తిరుపతిలో ఇస్లామిక్ విశ్వ విద్యాలయం - దేవాదాయ స్థలంలోనే ఏర్పాటు !
- చంద్ర గిరి సమీపంలో నిర్మాణ పనులు
- దేవాదాయ స్థలంలోనే ఏర్పాటు
- హిందూ ధార్మిక ప్రాంతంలో అన్యమతానికి చోటా?
- నిధుల సేకరణకు విదేశాల్లో ప్రచారం
- ఇది అంతర్జాతీయ కుట్ర,ప్రభుత్వ పాత్రా ఉంది
- మరెందుకు అడ్డుకోవడం లేదు : బీజేపీ
హైదరాబాద్, తిరుపతి, సెప్టెంబర్ 13 : ఏడుకొండల వాడి నిలయమైన తిరుపతి కొండల్లో అంతర్జాతీయ ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నారని, ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ కుట్రేనని బీజేపీ ఆరోపించింది. నౌహెరా షేక్ అనే మహిళ పేరిట గుట్టు చప్పుడు కాకుండా విశ్వవిద్యాలయ నిర్మాణ పనులు సాగుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ స్థలంలోనే దీన్ని నిర్మిస్తున్నారని, ప్రభుత్వానికి ఇదంతా తెలియకుండా జరుగుతుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. "తిరుమల కొండకు కాలి నడకన వెళ్లే చంద్రగిరి శ్రీవారి మెట్టు సమీపంలో "హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కాలేజీ'' పేరుతో అంతర్జాతీయ ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఉర్దూ అరబిక్ పాఠశాల, మదర్సా అని ప్రచారం చేస్తూ దీని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. నౌహెరా షేక్ చైర్మన్‌గా గల హీరా ఉర్దూ అరబిక్ డెవలప్‌మెంట్ సొసైటీ పేరిట దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేవాదాయ శాఖ స్థలంలో 2011 నుంచి దీని పనులు సాగుతున్నాయి. అంతేకాదు.. ఇదే సొసైటీ పేరిట విశ్వ విద్యాలయ స్థలంలో కాలేజీని, మదర్సాను, అరబిక్ ఉర్దూ పాఠశాలను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. వీటన్నింటినీ వెబ్‌సైట్‌లో ఘనా, చైనా, కెనడా వంటి దేశాల్లో ప్రచారం సాగిస్తున్నారు. తిరుపతిలో పెట్టామని చెబుతూ విదేశాల నుంచి నిధులు, వనరులు రాబడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తిరుపతిలో పుట్టిన నౌహెరా షేక్ పేరును ఈ కార్యకలాపాలకు పూర్తిగా వినియోగించుకుంటున్నట్లు అవగతమవుతుంది'' అని ఎన్వీఎస్ఎస్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌రెడ్డి, నేతలు సామంచి శ్రీనివాస్, మధుసూదన్, నాగేశ్వర్‌రావు తిరుపతిలో డిమాండ్ చేశారు. విద్యార్థినుల ముసుగులో తిరుమల-తిరుపతిలోకి అసాంఘిక శక్తులు ప్రవేశించి విధ్వంసం చేసే అవకాశం ఉందన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు.
ఇంతకీ ఏం జరుగుతోంది?
తిరుపతికి పది కిలోమీటర్ల సమీపంలో చంద్రగిరి మండలం, తొండవాడ వద్ద హీరా అంతర్జాతీయ ఇస్లామిక్ కాలేజీ పేరుతో 1.09 ఎకరాల విస్తీర్ణంలో ఆరు అంతస్థుల భారీ భవనాన్ని నిర్మించారు. చుట్టూ 12 అడుగలు ఎతైన ప్రహరీ గోడ నిర్మించారు. భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. భవన నిర్మాణానికి తుడ అనుమతి కూడా తీసుకున్నారు. ముస్లిం మహిళలకు స్వయం ఉపాధి కోర్సులతో పాటు, ఇస్లాం మత బోధనల కోసమే ఈ కళాశాలను స్థాపిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
దీని వ్యవస్థాపకురాలు నౌహీర్ చాలా ఏళ్లుగా రేణిగుంట సమీపంలో మదర్సాను నడుపుతున్నారు. గతంలో ఆమె ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. అక్కడి పరిచయాలతోనే ఇస్లామిక్ విద్యా సంస్థను ప్రారంభిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, ఈ సంస్థ పేరుతో ఉన్న హీరాఐబీజీ.కామ్‌లోని వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చైనా సహా ఐదు దేశాల్లో ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. వీటి వార్షికోత్సవాలు, షేర్ హోల్డర్ల సమావేశాలన్నీ ముంబై కేంద్రంగా జరుగుతున్నట్లు వైబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
Heera Business Gruops : http://heeraibg.com/heeraibg/
Heera International Islamic School : http://heeraiisg.com/index.php
Heera International islamic Collage : http://heerauniversity.com/
ఆంధ్రజ్యోతి దిన పత్రిక సౌజన్యం తో
తిరుపతిలో ఇస్లామిక్ విశ్వ విద్యాలయం - దేవాదాయ స్థలంలోనే ఏర్పాటు !
Reviewed by JAGARANA
on
9:32 AM
Rating:
WHY THE TTD NOT RESPONDED. WHY TTD VIGILENCE NOT TAKEN ANY ACTION. BECAUSE IN THE TTD OFFICIALS AND BOARD IS POLLUTED. THEY ARE NOT OBEDIENCE OF LORD VENKATESWARA. GOVIDA ... GOVIDAA
ReplyDelete