Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

పుణః ప్రారంభమై భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న బద్రినాథ్ , కేదారనాథ్ పుణ్యక్షేత్రాలు


డెహ్రాడూన్: ప్రకృతి ప్రకోపంతో పెను విధ్వంసానికి గురైన ఉత్తరాఖండ్‌లో చివరికి ఆధ్యాత్మిక విశ్వాసమే విజయం సాధించింది. ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించడంతో గత ఏడాది మూతబడిన బద్రీనాథ్ పుణ్యక్షేత్రం సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తెరుచుకుంది. పవిత్ర వేద మంత్రాలు, సాధువుల శంఖనాదాల మధ్య సోమవారం ఈ పుణ్యక్షేత్రాన్ని తిరిగి ప్రారంభించారు. కేదార్‌నాథ్ క్షేత్రంలో ప్రార్థనలు మొలైన మరుసటి రోజే బద్రీనాథ్ ఆలయాన్ని కూడా తిరిగి తెరవడం విశేషం. బద్రీనాథ్ క్షేత్ర నూతన ప్రధాన పూజారి (రావల్) ఈశ్వర్ ప్రసాద్ నంబూద్రి సోమవారం తెల్లవారు జామున 4 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో ఆలయ ద్వారాలు తెరిచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న భక్తులు తమ ఇష్ట దైవమైన బద్రీనాథుడికి పూజలు నిర్వహించి తరించారు. అలాగే అలకనందా నది నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాన్ని బద్రీనాథ్ క్షేత్రమంతటా చల్లి పట్టణాన్ని శుద్ధి చేశారు. ‘చార్ ధామ్’లో అంతర్భాగమైన గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను ఈ నెల 2వ తేదీన పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. బద్రీనాథ్ ఆలయ తాత్కాలిక ప్రధాన పూజారిగా ఈశ్వర్ ప్రసాద్ నంబూద్రికి ఆదివారమే లాంఛనంగా బాధ్యతలు అప్పగించారు. ఇంతకుముందు ఈ ఆలయానికి ప్రధాన పూజారిగా వ్యవహరించిన బి.కేశవన్ నంబూద్రి ఒక మహిళను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు రావడంతో ఆయనను సస్పెండ్ చేసి అరెస్టు చేసిన విషయం విదితమే. అప్పటి నుంచి బద్రీనాథ్ ఆలయ ప్రధాన పూజారి పదవి ఖాళీగా ఉండంతో ఇప్పటివరకూ ఉప ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఈశ్వర్ ప్రసాద్ నంబూద్రికి తాత్కాలిక ప్రధాన పూజారిగా బాధ్యతలు అప్పగించారు.
మూలం : ఆంధ్రభూమి దిన పత్రిక
ఫోటో మూలం : హిందు జాగృతి

Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article. 
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here  
పుణః ప్రారంభమై భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న బద్రినాథ్ , కేదారనాథ్ పుణ్యక్షేత్రాలు Reviewed by JAGARANA on 12:38 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.