Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

భూకబ్జాకూ బరితెగించారు! - తిరుపతిలో ఇస్లామిక్ వర్శిటీ నిర్వాకం - 2

చంద్రగిరి సమీపంలోని తొండవాడ వద్ద హీరా సంస్థ
ఏర్పాటు చేసిన ఇస్లామిక్ కాలేజ్ సూచిక బోర్డు, 
తిరుపతి, సెప్టెంబర్ 20: అనుమతి లేకుండా ఐదంతస్థుల భవనాన్ని శరవేగంగా పూర్తిచేస్తున్న హీరా ఇంటర్నేషనల్, భూకబ్జాకు కూడా పాల్పడిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల శ్రీవారి పాదాలచెంత చంద్రగిరి మండల పరిధిలో హీరా అంతర్జాతీయ వ్యాపార సంస్థ చేపట్టిన నిర్మాణాల్లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్న వాదనకు బలం చేకూర్చే అంశాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. అసలు హీరా సంస్థకు ఉన్న సొంత స్థలమెంత? భవన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందా? అన్న అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే..
హీరా ఇంటర్నేషనల్ సంస్థ తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలోనూ, శ్రీనివాసమంగాపురంలో వెలసివున్న శ్రీకల్యాణ వెంకన్న ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కన ఆరు అంతస్థుల భవనాలు నిర్మిస్తోంది. ఇందుకు హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ అరబిక్ కళాశాల పేరిట బోర్డులు సైతం వెలిశాయి. అయితే, ఇక్కడ చేపడుతోన్న నిర్మాణాలకు సంబంధించి హీరా సంస్థ ప్రభుత్వ స్థలాన్ని కొంత కబ్జా చేసిందన్న ప్రచారం వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని నిర్వాహకులు కొట్టిపారేస్తున్నారు. కిట్టనివాళ్లు వ్యక్తం చేస్తున్న అనుమానాలే తప్ప అందులో వాస్తవం లేదని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే తొండవాడ లెక్కదాఖలు సర్వే నెంబర్ 4-2ఎ/13లోని 1.9 ఎకరాలు, సమ్మకాల్వ పక్కనున్న సర్వే నెంబర్ 34లో 1.25 ఎకరాల స్థలంలో కేవలం 55 సెంట్లు రెవెన్యూ పట్టా పొందడంతో హీరా ట్రస్టు పరిధిలో ఉంది. 1.9 ఎకరాల స్థలాన్ని తిరుపతికి చెందిన అన్వర్‌బాషా నుంచి 2007లో హీరా సంస్థ కొనుగోలు చేసింది. ఈ స్థలాన్ని చంద్రగిరికి చెందిన టిజి వెంకట్రామనాయుడు అనే వ్యక్తినుంచి అన్వర్‌బాషా కొనుగొలు చేసినట్టు రికార్డులు చెపుతున్నాయి. సర్వే నెంబర్ 35లోనూ హీరా సంస్థకు ఎకరా స్థలం వుంది. దీంతో 3.45 ఎకరాల భూమి ప్రస్తుతం హీరా సంస్థ ఆధీనంలో ఉంది. మిగతా 70 సెంట్ల రామచిలుక కాల్వ భూమి ఖాళీ ఉన్నప్పటికీ, ఆ స్థలం కూడా తమకు కావాలని హీరా సంస్థ రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకుని అనుమతి కోసం ఎదురు చూస్తోంది. తమ పట్టా స్థలానికి పక్కనున్న కాల్వ పొరంబోకు స్థలం తమకే ఇవ్వాలి తప్ప మరొకరి ఇవ్వడానికి అవకాశాలు ఉండవన్నది హీరా సంస్థ వాదన. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో అంశం ఏమిటంటే, ఆ స్థలంపై ఎలాంటి అనుమతి రాకముందే, దాన్ని తమ పరిధిలోకి తీసుకోవడానికి కొంత నిర్మాణ పనులు చేపట్టారు. రెవెన్యూ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో యథాతథంగా విడిచిపెట్టారు. ఇదిలావుంటే ప్రభుత్వం హీరా సంస్థకు కళాశాల ఏర్పాటు చేసుకోవడానికి తొండవాడలో అనుమతి ఇచ్చివుంటే ఇంటర్‌బోర్డు, ఉన్నత విద్యామండలి తక్షణం అధికారికంగా ప్రకటన చెయ్యాలని బిజెపి నేతలు భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఏ నిబంధనల మేరకు అనుమతించారో కూడా తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.
అనుమతులు ఏమేరకు ఎవరిచ్చారు?
హీరా సంస్థ నిర్మిస్తున్న భవనాలకు తుడా జి+1కు అనుమతులిచ్చింది. అయితే నిబంధలను ఉల్లంఘించి జి+6 నిర్మాణాలను హీరా సంస్థ చేపడుతోంది. గత ఏడాది అక్టోబర్‌లో జి+5కు బిపిఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) కింద తుడా అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంతవరకూ తుడా అనుమతి ఇవ్వలేదు. నిర్వాహకులు మాత్రం తమకు తుడా అనుమతి ఉన్నట్టు చెపుతున్నారు. నిబంధనలను ఉల్లఘించి నిర్మిస్తున్న నిర్మాణాలపై అభ్యంతరం వ్యక్తం చేశామని చెప్పుకోవడానికి అన్నట్టు తుడా, పంచాయతీ అధికార్లు శ్రీముఖాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఎంతవరకూ సబబన్నది ప్రశ్న. సామాన్యులు అయితే నిబంధనలు ఉల్లంఘించి చిన్న కట్టడాలు కట్టినా నిర్ధాక్ష్యణంగా కూలగొట్టడానికి వెనుకాడని అధికారులు, హీరాపట్ల అంత ప్రేమ ఎందుకు కనబరుస్తున్నారో ఎవ్వరికీ అర్థంగావడం లేదు. తుడా నోటీసులు ఇచ్చినా అప్పటి పంచాయతీ కార్యదర్శిగా రామచంద్రయ్య తుడా నోటీసులను బేఖాతరు చేశారు. ఇక పంచాయతీ మద్దతు పరోక్షంగా లభించడంతో హీరా సంస్థ యుద్ధప్రాతిపతికన నిర్మాణ పనులు పూర్తి చేసే పనిలో పడింది. 2012లో పంచాయతీ కార్యదర్శిగా ఉన్న నస్రీనాబేగం ఎక్కడ ఈ వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందోనన్న భయంతో హీరా సంస్థకు నోటీసులు జారీ చేశారు. నిర్వాహకులు ఆమె ఇచ్చిన నోటీసులను భేఖాతరు చేశారు. అటు తరువాత పంచాయతీ, తుడా అధికారులు దీన్ని పట్టించుకోవడం మానేశారు. ఇందుకు కారణం పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయన్న ప్రచారం సాగింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మీడియాలో రావడంతో గత మూడు నెలల క్రితం తొండవాడ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మోతీ మరోమారు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే హీరా ఇంటర్నేషనల్ నిర్వాహకులు మాత్రం తాము ట్రస్టు ద్వారా చేపడుతున్న కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారం కచ్చితంగా ఉంటుందనే ధీమాతో పనులు మాత్రం యుద్ధప్రాతిపదికన జరుపుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న విధంగానే పనులు జరిగితే వచ్చే విద్యా సంవత్సరానికి హీరా ఇంటర్నేషనల్ కళాశాల తరగతులు ప్రారంభం కావడం ఖాయం. ఇంకా నిర్వాహకులు అనుకున్నట్టుగా వర్శిటికి అనుమతులు ఇస్తే ఏకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు తథ్యం. ఇదిలావుంటే ఊహించని రీతిలో హీరా విద్యాసంస్థల వ్యవహారం మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో స్థానిక పంచాయతీ అధికారుల్లో గుబులు పుడుతోంది. ఇది ఎటు తిరిగి ఎవరి పుట్టి ముంచుతుందోఅన్న భయం అందరిలో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం హీరా సంస్థ సిఇఓ షేక్ నోవెరా తండ్రి షేక్ ననే్నసాహేబ్ (లేట్) తిరుపతి అర్బన్ మండలం తిరుపతి టౌన్, రేణిగుంట రోడ్డు శ్రీనివాసపురం పోస్టల్ కాలనీలో కేఎన్ ఫ్లాజా ఇంటి నెంబర్ 19-3-1-బి 14లో నివాసం ఉండేవారు. ప్రస్తుతం అక్కడ మద్రాసా యే నిస్వాన్ ఇషా అతుల్ ఇస్లాం ఉర్దూ అండ్ అరబిక్ డెవలప్‌మెంట్ సొసైటీని 2004లో రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం ఆ సొసైటీకి షేక్ నోవెరా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఏదేమైనా ఇస్లామిక్ కళాశాల భవన నిర్మాణాల వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోందా? అన్నదే సర్వత్రా చర్చ.
భూకబ్జాకూ బరితెగించారు! - తిరుపతిలో ఇస్లామిక్ వర్శిటీ నిర్వాకం - 2 Reviewed by JAGARANA on 7:19 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.