వ్యాఖ్యలు.. ఈ మతమార్పిడులు కేవలం ఆగ్రాలోనే మొదలయ్యాయన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలుగజేయడానకి యత్నించాయి.
ఒక సీనియర్ జర్నలిస్టు (వలసపాలన కాలం నాటి ఆ జర్నలిస్టును వర్ణించడానికి అంతకు మిం చిన పదం నాకు దొరకలేదు) బహుశా ఆయన్ను ‘పాతకాలం నాటి జర్నలిస్టు’అని పిలవచ్చనుకుంటా. ఆయన ఈ ఇస్లాం/క్రైస్తవం నుంచి హిందూమతంలోకి జరిగిన మార్పిడులను ‘‘బిపిఎల్ మార్పిడులు’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఎందుకంటే పునఃమార్పిడులను ‘‘రైస్ కన్వర్షన్స్’’ అంటూ ఒక ముద్ర వేశారు. అయితే నేరుగా కాకపోయినా ‘‘ప్రలోభం’’ అనేది రెండువైపులా పనిచేస్తున్నదని మాత్రం అంగీకరించాడు. ఎవరైనా తన మతాన్ని స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు కల్పించిన మన రాజ్యాంగం, ప్రలోభంతో మతమార్పిడులను ప్రోత్సహించడానికి హామీ ఇస్తున్నదా? మరి ఇన్ని దశాబ్దాలుగా జరుగుతున్నది కేవలం ప్రలోభం ద్వారానే కదా? కానీ మన సూడో ఉదారవాదులు అటువంటి వాటిని వేరే కోణంలో చూస్తారు! ఒక దేశానికి చెందిన స్థానిక విశ్వాసాలపైకి బలవంతంగా చొచ్చుకొని రావడాన్ని నిరోధించడంలో సమాజం విఫలమైనప్పుడు, చురుకైన నిరోధకత వెనువెంటనే తప్పనిసరిగా మొదలై తీరుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నది దానే్న!
భారత్ మతమార్పిడుల దేశమన్న అంశాన్ని మనం అంగీకరిద్దాం. మరి ఇన్ని శతాబ్దాలుగా జరిగింది కేవలం ఏకపక్షంగానే కదా. భారతీయ మతంలో ఉన్న లోపాలను ‘‘హార్వెస్టింగ్ ఆఫ్ సోల్స్’’ కోసం ఉపయోగించుకున్నారు. దేశీయ మతానుయాయులు సాత్వికులు, శక్తిహీనులు కాబట్టి, చొరబాటుదార్లు వారిని తేలిగ్గా తమతమ మతాల్లోకి మార్చేయగలిగి ఉండవచ్చు. చరిత్రను పరిశీలిస్తే వివిధ కాలాల్లో ప్రతిఘటనను కూడా గమనిస్తాం. అయితే ఆ ప్రతిఘటన అత్యంత బలహీనమైంది. రాజ్యాధికారం విదేశీయుల చేతుల్లో ఉండేది. మొట్టమొదట మొఘల్స్ తర్వాత మిషనరీలు. ఇక జవహర్‌లాల్ నెహ్రూ పోషకత్వంలో కమ్యూనిస్టులు. మరి ఈ వామపక్ష చరిత్రకారులు..మత మార్పిడులు జరిగినప్పుడల్లా ‘‘బలవంతంగా’’ అనే పదాన్ని రాసివుండవచ్చు. నిజం చెప్పాలంటే ఇష్టపూర్వంకంగా ఎవ్వరూ మతమార్పిడులు జరగలేదు. ప్రలోభం లేదా ప్రాణహాని ఉన్నప్పుడు మాత్రమే మార్పిడులు జరిగాయి.
సరే..అదంతా చరిత్ర. మరి స్వాతంత్య్రానంతరం జరుగుతున్న మార్పిడుల సంగతేంటి అని కొందరు వాదించవచ్చు. నిజమే! ముందుగా ఒక ప్రాథమిక ప్రశ్నకు సమాధానం కావాలి. దేశంలోని ఆరు రాష్ట్రాలు మత మార్పిడి నిరోధక చట్టాలను ఎందుకు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నాయి? ఆయా చట్టాలను అమల్లోకి తెచ్చినప్పుడు అక్కడ అధికారంలో ఉన్నది మితవాద పార్టీలు కాదు కదా! ఉదాహరణకు ఒడిశా తీసుకుందాం. మరక్కడ గిరిజనులను హిందూమతం నుంచి క్రైస్తవంలోకి పెద్ద ఎత్తున మతమార్పిడులకు గురిచేస్తున్నారు కనుక ఆ రాష్ట్రంలో తక్షణమే మతమార్పిడి నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టి తక్షణమే అమలు జరపాలి. గుజరాత్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో కూడా. మరి ఈ చట్టాలను దేశ అత్యున్నత న్యాయస్థానం ఆమోదించింది. మరి ఈ కుహనా సెక్యులరిస్టుల అజెండాకు ఈ తీర్పు అనుకూలంగా లేనప్పుడు వెంటనే తీర్పును పునఃసమీక్షించాలంటూ గొడవ మొదలు!
ఆగ్రా కార్యక్రమానికి ఇదంతా నేపథ్యం. ఉదారవాదులు ఈవిధంగా వాదిస్తారు, ‘‘ఇటువంటి కార్యక్రమాల వల్ల వివిధ మతాల మధ్య హింసాకాండ చెలరేగే ప్రమాదం ఉంది. వారంత ఆనైతికులు, కపటులు, తీవ్ర పరిణామాలకు కారకులు.. అటువంటి చట్టం (మత నిరోధక చట్టం) పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. దీనివల్ల మన అంతరాత్మ ప్రబోధం, మత స్వేచ్ఛ వంటివి పూర్తిగా దెబ్బతింటాయి. అంతే కాదు శాంతియుతమైన ప్రజాస్వామ్య సమాజం ఏర్పాటు దిశగా మనం చేస్తున్న కృషిని అది దెబ్బతీస్తుంది.’’
అవును మరి! ఉదారవాదులు చెప్పింది నిజమే!!కానీ ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే.. కావాలనే కొన్నింటిని మరచిపోవడం. ‘‘ఘర్ వాపసీ’’ కార్యక్రమం పట్ల వారు ఎంతటి భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారో, హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మతమార్పిడుల పట్ల కూడా అంతే భయాన్ని వ్యక్తం చేయాలి. కానీ అది వారికి ఏమాత్రం ఆమోదం కాదు. కేవలం ‘‘ఘర్‌వాపసీ’’ మాత్రమే నేరం, రాజ్యాంగ విరుద్ధం! హిందువులను మతమార్పిడులకు గురి చేయడం మాత్రం పూర్తిగా రాజ్యాంగ బద్ధం. అంతరాత్మ ప్రబోధం అనే ప్రాథమిక హక్కుకు ఏవిధమైన భంగకరం కాదు. కంధమాల్‌లో (ఒడిశా)లో ఏం జరిగింది? స్థానిక మత విశ్వాసానికి, సంస్కృతికి కట్టుబడి వున్నవారిని ఇతర దేశాల మతాలలోకి మార్పిడి చేశారు. మరి ఆ రాష్ట్రంలో మతమార్పిడి నిరోధక చట్టం అమల్లో ఉంది మరి! ఆస్ట్రేలియాకు చెందిన మిషనరీ, ఒక హిందూ సన్యాసి దారుణ హత్యకు గురైనప్పుడు మరి ఈ ఉదారవాదులంతా ఏమయ్యారు? మతమార్పిడులపై ఒక్కరు కూడా నోరెత్తలేదు? మతహింసకు స్థానిక విశ్వాసాలను పరిహాసం చేయడమే కారణమంటూ గట్టిగా ఎందుకు మాట్లాడలేదు? కానీ వారు తమ ఆగ్రహాన్ని ‘‘్ఫసిస్టు శక్తులంటూ’’ వెలిగక్కారు. నిజానికి ఇది నాగరికతల మధ్య సంఘర్షణ. గోవులను పూజించడం స్థానిక సంప్రదాయం. దీన్ని విదేశీ మతవిశ్వాసులు సవాలు చేయలేదు. కానీ ఎగతాళి చేశారు. ఈ సంఘర్షణ ఫలితమేంటనేది ప్రస్తుత చరిత్రలో భాగం.
మతపరమైన క్రతువు నిర్వహిస్తుండగా ఒక హిందూ సన్యాసిని దారుణంగా హత్య చేశారు. దీనికి కారణం నక్సల్స్ అని ఆరోపించారు. హత్యానంతర హింసాకాండకు కారణమంటూ కాషాయ శక్తులను బజారుకీడ్చారు. అసలు ఆ సన్యాసి ఎందుకు హత్యకు గురయ్యాడు? విదేశీ నిధుల సహాయంతో గిరిజనుల్లో జరుగుతున్న మతాంతరీకరణలను ఆయన సమర్ధవంతంగా నిరోధించగలడు. మరి ఇదే ఉదారవాదులు స్వమతంలోకి తిరిగి మార్పిడులను అనైతికం, కపటం, దుష్ఫలితాలనిస్తాయంటూ గగ్గోలు పెడతారు. అంతే కాని విదేశాలనుంచి దిగుమతి అయిన మిషనరీల ద్వారా మతమార్పిడుల వ్యాపారంలో నిబిడీకృతమై ఉన్న ప్రమాదాలను పట్టించుకోరు. అంతేకాదు అంతర్మధనానికి వీరు అవకాశమివ్వరు. కేవలం ఆగ్రా సంఘటన పైనే వీరి అంతరాత్మ ఘోష పెడుతుంది. సెక్యులరిజం లేదా సెక్యులరిజం స్ఫూర్తికి ఈ మతమార్పిడులు విరుద్ధమన్న సత్యాన్ని ఆగ్రా సంఘటనను విమర్శిస్తున్నవారు గుర్తించాలి. కేవలం మతమార్పిడులకోసం విదేశాలనుంచి బిలియన్లకొద్దీ డాలర్లు మనదేశంలోకి ప్రవహిస్తాయని మన రాజ్యాంగ కర్తలు ఊహించలేదు. ఆవిధంగా ఊహించినట్లయితే వారు ప్రలోభాలతో మతమార్పిడులను నిరోధించే ఒక రాజ్యాంగ నిబంధనను తప్పనిసరిగా పొందుపరచి ఉండేవారు. సలు ఇతర మతానికి చెందిన వ్యక్తిని ఎందుకు వేరే మతంలోకి మార్చాలి? ఎందుకంటే మోక్ష సాధనలో తన విశ్వాసం ఇతరుల విశ్వాసం కంటే ఆధిపత్యం కలిగివున్నదని భావించడం వల్ల. మరి సర్వమతాలను సమాన గౌరవంతో చూడాలని చెప్పే సెక్యులరిజానికి ఇది ఏవిధంగా సరిపోతుంది? మన దేశవాసుల విశ్వాసమైన ‘సర్వమత సమభావ’ దృక్కోణాన్ని ఈ మతమార్పిడులకు పాల్పడేవారు ఆమోదిస్తారా?
ప్రస్తుతం దేశం ‘‘హిందూ వ్యతిరేకతే సెక్యులరిజం’’ అనే రాజకీయ అప్రమాణిక భాషతో నిండిపోయివుంది. మిషనరీల దృష్టిలో భారత్ అంటే విగ్రహారాధకులు, క్రీస్తు విశ్వాసులు కానివారితో నిండిన చీకటి భూమి. దీన్ని వెంటనే క్రీస్తు భూమిగా మార్చాలి. భారత్ నిరుపేద దేశంగా ఎందుకున్నదంటే...ఇక్కడంతా విశ్వాసులు కానివారు ఉండటం వల్ల. ‘జోషువా ప్రాజెక్టు’ ప్రధాన లక్ష్యం ఈ అన్యమతస్థులను ‘హార్వెస్టింగ్ ఆఫ్ సోల్స్’కు గురి చేయడమే. ఇక ఇస్లాం ప్రకారం మహమ్మద్ ప్రవక్తను తప్ప మరెవరిని పూజించినా అది ‘తప్పుడు మతమే’. మరి ఇవన్నీ సెక్యులరిజం స్ఫూర్తినికాపాడేవేనా? ఎవరైనా ఈ ప్రశ్నను లేవనెత్తితే, సదరు వ్యక్తిని ‘‘కమ్యూనల్’’ అంటూ ముద్రవేస్తారీ సెక్యులర్ యోధులు!
ఘర్ వాపసి నేపథ్యంలో: హిందూ వ్యతిరేకతే నిజమైన సేక్యులరిజమా ? - శ్రీ రామానుజన్
Reviewed by JAGARANA
on
2:00 PM
Rating:
No comments: