Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

విజయశ్రీ భవన్,కోఠి లో విహిప అర్చక పురోహిత సమ్మేళనం , పాల్గొన్న హెబ్బార్ నాగేశ్వర్ రావ్ గారు

భాగ్యనగర్ , కోఠి  29/09/2013 : విశ్వ హిందూ పరిషద్ పశ్చిమాంధ్ర ప్రాంత కార్యాలయం విజయ శ్రీ భవనం , కోఠి , భాగ్యనగర్ ( హైదరాబాద్ ) లో విహిప అర్చక పురోహిత విభాగం ప్రాంత స్థాయి కార్యకర్తల సమావేశం 29/09/2013 నాడు జరిగింది , ఈ సమావేశానికి మాన్య శ్రీ రామరాజు గారు విహిప ప్రాంత అధ్యక్షులు అధ్యక్షత వహించగా ,విహిప ప్రాంత ప్రచార ప్రాముఖ్ తుంగేడుగుంట హెబ్బార్ నాగేశ్వర్ రావ్ గారు ప్రధాన వక్తగా పాల్గొన్నారు .
రామరాజు గారు మార్గదర్శనం చేస్తూ ' వచ్చే సంవత్సరం విశ్వ హిందూ పరిషద్ స్వర్ణ జయంతి సందర్భంగా మనం ప్రతి ఇంటిని చేరగలగాలి , ప్రతి హిందువు మదిలో రాష్ట్ర భక్తీ , రామ భక్తీ నింపాల్సిఉంది , కేవలం హిందూ సంఘటన కార్యం మాత్రమె ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలపగల్గుతుంది, హిందువుల శ్ర్తద్డ కేంద్రాల ద్వారా సంస్కారం నిర్మాణం జరుగుతుంది , ఆ శ్రద్ద కేంద్రాల ప్రత్యక్ష నిర్వాహకులుగా ఈ దిశలో మనం చేయాల్సిన పని ఎంతో ఉంది , ఆ కార్యానికై మనం ఎక్కువ సమయం ఇచ్చి పనిచేయాల్సి ఉంది ' అని అన్నారు .

హెబ్బార్ నాగేశ్వర్ రావ్ గారు దిశానిర్దేశం చేస్తూ ' నేడు హిందుత్వం మందిరాల మాధ్యమం గానే నిలబడి ఉంది , అలాంటి మందిర నిర్వాహకులుగా అర్చకులు , పురోహితులు తరతరాలుగా హిందూ సమాజానికి ధర్మసంబంద విషయాలలో మార్గదర్శకులుగా ఉంటూ వస్తున్నారు , పురోహితుని కేంద్రంగా గుడి , ఆ గుడి కేంద్రంగా ఒక బడి , ఈ రెండింటి ఆధారంగా ఆదర్శ సమాజ నిర్మాణం ఇది హిందూ ఆరాధనా కేంద్రాల లక్షణం, లక్ష్యం . హిందూ కుటుంబ వ్యవస్థలో , హిందువుల వ్యక్తిత్వ వికాసం లో , ప్రపంచంలో లోని అన్ని మతాల లోకెల్లా హిందూ ధర్మాన్ని సర్వ శ్రేష్టంగా నిలపడం లో ఆలయాలు విశిష్ట పాత్రను నిర్వహించాయి , భారత స్వరాజ్య సంగ్రామం లో దేవాలయాలు యుద్ధ వీరుల శిక్షణ కెంద్రాలయ్యాయి , దేశ భక్తుల ఆవాసలయ్యాయి, ఆలాంటి మందిరం ద్వార తిరిగి ఒక సారి హిందూ ధర్మ జాగరణ , సంఘటన జరగాలి ' అని అన్నారు .
ఈ కార్యక్రమం లో విహిప ప్రాంత కార్యదర్శి మాధవరెడ్డి గారి గాల్ రెడ్డి గారు ప్రాంత కార్యదర్శి , ఆకారపు కేశవా రాజు గారు ప్రాంత సంఘటన కార్యదర్శి , యాదగిరి రావ్ గారు క్షేత్ర గో - రక్షా ప్రాముఖ్ తదితరులు పాల్గొన్నారు .           
విజయశ్రీ భవన్,కోఠి లో విహిప అర్చక పురోహిత సమ్మేళనం , పాల్గొన్న హెబ్బార్ నాగేశ్వర్ రావ్ గారు Reviewed by JAGARANA on 8:30 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.