కరసేవకుల బలిదానాన్ని వృదా కానివ్వం : భజరంగ్ దళ్ తీర్మానం
హరిద్వార్ , 14/10/2014 : హరిద్వార్ లోని శ్రీ ప్రేమనగర్ ఆశ్రమం లో నిర్వహించబడుతున్న భజరంగ్ దళ్ జాతీయ స్థాయి సమావేశాల్లో అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిర ఉద్యమంలో అమరులైన కర సేవకుల కుటుంబాలను సత్కరించడం జరిగింది.
మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలలో దేశంలోని 42 ప్రాంతాలకు చెందిన భజరంగ్ దళ్ జిల్లాల మరియు విభాగ్ ల సంయోజకులు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. అనేక మంది విశ్వ హిందు పరిషద్ జాతీయ నాయకులు ఈ సమావేశాలకు మార్గ దర్శనం చేసారు, కార్యక్రమ ముగింపులో జరిగిన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది.
ముగింపు సమావేశంలో భజరంగ్ దళ్ జాతీయ సంయోజకులు శ్రీ రాజేష్ పండి గారు మాట్లాడుతూ ' అయోధ్య శ్రీ రామ జన్మ భూమిలో భవ్య శ్రీ రామ మందిరం నిర్మించి తీరుతాం, దేశంలోని మరెక్కడా కూడా బాబర్ పేరుతొ నిర్మాణాలను సహించేది లేదు, ఏ పవిత్ర లక్ష్య సాధనలో భాగంగా కరసేవ రోజున తమ ప్రాణాలను సహితం తృణప్రాయంగా భావించి రామ కార్యంలో బలిదానం అయిన మన సహోదరులు మన మార్గదర్శకుల త్యాగం వృదా కావడానికి వీల్లేదు, వీర హనుమాన్ వారసుల వలె మనం రామ కార్యంలో మున్డుందాం ' అని అన్నారు
కరసేవకుల బలిదానాన్ని వృదా కానివ్వం : భజరంగ్ దళ్ తీర్మానం
Reviewed by JAGARANA
on
8:07 AM
Rating:
me prayatnaneke abe nanadanalu
ReplyDelete