ప్రధాని మోడీ చేతుల మీదుగా " విరాట్ పురుష్ నానాజీ " పుస్తక ఆవిష్కరణ
క్రొత్త డిల్లి , 13/10/2014 : సమగ్ర వికాస గ్రామీణ భారత స్వాప్నికుడు మాన్య శ్రీ నానాజీ దేశ్ ముఖ్ జీవితం, కార్యశైలి పై ఆరు పుస్తకాల సంపుటి " విరాట్ పురుష్ నానాజీ " ని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహా కార్యవాహ మాన్య శ్రీ దత్తాత్రేయ హోసబలె గార్లు సంయుక్తంగా ఆవిష్కరించారు, ఈ కార్యక్రమం క్రొత్త డిల్లి లోని విజ్ఞాన్ భవన్ ఆడిటోరియం లో జరిగింది సంఘ్ జేష్ట్య ప్రచారక్ మాన్య శ్రీ మదన్ దాస్ దేవి కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది.
నానాజీ గా ప్రసిద్ది చెందిన సంఘ్ పరివార్ కురు వృద్ధుడు నానాజీ దేశ్ ముఖ్ తన 93 వ ఏట 2010 సంవత్సరం పరమపదించడం జరిగింది, భారతీయ జన సంఘ్ వ్యవస్థాకులలో ఒకరిగా మరియు దేశంలోనే మొట్ట మొదటి గ్రామీణ యునివర్సిటి ని మధ్య ప్రదేశ్ లోని చిత్రకూట్ వద్ద స్థాపించిన వ్య్యక్తిగా ప్రసిద్ది చెందారు
ప్రధాని మోడీ చేతుల మీదుగా " విరాట్ పురుష్ నానాజీ " పుస్తక ఆవిష్కరణ
Reviewed by JAGARANA
on
10:34 AM
Rating:
No comments: