Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

"అయోధ్య పరిక్రమ కేవలం సాధువుల ధార్మిక యాత్ర మాత్రమె ! ఆందోళన కార్యక్రమం కాదు" - శాంతికై విశ్వ హిందు పరిషద్ విజ్ఞప్తి


  • ' అయోధ్య 84 కోసి పరిక్రమ యాత్ర కేవలం సాధువుల ధార్మిక పాదయాత్ర మాత్రమె , నిరసన లేదా రాజకీయ కార్యక్రమం కాదు' - స్పష్టం చేసిన విశ్వ హిందూ పరిషద్ 
  • ' అయోధ్య లో శాంతియుత వాతారణాన్ని కల్పించండి , ధర్మాచార్యులను అగౌరవపరచకండి' - మాన్య డా . ప్రవీణ్ తొగాడియా విజ్ఞప్తి   
ఫైల్ ఫోటో 

న్యు డిల్లి , 24/08/2013 : దేశం లోని ప్రముఖ ధర్మాచార్యుల ద్వారా నిర్వహించబడుతున్న ' అయోధ్య జి  84 కోసి పరిక్రమ యాత్ర ' ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిషేదించడం పై విశ్వ హిందూ పరిషద్ తీవ్ర అసంతృప్తిని , వేదనను వ్యక్తం చేసింది . ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ కార్యదక్షులు మాన్య డా తొగాడియా యాత్ర స్వభావాన్ని వివరిస్తూ ' ఇది కేవలం దేశం లోని ప్రముఖ ధర్మాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ధార్మిక పాదయాత్ర మాత్రమె , ఇందులో ఎలాంటి వివాదాస్పద అంశాలకు తావు లేదు , కాని ఆశ్చర్యకరంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ యాత్రను నిషేదించడం , 144 సెక్షన్ ను విధించడం సహేతుకంగా లేదు , ఇప్పటికే 100 మందికి పైగా ధర్మాచార్యులను , అనేక మంది విశ్వ హిందూ పరిషద్ కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది. దీని పట్ల విహిప తీవ్ర దిద్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది , నేను మాన్య అఖిలేష్ యాదవ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి హిందువుల మనోభావాలను గౌరవించండి , అరెస్టైన సాదు సంతులను అగౌరవపరిచే చర్యలు మానుకోండి ' అని అన్నారు. అందులోని అంశాలు క్రింది విధంగా ఉన్నాయి .

  1.  అయోధ్యాజి 84 కోసి పరిక్రమ యాత్ర  ప్రసార మధ్యమాలోని కొంత భాగం మరియు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చుపుతున్నట్ల్టుగా రాజకీయ కార్యక్రమమో లేదా నిరసన కార్యక్రమమో కాదు , ధర్మాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాంస్కృతిక పాద యాత్ర మాత్రమె .
  2. తేది 25 ఆగస్టు 2013 ప్రారంభమై తేది 15 సెప్టెంబర్ 2013 తో ముగిసే ఈ యాత్ర లో ప్రతి రోజు కేవలం 150 - 200 మంది సాధువులు , ధర్మాచార్యులు మాత్రమె పరిక్రమ యాత్ర కేంద్రాల వద్ద పాల్గొంటారు ..
  3. నియమిత సంఖ్యలో ధర్మాచార్యులు పాల్గొంటూ నిర్వహించబడుతున్న ధార్మిక పరిక్రమ యాత్ర పట్ల ప్రభుత్వం చూపుతున్న భీతికి కారణం లేదు .
Source : www.samvada.org

  
"అయోధ్య పరిక్రమ కేవలం సాధువుల ధార్మిక యాత్ర మాత్రమె ! ఆందోళన కార్యక్రమం కాదు" - శాంతికై విశ్వ హిందు పరిషద్ విజ్ఞప్తి Reviewed by JAGARANA on 11:25 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.