Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

శ్రీకాకుళం : తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 138 మంది మతం మారిన హిందువులు

క్రైస్తవం తన వ్యూహాలను మార్చుకొంది, హిందూ ఆచార వ్యవహారాలను తనలో చొప్పించుకుని ఒక ముసుగుతో మన ముందుకొస్తుంది, చర్చిల  ముందు ధ్వజ స్థంబాలు, కాషాయ బట్టలతో ఫాదరీలు, పెళ్ళిలలో పసుపు పూసుకోవడం, తాళి కట్టడం లాంటివి ఆ వ్యుహలలో భాగమే, ఇలాంటి అంశాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి - మాన్య శ్రీ జుగల్ కిషోర్ శర్మ విహిప ధర్మ ప్రసార్ సమితి అఖిల భారత ప్రాముఖ్   

శ్రీకాకుళం, 06/04/2014 : తేది 04/05/2014 నాడు  శ్రీకాకుళం జిల్లా లోని సీతంపేట్, బుర్జా మండలాలకు సంబందించిన అనేక గ్రామాలలోని సుమారు 30 కుటుంబాకు చెందిన 138 మంది గతంలో క్రైస్తవులుగా మారిన హిందువులు తిరిగి తమ తల్లి ఒడి లాంటి హిందూ ధర్మంలోకి పునరాగమణ కార్యక్రమం ద్వారా తిరిగి వచ్చారు.శ్రీకాకుళం జిల్లా లో క్రైస్తవ మిషనరీల ప్రభావం గణనీయ స్థాయిలో ఉంది, ఆర్థిక, అంగ, అధికార బలాల సహాయంతో అక్కడ నివసిస్తున్న గిరిజనులను ప్రభావితం చేసి క్రైస్తవ మత వ్యాప్తికి వారిని ఉపయోగించుకోవడం అక్కడ సర్వ సాధారణంగా జరుగుతూ ఉంది, ఈ అంశాన్ని గ్రహించిన స్థానిక విశ్వ హిందూ పరిషద్ నాయకులు అనేక రోజులుగా స్థానికంగా ఉంటూ క్రైస్తవం స్వీకరించిన వారిని కలుస్తూ వారిలో వారు హిందుత్వాన్ని వీడి ఏం కోల్పోయారో తెలియజేయడానికి విస్తృతంగా చేసిన ప్రయత్నాలు ఈ విధంగా సఫలం అవుతున్నాయ్.
ఈ కార్యక్రమానికి విహిప అఖిల భారతీయ ధర్మ ప్రసార్ ప్రాముఖ్ మాన్య శ్రీ జుగల్ కిశోర్ జి మార్గదర్శనం చేస్తూ ' క్రైస్తవ మిషనరిల ప్రలోభాలకు, కుట్రలకు, మోసపూరిత మాటలకు వాగ్దానాలకు లోనై మతం మారిన అనేక మంది హిందువులు, మతం మారినప్పటికీ తమ నరనరాల్లో ఉన్న తమ పూర్వికుల రక్తం వారిని హిందుత్వం నుండి దూరం కాకుండా రక్షిస్తూ ఉంది, అనేక ఆచార - వ్యవహారాలలో హిందూ ధర్మం పద్దతిని వారు విడవడం లేదు, అలాంటి వారందరూ తిరిగి తమ మాతృధర్మం లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు, అలాంటి  వారిని సరైన మార్గదర్శనం తో ముందుకు నడిపించాల్సిన బాధ్యత మన అందరి పై ఉంది ' అని అన్నారు
యజ్ఞ కార్యక్రమంతో జరిగిన ఈ పునరాగమణ కార్యక్రమానికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి సుమారు 500 మంది హిందువులు హాజరయ్యారు, తిరిగి తమ అమ్మ ఒడికి చేరుకుంటున్న తమ సహోదరులను శ్రీ రాముని చిత్ర పటం బహుకరించి మనసారా ఆహ్వానించారు, కార్యక్రమం సాముహక భోజనాలతో పూర్తైంది. 
ఈ కార్యక్రమంలో మాన్య శ్రీ జుగల్ కిషోర్ గారితో పాటుగా, మాన్య శ్రీ గుమ్మల్ల సత్యం గారు , సవర సంప్రదాయానికి చెందిన గురువులు శ్రీ భీమన్న గారు, స్థానిక విశ్వ హిందూ పరిషద్ నాయకులు పాల్గొన్నారు. 

   
శ్రీకాకుళం : తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 138 మంది మతం మారిన హిందువులు Reviewed by JAGARANA on 9:26 AM Rating: 5

1 comment:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.