Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

అనుమతులు లేకుండానే ఐదు అంతస్తులు - తిరుపతిలో ఇస్లామిక్ వర్శిటీ నిర్వాకం - 1

  • కాలేజీకి అనుమతి .. కావాల్సిందల్లా వర్సిటికే 
  • కాలేజి కి జి ప్లేస్ బహుళ అంతస్థుల ?
నిర్మాణంలో ఉన్న ఇస్లామిక్ కళాశాల భవనం
తిరుపతి, సెప్టెంబర్ 19: చిత్తూరు జిల్లాలో తిరుమల శ్రీవారి పాదాల చెంత చంద్రగిరి మండల పరిధిలో హీరా అంతర్జాతీయ వ్యాపార సంస్థ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడానికి చేపడుతున్న భవన నిర్మాణాల వ్యవహారం రోజురోజుకు వివాదస్పదం అవుతోంది. నిర్మాణం చేపడుతున్న స్థలంలో కొంత మేర ఆక్రమించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండగా ఆ స్థలం మొత్తం తమదేనని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ప్రయివేటు సంస్థ వర్శిటీ ఏర్పాటు చెయ్యాలన్న అవసరం ఏమున్నదన్న ప్రశ్న తలెత్తుతోంది. అందులోనూ ఒక మతానికి చెందిన విద్యార్థునులకు మాత్రమే ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మతపరమైన అంశాలు తెరపైకి వచ్చే ప్రమాదం ఉందని విశే్లకులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతి, తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలకు ఉగ్రవాదుల ముప్పు వుందని కేంద్ర నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇస్లామిక్ వర్శిటీ ఏర్పాటు ఏ మేరకు సమర్ధనీయం అన్నది స్థానికుల ప్రశ్న. కాగా హీరా సంస్థ చేపడుతున్న భవన నిర్మాణాలకు తుడా నుండి జి + 1 అనుమతి ఉండగా జి + 6 అంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నారు. జి + 1కి తుడా అనుమతి పొందిన నిర్వాహకులు ఆరంతస్తుల భవనాన్ని నిర్మించారన్నది ప్రశ్న. ప్రభుత్వ లోసుగులను అసరాగా చేసుకుని గత ఏడాది అక్టోబర్‌లో బిపిఎస్ ( బిల్డింగ్ ఫీనలైజేషన్ స్కీమ్) కింద 2, 3, 4, 5 అంతస్థులను క్రమబద్దీకరించుకునేందుకు తుడాకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. తుడా ఇందుకు అంగీకరించి వారి నుండి ఎలాంటి రుసుములు వసూలు చేసిన దాఖలాలు లేవు. దరఖాస్తు చేసుకుంటే అనుమతి వచ్చినట్లేనన్న తీరులో నిర్వాహకులు భావించి తమకు తుడా అనుమతులున్నాయని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇక ఆరో అంతస్థుల్లో రేకుల షెడ్లు వేసి ఉన్నాయి. దీన్ని గమనించిన పంచాయతీ కార్యదర్శి మోతీ బుధవారం భవనాలను పరిశీలించారు. అనుమతి లేని అరవ అంతస్తును తొలగించాలని ఆదేశించారు. అధికారికంగా నోటీసులు ఇవ్వనున్నారు. ఇదిలా వుండగా తొండవాడ సమీపం జాతీయ రహదారికి పక్కనే అనుమతులు లేకుండా ఇంత పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల సముదాయాన్ని నిర్మిస్తుంటే తుడా అధికారులుకాని, స్థానిక పంచాయతీ అధికారులు కాని ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ముడుపులు చేతులు మారడం వల్లే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. అయితే తాము కళాశాల ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వ అనుమతులున్నాయని, విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనుమతికోసం దరఖాస్తు చేసుకున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల అనుమతులు రావడంతలో ఆలస్యమవుతోందని అన్నారు. కాలేజీ ఏర్పాటుకు అనుమతి వున్నా కూడా ఆరు బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు అవసరమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. పేద విద్యార్థులకు విద్యాబోధన చెయ్యాలంటే కావలసిందల్లా నిష్ణాతులైన అధ్యాపకులు, వౌలిక సదుపాయాలు వుంటే సరిపోతుంది కదా? అన్నది మరో వాదన. అలా కాకుండా స్టార్ హోటల్స్‌ను తలపించేవిధంగా సెంట్రలైజ్డ్ ఏసితో భవన నిర్మాణాలను చేపట్టాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నిస్తున్నారు. ముస్లిం పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ తరహాలో ఉచిత బోధన, వౌలిక సదుపాయాలు కల్పించి తమ ట్రస్టు చేస్తున్న సేవాభావాలను ఇతరులకు మార్గదర్శకం చెయ్యాలన్న నిర్వాహకుల వాదనలో నిజం ఎంతో ఆ భగవంతుడికే తెలియాలి. నిర్మాణాల తీరుపై తాము అభ్యంతరాలు వ్యక్తం చేశామని, తుడా, పంచాయతీ అధికారులు చెపుతున్నమాటల్లోనూ, సేవాభావంతో విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు చెపుతున్నమాటల్లోనూ నిజం ఎంతో...

అనుమతులు లేకుండానే ఐదు అంతస్తులు - తిరుపతిలో ఇస్లామిక్ వర్శిటీ నిర్వాకం - 1 Reviewed by JAGARANA on 11:22 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.