న్యుడిల్లి : హిందు ధర్మం - వైశిష్ట్యం పై ప్రపంచ హిందు సమ్మేళనం(WHC) - హాజరైన మోహన్ జి భాగవత్
క్రొత్త డిల్లి 23/11/2014 : విశ్వ హిందు పరిషద్ స్వర్ణ జయంతి ఉత్సవాల నిర్వహణలో భాగంగా Nov 22-24 మూడురోజుల పాటు క్రొత్త డిల్లీలో జరుగుతున్న వరల్డ్ హిందు కాంగ్రెస్ (ప్రపంచ హిందు సమ్మేళనం ) లో మొదటి రోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూజ్య సర్ సంఘ్ చాలక్ మాన్య మోహన్ జి భాగవత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ' ప్రపంచం మొత్తం కుటిల నీతిని తన మనస్సులో నింపుకుని ప్రపంచాదిపత్యం కోసం తహ తహ పడుతూ విశ్వ శాంతికి విఘాతం కలిస్తున్న ఈ సమయంలో ప్రపంచానికి మరో సారి మానవతా వాదం వైపు, పరోపకారం వైపు తన ఆధ్యాత్మిక శక్తితో నడిపించే సత్తా కేవలం హిందూ ధర్మంలోనే ఉంది, మన జీవనాలు కేవలం సఫలం కావడం కాదు సార్ధకం కావాలి అనే ఆలోచన కేవలం హిందుత్వం మాత్రమె కలిగించ గలదు.
విశ్వ హితం కోసం హిందుత్వం శక్తివంతం కావాలి, సకారాత్మక హిందుత్వం శక్తివంతం అయితేనే నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమశ్యలు కూకటి వేళ్ళతో సహా పెకిలి పోతాయి
వరల్డ్ హిందూ కాంగ్రెస్ ఆ దిశలో జరుగుతున్న ఒక అద్బుత అపూర్వ కృషిలో తొలిమెట్టు అవుందని ఆదిశలో హిందూ సమాజం మొత్తాన్ని మనతో తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనదే అని అన్నారు
న్యుడిల్లి : హిందు ధర్మం - వైశిష్ట్యం పై ప్రపంచ హిందు సమ్మేళనం(WHC) - హాజరైన మోహన్ జి భాగవత్
Reviewed by JAGARANA
on
1:44 PM
Rating:
No comments: