దేశ ఆర్థికాభివృద్ధికి గోవే ఆధారం - కర్నూల్ ' గో - సేవకుల ' సమ్మేళనం లో శ్రీ యాదగిరి రావు
కర్నూల్ : శ్రీ అవధూత రామిరెడ్డి తాత గోశాల ఆధ్వర్యంలో తేది 18/08/2013 నాడు కర్నూల్ పట్టణం లోని శ్రీ లలిత కళా సమితి ప్రాంగణం లో మొట్ట మొదటి " గో - సేవకుల సమ్మేళనం " ' గో సేవే - గోవిందుని సేవ ' అని చాటుతూ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 మంది ' గో సేవకులు ' ఈ సమ్మేళనం లో పాల్గొన్నారు . సమ్మెలన ప్రారంభం లో స్వామీ మనోహర్ దాస్ ( ఇస్కాన్ ) గారు ఆశి: ప్రసంగం చేస్తూ " సకల దేవి దేవత స్వరూపమయిన గోమాత సేవే పరమోత్తతమం ఇలాంటి మహత్కార్యానికి ఆ పరమేశ్వరుడు మనల్ని ఎన్నుకోవడం మన పూర్వ జన్మ సుకృతం , ఈ బాధ్యతను మనం సమర్పణ భావం తో నిర్వర్తించాలి , ఆ దిశలో మనకు కావాల్సిన శక్తి - సామార్థ్యాలు , ఆత్మా స్థైర్యం ఆ సర్వ శక్తి వంతుడైన పరమాత్ముడు అందిచాలని ప్రార్థిస్తున్నాను " అని అన్నారు .
ఈ సమ్మేళనానికి ముఖ్య వక్త గా హాజరయిన మాన్య శ్రీ టి యాదగిరి రావు గారు ( విశ్వ హిందూ పరిషద్ - దక్షిణ మధ్య క్షేత్ర గో రక్షా విభాగం ప్రాముఖ్ ) దేశ ఆర్థికాభివృద్ధిలో గోవు ప్రాముఖ్యతను వివరిస్తూ " భారత దేశం ఒక్కప్పుడు అన్నపూర్ణ గా , రత్నగర్భ గా ప్రపంచంలో అత్యంత ధనిక తులతూగింది , మరి నేడు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు కోసం క్యులో మొదటి స్థానం లో ఉంది , మన ఆర్ధిక వ్యవస్థ ఇలా కావడానికి ఒకే ఒక్క కారణం గో మాతను నిర్లక్షం చేయడమే , మన దేశాన్ని తిరిగి విశ్వలో ప్రభలమయిన ఆర్ధిక శక్తి గా మారే అవకాశం కేవలం గో వంశ అభివృద్ధి పైనే ఆధారపడి ఉంది, ఈ దిశలో కేవలం వ్యాపారాత్మకంగానే ఆలోచించే మన కుహన ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయన్న నమ్మకం నాకు లేదు, కాబట్టి మనమందరం మన నిత్య జీవనంలో కేవలం గో - సంబంద ఉత్పత్తులనే వాడాలి తద్వారా గోవుల విలువ పెరుగుంటుంది , గోవులను పాలించే వారు ఆర్థికంగా బాగు పడతారు ఎక్కువ సంఖ్యలో ఆవులను పోషిచండానికి స్పూర్తి లభిస్తుంది, భారత దేశం లో గో వంశం తిరిగి అభివృద్ధి చెందుతుంది , మనం మన భారత మాతను తిరిగి స్వర్ణ సింహాసనం పై విరాజిల్లుతూ చూడగాల్గుతాం , ఆదిశలో మనం కలసి నడుస్తూ మన తోటి వారిని అడుగులో అడుగు వేసి నడిపిద్దాం జై గో మాతా " అంటూ సాగిన ప్రసంగం ' గో సేవకుల ' మదిలో బలమైన సంకల్ప శక్తిని నింపి గో సంరక్షణ మార్గం లో ప్రయాణించడానికి నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది . కార్యక్రమం శ్రీ నాగిరెడ్డి సాయిరెడ్డి గారి వందన సమర్పణ తో ముగిసింది
ఈ కార్యక్రమంలో విహిప జిల్లా పదాదికారులు , శ్రీ అవదూత రామిరెడ్డి తాత గోశాల సంరక్షకులు , మొదగుయిన వారు పాల్గొన్నారు , అనేక గో సంబంద ఉత్పత్తుల పదర్శన ఆక్కట్టుకుంది .
దేశ ఆర్థికాభివృద్ధికి గోవే ఆధారం - కర్నూల్ ' గో - సేవకుల ' సమ్మేళనం లో శ్రీ యాదగిరి రావు
Reviewed by JAGARANA
on
9:34 AM
Rating:
No comments: