విశ్వ హిందు పరిషద్ 84 - కోసి అయోధ్య పరిక్రమ యాత్ర నేపధ్యంలో వేడెక్కుతున్న ‘అయోధ్య’
- మాన్య అశోక్ సింఘాల్ జి గృహ నిర్భందం
- 70 మంది పదదికారుల పై వారెంట్లు జారి
- ఎక్కడిక్కడ నిర్భందాలు , అరెస్టులు
- పార మిలటరీ దళాలతో భద్రత కట్టుదిట్టం
లక్నో, ఆగస్టు 23: ఈ నెల 25నుంచి అయోధ్యకు యాత్రను జరిపి తీరాలన్న పట్టుదలతో విశ్వ హిందూపరిషత్ ఉండడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ యాత్రకు వెళ్లే వారికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడంలో పొరుగు రాష్ట్రాల సాయాన్ని కోరడంతో పాటుగా విహెచ్‌పికి చెందిన 70 మంది అగ్ర నేతల అరెస్టుకు వారంట్లను సైతం జారీ చేసింది. ఈ జాబితాలో విహెచ్‌పి జాతీయ నాయకులు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియా, రామ్ విలాస్ వేదాంతి లాంటి వారున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆగస్టు 25న విహెచ్‌పి ప్రతిపాదిత 84 కోశి యాత్ర దృష్ట్యా ఇంటెలిజన్స్ సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని పొరుగు రాష్ట్రాలను కోరడం జరిగిందని రాష్ట్ర పోలీసు శాంతిభద్రతల విభాగం ఐజి ఆర్‌కె విశ్వకర్మ శుక్రవారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనా జరక్కుండా చూడడానికి అయోధ్య-ఫైజాబాద్‌లో తగినన్ని బలగాలను మోహరించినట్లు కూడా ఆయన చెప్పారు. జిల్లా సరిహద్దులను మూసివేసారా అని అడగ్గా, పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికయితే నగరానికి ఎవరైనా వెళ్లవచ్చని ఆయన చెప్పారు. యాత్రకు వెళ్లే వారిని మాత్రం ఆపడం జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే అలాంటి వారిని ఎలా గుర్తిస్తారన్న విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు.
గృహ నిర్భందం లో మాన్య శ్రీ అశోక్ సింఘాల్ |
ఫైజాబాద్‌లో 13 కంపెనీల పిఏసి, మూడు కంపెనీల రాఫ్ బలగాలతో పాటుగా ఇద్దరు ఎస్పీలు, 19 మంది ఎఎస్పీలు, 42 మంది డిఎస్పీలు, 135 మంది ఇన్‌స్పెక్టర్లు, 430 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 1300 మంది పోలీసు కానిస్టేబుళ్లను నియమించినట్లు విశ్వకర్మ చెప్పారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా ఫైజాబద్, చుట్టుపక్కల జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశమై అక్కడి పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితిపై ఓ కనే్నసి ఉంచాలని, తమ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలను పార్టీకి, తనకు తెలియజేయాలని సిఎం వారిని కోరారు. ఇదిలా ఉండగా ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం సుమారు 70 మంది విహెచ్‌పి జాతీయ, రాష్ట్ర నాయకుల అరెస్టుకు వారంట్లు జారీ చేసింది. పరిక్రమలో 40నుంచి 50 వేల మంది విహెచ్‌పి కార్యకర్తలు పాల్గొనవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటివరకు 20 మంది విహెచ్‌పి కార్యకర్తలను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే రామ్‌విలాస్ వేదాంతి లాంటి అగ్రనేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణంపై ఒత్తిడి తెచ్చేందుకు విహెచ్‌పి ఈ నెల 25, సెప్టెంబర్ 13 మధ్య కాలంలో చౌరాసి కోశి పరిక్రమ యాత్రను చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్రకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
అయోధ్య పుర వీధులలో పార మిలటరీ బలగాల కవాతు |
ఆంధ్ర భూమి దిన పత్రిక సౌజన్యం తో
విశ్వ హిందు పరిషద్ 84 - కోసి అయోధ్య పరిక్రమ యాత్ర నేపధ్యంలో వేడెక్కుతున్న ‘అయోధ్య’
Reviewed by JAGARANA
on
11:46 AM
Rating:
No comments: