Top Ad unit 728 × 90

శ్రీ హరి సత్సంగ్ సమితి ఆధ్వర్యంలో " శ్రీ శైలం - మంత్రాలయం" శ్రీ రామ మందిర రథ యాత్ర ప్రారంభం

కర్నూల్ జిల్లా : విశ్వ హిందు పరిషద్ కేంద్రియా ప్రభంద సమితి సమావేశాలలో నిర్ణయించిన శ్రీ రామ జన్మ భూమి పరాక్రమ యాత్ర సన్నాహకంగా ప్రముఖ పుణ్య క్షేత్రాలయిన " శ్రీ శైలం - మంత్రాలయం " ల మధ్య శ్రీ హరి సత్సంగ్ సమితి - ఆంద్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో తేది 12/08/2013 నాడు మంత్రాలయం ఉత్తరాధికారి పూజనీయ శుభేంద్ర తీర్థాల పవిత్ర చేతుల మీదుగా ప్రారంభమయినది . మాన్య శ్రీ సుబ్బారాయప్ప గారు ఈ యాత్ర ప్రాముఖ్ గా వ్యవహరిస్తున్నారు .
ఈ శ్రీ రామ మందిర రథ యాత్ర  ప్రారంభోత్సవ కార్యక్రమం లో చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వారికి స్వామి వారు ఆశి: ప్రసంగంలో ఆశిస్సులు తెలుపుతూ " మర్యాదపురుషోత్తముని ఆలయం ఆయన పుట్టిన దేశంలో నిర్మించడానికి ఎవ్వరి అనుమతులు అవసరం లేదు అది కోట్లాది హిందువుల హాక్కు  , అలాంటిది మన హిందు దేశం లో శ్రీ రామ జన్మ భూమి అయోధ్య లో శ్రీ రాముని మందిరం నిర్మించలేకపోవడం  మన దౌర్భాగ్యం ,  ఇలాంటి పరిస్థితులకు కేవలం సంఘటిత హిందు సమాజ శక్తి మాత్రమె  సమాదానం చెప్పగలదు ఆ సర్వ శక్తి వంతుడైయిన భగవంతుడు మనకు ఆ శక్తి , సామర్త్యాలు  ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను " అని అన్నారు .
తదననతరం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో విశ్వ హిందు పరిషద్ కేంద్రీయ సహా కార్యదర్శి మాన్య శ్రీ గుమ్మాల సత్యం గారు యాత్ర ప్రాముఖ్యత యాత్ర విజయవంతం కావడానికి కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తూ " ప్రముఖ పుణ్య క్షేత్రలయిన ' శ్రీ శైలం - మత్రాలయం ' ల మధ్య జరుగుతున్న శ్రీ రామ మందిర రథ యాత్ర శ్రీ రామ జన్మ భూమి పరిక్రమ సన్నాహకంగా మాత్రమె జరగటంలేదు , ఈ యాత్ర పవిత్ర స్పందనలను నిర్మాణం చేస్తూ ఒక మహా ఉద్యమానికి ఉపిరిలుఉదేలా సాగుతుంది దీని ప్రభావం ప్రజల పై ఖచ్చితంగా ఉంటుంది , ఈ యాత్ర మాధ్యమంగా మనం క్రొత్త కార్యకర్తలను ఆ శ్రీ రాముని కార్యంలో కార్యోముఖులను చేయాలి , దాని కోసం మనం తన మన ధన పూర్వకంగా సమర్పితం కావాల్సి ఉంది పరమ పూజనీయ గురూజీ కాంచిన కాంచన స్వప్నం ఏంటో దూరంలో లేదు అది మన కన్నుల ఎదుటే ఉంది దాన్ని సాదిచాల్సిన పని మనం పూర్తీ చేయాల్సి ఉంది , పరిషద్ స్వర్ణ జయంతి సంవత్సరంలోనే అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మించాలి అనే లక్ష్యంతో పని చేయాల్సి ఉంది " అని అన్నారు .
     

ఈ కార్యక్రమంలో శ్రీ సాయి రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు , శ్రీ ప్రనేష్ గారు కార్యదర్శి , శ్రీ రాఘవేంద్ర , శ్రీ నరసింహ , శ్రీ రాములు గారు , శ్రీ తిర్పల్ గారు , శ్రీ ప్రతాప్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు .
శ్రీ హరి సత్సంగ్ సమితి ఆధ్వర్యంలో " శ్రీ శైలం - మంత్రాలయం" శ్రీ రామ మందిర రథ యాత్ర ప్రారంభం Reviewed by JAGARANA on 11:03 AM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.