దేశానికి హితాన్ని చేకూర్చే విధంగా విద్య ' జాతీయకరణ ' చెందాలి : మాన్య మోహన్ భాగవత్
మన దేశం లో విద్యార్థులకు అందించే విద్య కేవలం వారి జీవన బృతి కోసం కాకుండా వారిలో సమాజం పట్ల బాధ్యతను , దేశ భక్తిని పెంచే విధంగా ఉండాలి, వారు నేరుచుకున్న విద్య దేశ సమగ్ర అభివృద్ధికి బాసటగా నిలిచేలా ఉండాలి, దాని కోసం విద్య ' జాతీయకరణ చెందాలి - మాన్య మోహన్ రావు భాగవత్, సర్ సంఘ్ చాలక్ , రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
కేరళ, కొట్టాయం, 31/08//2014 : కేరళ రాష్ట్రము, కొట్టాయం జిల్లా లోని పల్లిక్కతోడు శ్రీ అరవింద విద్యా మందిరం రజత జయంతి ఉత్సవాల ప్రారంబోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ రావ్ భాగవత్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాలలో విద్యా మందిర పూర్వ విద్యార్థులు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో మోహన్ జి మార్గదర్శనం చేస్తూ ' భారతీయ సంసృతిలో విద్యా చాల ప్రముఖ మైన పాత్ర వహిస్తుంది, అనాది కాలం నుండి తమ తల్లి - తండ్రులను, సహోదరులను వదిలి విద్య కోసం గురు సుశ్రుత చేస్తూ విద్యను అభ్యసించే వారు, విద్య కేవలం భౌతిక సుఖాల కోసం, జీవన బృతి కోసం నిర్దేశించినది కాదు, కాని దురదృష్టవశాత్తు నేడు కేవలం వ్యాపార మాయమైన విద్యా విధానం ఈ దేశంలో కొనసాగుతుంది, దీని వల్ల దేశానికి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంది, కాబట్టి మన దేశంలో విద్య జాతీయకరణ చెందాల్సి ఉంది, కేవలం జాతీయకరణ చెందిన విద్యా విధానం లోనే దేశానికి, సమాజాని హితకరమైన విద్యను అందించగల్గుతాం' అని అన్నారు.
మూలం : VSKKERALA
దేశానికి హితాన్ని చేకూర్చే విధంగా విద్య ' జాతీయకరణ ' చెందాలి : మాన్య మోహన్ భాగవత్
Reviewed by JAGARANA
on
3:00 PM
Rating:
No comments: