Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

"మతమెప్పుడు డబ్బా పాలవంటిదే, హిందూ ధర్మం తల్లిపాలవంటిది" ; కోరుట్ల హిందూ శంఖారావం లో స్వామి పరిపూర్ణనంద


  • హిందూ ధర్మ జాగృతి కై జనం లోకి వచ్చాను 
  • మతం డబ్బా పాలవంటిది , హిందూ ధర్మం తల్లి పాల వంటిది 
  • ఈ దేశం లో ఒక్క ఆవు కసాయివాని చేతుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు 
  • లౌకిక దేశం లో  సన్యాసి దేవాలయాన్ని దర్శించడానికి ఆటంకాల ?
  • కోరుట్ల హిందూ శంఖారావం లో  శ్రీశ్రీశ్రీ స్వామి పరిపూర్ణానంద     

30/09/2013 కరినగరం,కోరుట్ల: శ్రీ పీఠంలో కూర్చుని ఉండలేక, ప్రస్తుత దేశ పరిస్థితుల దృష్ట్యా హిందూ ధర్మ పరిరక్షణ, సమాజ జాగృతికే జనంలోకి వచ్చానని శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ అన్నారు. యుద్ధం చేయడం తన అభిమతం కాదని హిందూ ధర్మాన్ని విచ్ఛినం చేస్తున్న శక్తులను ఎదుర్కొనేందుకే జాతిని సన్నద్ధం చేయడమే తన పర్యటన లక్ష్యమని పునరుద్ఘటించారు. సోమవారం రాత్రి కోరుట్ల పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం లో నిర్వహించిన హిందూ శంఖారావానికి ఆయన హాజరై మాట్లాడారు.
హిందుత్వం ఒక మతం కాదని, అది ఓ ధర్మంగా అభివర్ణించారు. మతమెప్పుడు డబ్బా పాలవంటిదే, ధర్మం తల్లిపాలవంటిది. అలాంటి ధర్మానికి ప్రచారం అక్కర్లేదన్నారు. హిందూ ధర్మంలో సర్వ మతాలను సమాదరించే సహజలక్షణం ఇమిడి ఉందన్నారు. ఇతర మతాల్లో ఆ లక్ష ణం లోపించి హైందవ సంస్కృతిలో భేదాలను సృష్టిస్తున్నాయని, ఆలాంటి కలుపు మొక్కలను ఏరివేయడానికి హైందవులంతా ఐక్యమై ధర్మ పరిరక్షణకు పోరాడాలన్నారు.

భారతీయ సంస్కృతిలో ప్రతీ వస్తువును దైవంగా పూజించే తత్వముందని, మనిషిని దేవునిగా సంస్కరించే గుణా న్ని రాముడి చేతల్లో, కృష్ణుడి మాటల్లో ప్రదర్శించారని పేర్కొన్నారు. అలాంటి దైవాల్ని తులనాడుతున్న నాలుకలను శుద్ధి చేయడం కూడా తన పర్యటన లక్ష్యమన్నారు. దేశానికి ఆయువు పాయువు అయిన గోవులను వధిస్తూ, హైందవ దేవుళ్లను తులనాడుతూ వంద కోట్ల హిందువులను అడ్డంగా నరికేస్తామంటూ రంకెలేస్తున్న మతోన్మాదులకు హెచ్చరికలుగా హిందూ యువకులంతా ఐక్యమై బలనిరూపణ చేయాలన్నారు. వందకోట్ల హిందువులున్న ఈ భారతదేశంలో వివక్ష పూరిత రాజకీయం కొనసాగుతోందని, మక్కా, జెరుసలేంకు వెళ్లేందుకు రాయితీని కల్పించే ప్రభుత్వాలు ఒక హిందువు కాశీ వెళ్లడానికి రూపాయి రాయితీ కల్పించడం లేదన్నారు. బ్రహ్మోత్సవాలకు వెళితే అదనపు చార్జీలు వసూలు చేసే ఈ ప్రభుత్వాలకు లౌకికవాదం ఉందా అని ప్రశ్నించారు.

హిందువుకు బిందువైన నాయకులు రావాలి...
హైందవ ధర్మాన్ని కాపాడుతూ, సర్వ మతాలను సమాదరిస్తూ గోవధ లేని సమాజాన్ని నిర్మించగలిగే నాయకుల్ని తయారు చేయడం కోసం జనమంతా సిద్ధం కావాలని అన్నారు. అలాంటి నాయకుడు ఎలా ఏ మతంలోంచి వచ్చినా భారతీయ సంస్కృతిని పరిరక్షించే వాడైతే స్వాగతిస్తామని పేర్కొన్నా రు. తనకు ఏ పార్టీ ముఖ్యం కాదని, తాను పార్టీలకు చెందిన వాడను కాదని, హిందూ ధర్మ పరిరక్షణే తన సిద్ధాంతమన్నారు. ఇదికాకా భారతీయులంతా ఈ మట్టిని నమ్ముకొని జీవిస్తున్నారని, ఈ మట్టిలో కలిసిపోయే ముందు హిందూ ధర్మాన్ని తన వెంట తీసుకోవడమే కాక ఆ ధ ర్మాన్ని నిలబెట్టే ఒక్క వారసున్ని అయినా అం దించాలని, ఆ ప్రయత్నంలో ఒక్కో హిందు వూ నలుగురిని కన్నా ఇబ్బంది లేదని తెలిపారు.
ఇది నిజాం రాష్ట్రం కాదు... పక్కా తెలంగాణే...స్త్రీ, పురుష, ధన, మాన, ప్రాణాలు దోచుకొని అత్యంత హేయంగా ప్రవర్తించిన నిజాం కు ఈ తెలంగాణ జాగీరు కాదన్నారు. నిజాని కి తెలంగాణలో నిజాం అద్దెకున్నాడు తప్పితే అతినికి ఏ హక్కూ లేదన్నారు. ఇది అచ్చంగా తెలంగాణ రాష్ట్రమే తప్పా నిజాం రాష్ట్రం కాదని స్పష్టం చేశారు.
ఇది కరినగరి!శంకర భగవత్పాదులు ఈ దేశనికి, ప్ర పంచానికి తిండిపెట్టి పోషించే శక్తి ఉందన్న ట్లు... కరినగరి జిల్లాకు కూడా అంతటి శక్తి ఉందని, కనుక ఇది కరీంనగర్ కాకుండా కరినగరిగా స్వామిజీ అభివర్ణించారు. భవిష్యత్తులో అది శాశ్వతంగా కరినగిరిగానే స్థిరపడనుందని జోస్యం చెప్పారు.

దేశోద్ధారణకు నడుం బిగించాలి... డాక్టర్ అన్నదానం చిదంబరం శాస్త్రీ
హైందవ ధర్మ ప్రచారకులు డాక్టర్ అన్నదానం చిదంబరంశాస్త్రీ మాట్లాడుతూ దేశం లో పూజనీయమైనవి అవమానించబడుతుండడం వల్ల అశాంతి, అలజడులు ప్రజ్వరిల్లుతున్నాయన్నారు. ఐన్‌స్టీన్ వంటి శాస్త్రవేత్తలు భ గవద్గీతతో ప్రేరణ పొందిన వారేనని, గీతాసా రం గ్రహించి దేశోద్ధరణకు నడుం కట్టాలన్నారు.
హిందూ ధర్మానికి భంగం కలిగేది బయ ట నుంచి మాత్రమే కాదని, అంతర్గత శక్తులు కూడా పతనానికి కారణమవుతున్నాయని బాచంపల్లి సంతోష్‌కుమార్‌శర్మి అన్నారు. హైందవ దర్మ పరిరక్షణ వేదిక ఆద్వర్యంలో జరిగిన ఈ శంఖారావంలో సుమారు 20 వేల మంది జనం హాజరుకాగా ఎమ్మెల్యే కల్వకుం ట్ల విద్యాసాగర్‌రావు దంపతులతో పాటు బీజేపీ నేత సురభి భూమ్‌రావు, బీజేపీ కరీంనగర్ నగర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, విశ్వహిందూ పరిష త్, ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్, ఏబీవీపీ, యు వజన సంఘాలు, టీటీడీ ధర్మ ప్రచార సమితి, హిందూ ధర్మ ప్రచార సమితి, ఆహ్వాన కమిటీ నాయకులు మంచాల జగన్, ఇందూరి స త్యం, తిరుమల వాసు, తోకల రమేశ్, పెం డం గణేశ్, తనగుల రాజశేఖర్, కొత్త సురే శ్, గడ్డం మధు, రేగుల భూమానందం, గిన్నెల శ్రీకాంత్, శివకుమార్, రాజ్ గంగారాం పాల్గొన్నారు.

- Source: http://www.andhrajyothy.com/
"మతమెప్పుడు డబ్బా పాలవంటిదే, హిందూ ధర్మం తల్లిపాలవంటిది" ; కోరుట్ల హిందూ శంఖారావం లో స్వామి పరిపూర్ణనంద Reviewed by JAGARANA on 10:25 AM Rating: 5

1 comment:

  1. చాలా చక్కటి వార్తను ఉన్నది ఉన్నట్టుగా అందించారు ..... నేను కార్యక్రమం లో ఉన్నాను గనుక చెపుతున్నాను . కొనసాగించండి.

    ReplyDelete

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.