Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

మోడి నైతికతను విమర్శించే హక్కు నీతిలేని కాంగ్రెస్ పార్టికి లేదు - నిటి కథనం

నిటి కథనం, 15/04/2014 : భారత దేశంలో ఎన్నికల ప్రచారం అత్యున్నత శిఖరాగ్ర స్థాయిలో జరుగుతూ ఉంది, గుజరాత్ ముఖ్య మంత్రి శ్రీ నరేంద్ర భాయి మోడీ గత ఎన్నికల ప్రమాణ పత్రంలో ఆయన వైవాహిక స్థితి పట్ల ఉంచిన గోప్యత పై శ్రీమతి యశోద బెన్ గారిని భార్యగా గుర్తించక పోవడం పై అనేక ప్రశ్నలు చెలరేగుతున్నాయి.

కాంగ్రెస్ పార్టి మోడి నైతికతను లక్ష్యంగా చేసుకుని " తన జీవిత భాగస్వామిని గౌరవించని వారు - ఈ దేశం లోని మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తారు " అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతుంది.
నీతి నియమాలు, నైతిక పరిణతి లేని కాంగ్రెస్ పార్టీకి మోడీ నైతికను విమర్శించే హక్కు ఏమాత్రం లేదు, అసలు మహిళల రక్షణ అంశం పై మాట్లాడే కనీస హక్కును కాంగ్రెస్ పార్టీ ఏనాడో కోల్పోయింది, కాంగ్రెస్ పార్టి నాయకులు చేసిన కొన్ని " మహిళా రక్షణ " కార్యక్రమాల పై ఒక పరిశీలన చేద్దాం. 
సుషీల్ కుమార్ శర్మ ఒక యువజన కాంగ్రెస్ నాయకుడు , శాసన సభ్యుడు తన భార్య మరో కాంగ్రెస్ సభ్యునితో చనువుగా ఉంటుంది అనే అనుమానంతో సజీవ దహనం చేసి మృత శరీర భాగాలను, దగ్గరలోని నదిలో విసిరేసాడు.
మను శర్మ హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత కాంగ్రెస్ నాయకుడు  వినోద్ శర్మ కుమారుడు తనకు మందు సర్వ్ చేయని నేరానికి జెస్సికా లాల్ అనే అమ్మాయిని కాల్చి చంపాడు, ఆ అమ్మాయి కుటుంబం అనేక సంవత్సరాలు న్యాయం కోసం పోరాడిన ఫలితం లేకుండా పోయింది.
హర్యానా రాష్ట్ర మంత్రి లైంగిక వేదింపులను, హింసను తట్టుకోలేక గీతికా అనే టీనేజ్ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది ( ఇదీ కాంగ్రెస్ పార్టి మహిళా రక్షణను ఇచ్చే ప్రాధాన్యతకు ఒక ఉదాహరణ మాత్రమె )
కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ నారాయణ్ దత్ తివారి గవర్నర్ అధికారిక నివాసం  రాజ్ భవన్ లో చేసిన రాసలీలను ఎవరు మరచిపోగలరు, అనేక సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత రోహిత్ ను తన ద్వారా పుట్టిన కుమారుడిగా తివారి అంగీకరించడం మన అందరికి తెలిసిన ద్రుగ్విషయమే.
మహిపాల్ మదేన్ర రాజస్థాన్ కాంగ్రెస్ పార్టి మంత్రి  భాన్వారి దేవి ( ఇద్దరు పిల్లల తల్లి ) తో తన అక్రమ సంబంధం కల్గి ఉన్నవిషయాన్ని భాహీర్గ పర్చే విడియో నేపథ్యంలో ఆమెను హత్య చేయడం జరిగింది, ప్రస్తుత ఎన్నికలలో అతని భార్యకు కాంగ్రెస్ పార్టి లోకసభ టికెట్ ఇచ్చిన నిర్వాకం జగత్విదితమే.
ఒక మహిళా న్యాయవాది సెక్స్ టేప్ విడియో కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింగ్వి చాంబర్ లో లభించడం జరిగింది.
ముప్పై ఏళ్ల మహిళను వేదింపులకు గురిచేసిన కేసులో మాజీ ఉత్తర్ ఖండ్ మంత్రి హరాక్ సింగ్ రావత్ జైలు శిక్ష అనుభవించడం జరిగింది.
పై ఫోటోలో 50 సంవత్సరాల పూర్వం నెహ్రు & ఎద్విడ లతో పాటు మరో నలుగురు మహిళలు స్విమింగ్ పూల్ లో దూకడానికి సిద్ధంగా ఉన్న ఫోటో BBC ప్రచురించింది 

ఇవి కాంగ్రెస్ పార్టి నాయకులు " మహిళల పట్ల చూపిస్తున్న గౌరవ భావం " - " మహిళా రక్షణ కోసం చేసే పనిలో " కొన్ని ఉదాహరణలు మాత్రమె   
మూలం : నిటి సెంట్రల్   
Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article. 
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here  
మోడి నైతికతను విమర్శించే హక్కు నీతిలేని కాంగ్రెస్ పార్టికి లేదు - నిటి కథనం Reviewed by JAGARANA on 1:26 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.