భాగ్యనగర్ : హిందూ దేవతలను కించపరచిన RGV పై కేసు నమోదు చేసిన న్యాయవాది కరుణసాగర్
హిందూ దేశంలోనే ఉంటూ, హిందు దేవి - దేవతల పై అసభ్య వాఖ్యలు చేసిన ఈ దర్శకునికి అన్య మతస్తుల విశ్వాసాలపై ఇలా మాట్లాడే దమ్ముందా? , ఇలాంటి వారికి చెప్పు దెబ్బలాంటి సమాదానం చెప్పడానికి హిందు సమాజం సమాయత్తం కావాలి - రాష్ట్ర చేతన
భాగ్యనగర్, 31/08/2014 : హిందువులకు పవిత్ర మైన ' వినాయక చవితి ' రోజున హిందు దేవి - దేవతలను కించపరిచే విధంగా ట్విట్టర్ లో వాఖ్యలు చేసిన ప్రముఖ సిని దర్శకుడు రాం గోపాల్ వర్మ పై స్థానిక న్యాయవాది శ్రీ కరుణసాగర్ గారు సరూర్ నగర్ పొలిసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. మరో పిర్యాదును కోర్టు లో కూడా నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ' దేశంలో ప్రతి ఒక్కరికి హిందు దేవతల పై అసభ్య వాఖ్యలు చేయడం ఫాషన్ అయిపొయింది, పోయిన క్రేజ్ ను తిరిగి తెచ్చుకోవడానికి, మీడియా దృష్టిని తమ వైపు త్రిప్పు కోవడానికి ఇలాంటి నీచమైన పనులకు ఒడిగట్టడం మంచిది కాదు, తమ సొంత వ్యవహారాల కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడటం ఇక ముందు సహించబోం ' అని అన్నారు.
భాగ్యనగర్ : హిందూ దేవతలను కించపరచిన RGV పై కేసు నమోదు చేసిన న్యాయవాది కరుణసాగర్
Reviewed by JAGARANA
on
3:32 PM
Rating:
Reviewed by JAGARANA
on
3:32 PM
Rating:




No comments: