కరీనగర్ జిల్లా ఎర్దండి లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రవిష్కరణ
కరీనగర్ జిల్లా , ఎర్దండి : కరీనగర్ జిల్లా , వీర పట్టణం మండలం , ఎర్దండి గ్రామం లో తేది 20/08/2013 నాడు గ్రామంలోని డైనమిక్ యుత్ యువజన సంఘం ఆధ్వర్యంలో మాన్య శ్రీ ఆకారపు కేశవరాజు ( ప్రాంత సంఘటన మంత్రి విహిప ) గారి చేతుల మీదుగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది .
విగ్రహావిష్కరణ అనతరం కేశవరాజు గారు శివాజీ మహారాజ్ జీవనాన్ని నేటి సమస్యల పరిష్కారానికి అన్వయిస్తూ ' మన భారత దేశం ప్రపంచానికే ఆదర్శవంత మైనదేశం , పాముకు కుడా పాలుపోసి పెంచే తత్వం , ప్రతి చెట్టు చేమా , రాయి రాప్పలలో , సకల జీవులలోను ఆ పరమాత్ముడిని దర్శించే సంస్కారం కేవలం హిందువుల సొంతం , ఇలాంటి సంస్కారం మనదేశం లో ప్రతి మాతృమూర్తి తన పిల్లలకి ఉగ్గు పాలతో నేర్పిస్తుంది అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ కి కుడా తన తల్లి జిజియా బాయి చిన్న తనం నుండే రామాయణ , భారత , భాగవత ఇతిహాసాలను నేర్పింది , తన మాతృదేశం కోసం, స్వధర్మం కోసం ప్రాణాలను సైతం అర్పించిన అనేయ మంది పురాణ పురుషుల , వీర హైందవ యోధుల కథా-కథనాలను నేర్పిస్తూ పెంచింది , నేడు మన పిల్లలకు ఈ విధమైన సంస్కారం అందించాలి అది అనేక మానసిక వైకల్యలకు పరిష్కారం కాగలదు , తన గురువు దాదాజీ కొండదేవ్ శిక్షణ లో శివాజీ మహారాజ్ అన్ని అస్త్ర ప్రయోగాలలో సిద్ధ హస్తుదయ్యాడు , కేవలం 13 సంవత్సరాల వయస్సు లోనే తన స్నేహితులతో కలసి అప్పటి బలమైన మొఘల్ సామ్రాజ్యం ఆధీనంలో ఉన్న తోరణ దుర్గాన్ని వీరోచితంగా పోరాడి గెలిచాడు , అఖండ హైందవ సామ్రాజ్య స్థాపనలో అది తోలి మెట్టు , ఎప్పుడు విజయమే అంతిమ లక్ష్యం గా పనిచేయాలని , ఆ క్రమంలో మనస్సు నియంత్రణ కోల్పోకూడదు అన్న వ్యక్తిత్వ వికాస సూత్రానికి శివాజీ మహారాజ్ జీవనం ఒక మహత్తర ఉదాహరణ , శివాజీ అంతిమ లక్ష్యం ' విశాల హైందవ సామ్రాజ్య స్థాపన - విధర్మియుల చేర నుండి భారతాంభ విముక్తి ' ఆ దిశలో శివాజీ మహారాజ్ ఓటములను, అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది , అయిన ఎప్పుడు చలించలేదు , తన మనస్సు పై నియంత్రణ కోల్పోలేదు , చివరికి తను ఎంతగానో పూజించే తుల్జ భవాని మందిరం ద్వంసం అయిన క్రోదం తో ' విజయమో - వీర స్వర్గమో' అని పోరాడలేదు కేవలం విజయమే కావాలని తపించి అంతిమ విజయం సాధించాడు , అలాంటి మహా వీరుడిని మన దేశ విద్యా వ్యవస్థ పిల్లలకు అనించడం లేదు , పిరికిపందలా వెన్ను చూపిన విదేశియులను వీరులుగా చూపిస్తున్నారు , శివాజీ మహారాజ్ పూర్తీ జీవితాన్ని పాట్య పుస్తకాలలో చేర్చాలి' చేసిన ప్రసంగం గ్రామా ప్రజల మనస్సుకు హద్దుకుంది
ఈ కార్యక్రమానికి చుట్టూ ప్రక్కల 20 గ్రామాల సర్పంచులు , వార్డు సభ్యులు , గ్రామ ప్రజలు , ఎర్దండి గ్రామ సర్పంచ్ దాసరి చిన్న రాజవ్వ రాజన్న గారు , గంగ నర్సయ్య గారు , గోల్కొండ నాగరాజు గారు , నిరంజన్ గారు , మహేష్, రంజిత్, రాజేష్, భుచ్చన్నా, రవి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు
కరీనగర్ జిల్లా ఎర్దండి లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రవిష్కరణ
Reviewed by JAGARANA
on
10:33 AM
Rating:
No comments: