అనంతపురం : తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 8 కుటుంబాలు - శ్రీ సత్యం జి మార్గదర్శనం
అనంతపురం : హనుమాన్ జయంతి రోజున అనంతపురం జిల్లాలోని తానకల్లు మండలం తవలం గ్రామంలోని హనుమాన్ మందిరంలో జరిగిన పునరాగమనం కార్యక్రమంలో గతంలో క్రైస్తవులుగా మారిన ఎనిమిది కుటుంబాల నుండి 15 మంది సభ్యులు తిరిగి తమ మాతృధర్మమయిన హిందుత్వాన్ని తిరిగి స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరయిన శ్రీ గుమ్మాల సత్యం విశ్వ హిందూ పరిషద్ జాతీయ సహా కార్యదర్శి గారు మార్గదర్శనం చేస్తూ " అమ్మవోడిని విడిచి వెళ్ళిన పిల్లలు తిరిగి అమ్మ ఒడిలో స్వాంతన పొందుతున్న దృశ్యం నా కన్నల ముందు కదలాడుతూ ఉంది, నా హృదయం ఆనంద స్పందనలు కలిగిస్తున్నది, హిందుత్వాన్ని విడిచి వెళ్ళిన మీరు తిరిగి మీ స్వంత ఇంటికి రావడం చాలా ఆనందదాయకం, ప్రపంచంలో ఉన్న మంచి అంతా హిందుత్వంలోనే ఉంది, హిందుత్వంలో ఉన్న మంచి ప్రపంచమంతా ఉంది, ఈ సత్యాన్ని గ్రహించక మీ ఎక్కడికేక్కడికో వెళ్లారు, మీ హృదయాలను అడిగి చూడండి, హిందుత్వాని వీడి పొందిది ఏమి లేదు అని చెబుతుంది, ' స్వధర్మే నిధనం శ్రేహః పర ధర్మో భయావహ ' అన్న గీతాచార్యుడి బోదన గుర్తు పెట్టుకోండి, మీ అనుభవం మరికొందరికి మార్గదర్శనం అవుతుంది, ఆ దిశలో మనమందరం కలిసి పనిచేద్దామని ఆశిస్తున్నాను ' అని అన్నారు.
మందిర పూజారి శ్రీ రమణ గారి పూజా కార్యక్రమం అనంతరం స్వధర్మం స్వీకరించిన కుటుంబ సభ్యులకు భగవాన్ శ్రీ రాముడి ఫోటో, భగవద్గీత పుస్తకం, క్రొత్త వస్త్రాలతో సత్కరించడం జరిగింది, తర్వాత సాముహిక భోజనాలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చుట్టూ ప్రక్కల సుమారు 16 గ్రామాల నుండి ప్రజలు పాల్గొన్నారు.
అనంతపురం : తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 8 కుటుంబాలు - శ్రీ సత్యం జి మార్గదర్శనం
Reviewed by JAGARANA
on
8:46 AM
Rating:
Meeru muslims ni kuda hindu matgamuloki aahwaninchandi.
ReplyDelete