భాగ్యనగర్ : 3.5 లక్షల మంది యువకులతో విజయవంతంగా భజరంగ్ దళ్ శ్రీ వీర్ హనుమాన్ విజయ యాత్ర
- 70 వేల బైక్ లతో దాదాపు 3.5 లక్షల మంది తో వియవంతం అయిన శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర
- గౌలిగూడ శ్రీ రామ మందిరం నుండి తాడ్ బండ్ హనుమాన్ మందిరం వరకు సాగిన బైక్ ర్యాలి
- కాషాయ మాయం అయిన భాగ్యనగరం, పూల జల్లులతో యాత్రకు ఆహ్వానం పలికిన ప్రజలు
- స్వచ్చందంగా ఆహరం, త్రాగు నీరు, మజ్జిగ అందించిన హనుమత్ భక్తులు
- యాత్ర కు మార్గదర్శనం చేసిన విహిప అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ చంపట్ రాయ్
భాగ్యనగర్ , 16/04/2014 : హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషద్ యువజన విభాగం భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగిన ద్విచక్ర వాహన ర్యాలి విజయవంతం అయ్యింది, దాదాపు 75 వేల ద్విచక్ర వాహనాలతో దాదాపు మూడు లక్షల మంది యువకుల జై శ్రీరాం , వందే మాతరం, భారత్ మాతా కి కై నినాదాల మధ్య కోలాహలంగా సాగింది.
యాత్ర దారి పొడవున ప్రజలు కొన్ని వందల చోట్ల పూజ జల్లులతో స్వాగతం పలికారు, ఎండ వేడిమికి అనేక చోట్ల శ్రీ రామ భక్తులు యువకులకు మజ్జిగా, చల్లని త్రాగు నీరు, బోజన వసతి ఏర్పాట్లు చేసారు.
శ్రీ వీర్ హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా నగరం మొత్తం భగవత్ ధ్వజాలతో కాషాయ మయం అయ్యింది, గౌలీగూడ శ్రీ రామ మందిరం నుండి ప్రారంభం అయిన యాత్ర దాదాపు 15 కిలోమీటర్లు సాగి ప్రఖ్యాత తాడ్ బండ్ హనుమాన్ మందిరం వరకు చేరిన తర్వాత యువకులు భక్తీ శ్రద్ధలతో హనుమాన్ ను దర్శిచుకున్నారు.తర్వాత ఇంపీరియల్ గార్డెన్స్ లో జరిగిన భహిరంగ సభలో విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ చంపత్ రాయ్ గారు పాల్గొని యువతకు మార్గదర్శనం చేసారు.
ఈ కార్యక్రమం లో శ్రీ రామ రాజు గారు , రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ గాళ్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి, శ్రీ కేశవరాజు గారు, రాష్ట్ర సంఘటన కార్యదర్శి, శ్రీ సుబాష్ చందర్ గారు భజరంగ్ దళ్ రాష్ట్ర సంయోజకులు, విహిప, భజరంగ్ దళ్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
భాగ్యనగర్ : 3.5 లక్షల మంది యువకులతో విజయవంతంగా భజరంగ్ దళ్ శ్రీ వీర్ హనుమాన్ విజయ యాత్ర
Reviewed by JAGARANA
on
10:26 AM
Rating:
No comments: